
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు పట్టణం మావుళ్లమ్మ పేటలో ఓ వివాహిత అనుమానాస్పదం గా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లుకు చెందిన ప్రియదర్శిని అనే వ్యక్తికి, మొగల్తూరు మండలం తూర్పుతాళ్లుకు చెందిన కోడి దుర్గ(19)కు ఏడాది క్రితం పెరుపాలెం బీచ్‌లో పరిచయం ఏర్పడింది. గత ఏడాది ఫిబ్రవరిలో దుర్గను ఇంటికి తీసుకొచ్చిన ప్రియదర్శిని.. ఏప్రిల్‌లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె తొమ్మిదినెలల గర్భవతి. కాగా, శుక్రవారం రాత్రి దుర్గ అనుమానాస్పదంగా మృతి చెందారు. భర్తే దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుర్గ బంధువులు ఆరోపిస్తున్నారు. మరో వైపు దుర్గ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ప్రియదర్శిని బంధువులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment