నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు | narsapur express escaped from accident | Sakshi
Sakshi News home page

నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

Published Sat, Jan 4 2014 1:48 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

narsapur express escaped from accident

పాలకొల్లు, న్యూస్‌లైన్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెంకుళ్లపాడు వద్ద రైలు పట్టా విరిగిపోవడంతో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్‌కు బయల్దేరిన ఈ రైలు శుక్రవారం ఉదయం 8.20గంటలకు పాలకొల్లు స్టేషన్ దాటిన తరువాత పెంకుళ్లపాడు వద్ద రైలు పట్టా వెల్డింగ్ వదిలేయటంతో పెద్దశబ్దం వచ్చింది. డ్రైవర్ వెంటనే రైలును నిలిపివేశారు. మరమ్మతులు చేశాక రైలు బయల్దేరింది.
 

 ‘బొకారో’లో మంటలు
 
 పిఠాపురం, న్యూస్‌లైన్: విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఓ బోగీ అడుగున మంటలు చెలరేగాయి. రైలు శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని గోర్స రైల్వేగేటు వద్దకు వచ్చింది. గేట్‌మన్ ఎస్-5 బోగీ కింద మంటలను గుర్తించి పిఠాపురం స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. రైలు పిఠాపురం స్టేషన్‌కు రాగానే మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement