Suspicious death married woman
-
మహిళ అనుమానాస్పద మృతి.. భర్త రాత్రికి రాత్రే ...
కర్నాటక: ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన నగరంలోని జవహర్ నగర్లో జరిగింది. శిల్ప(28) అనే మహిళకు ఏడాది క్రితం శరత్‌తో వివాహమైంది. మంగళవారం రాత్రి ఆమెను భర్త హత్య చేసి పరారైనట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. భర్త శరత్, అత్త శశికళ, మామ సురేష్ తమ కుమార్తెను హత్య చేసి మేడ మీద నుంచి పడి మరణించిందని అబద్ధం చెబుతున్నారని వారు ఆరోపించారు. భర్త వచ్చేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు జరపనీయబోమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు నేతాజీనగర్ సీఐ నాగరాజ్ వవెల్లడించారు. -
టీచర్ సులోచన మృతికి కారణాలు ఏంటి?
కర్ణాటక (మైసూరు) : హిందీ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నంజనగూడు పట్టణంలోని మహదేశ్వర లేఔట్లో నివాసం ఉంటున్న సులోచన(45) నంజనగూడు తాలూకా మహాదేవనగరలోని మొరార్జీదేశాయి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. భర్త సురేష్ కొన్ని సంవత్సరాలక్రితం మృతి చెందాడు. ఇద్దరు పిల్లతో కలిసి నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. నంజనగూడు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
భర్త సెల్ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని..
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ప్రేమను జీవితాంతం కొనసాగించలేకపోయారు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. పలాస పొందర వీధిలోని పొందర కులానికి చెందిన పొందర తేజేశ్వరరావు, ఉదయపురంలోని చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మౌనికలు ఇరు కుటుంబాలను ఎదురించి మరీ నాలుగేళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. పలాస జీడిపిక్క బొమ్మకు సమీపాన కేటీ రోడ్డుకు ఆనుకుని ఉ న్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి కాపురం నాలుగేళ్లు సజావుగానే సాగింది. ఈ దంపతులు ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. ఆదివారం రాత్రి దంపతులు సినిమాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ మౌనిక ప్రాణాలు కోల్పోయింది. సెల్‌ఫోన్ తగిలి చనిపోయిందని, భర్త సెల్ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని స్థానికంగా రకరకాలు మాట్లాడుకుంటున్నారు. భర్త కూడా ఇలాగే చెబుతున్నారు. ఆదివారం రాత్రి సంఘటన జరిగితే సోమవారం ఉదయం పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించంతో సీఐ వేణుగోపాలరావు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం తర్వాతే వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి బంధువులు ‘కులాంతర వివాహం చేసుకున్నప్పుడే మా అమ్మాయిచనిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏమీ చనిపోలేదు’ అని మాట్లాడడం గమనార్హం. -
పాలకొల్లులో వివాహిత అనుమానాస్పద మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు పట్టణం మావుళ్లమ్మ పేటలో ఓ వివాహిత అనుమానాస్పదం గా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లుకు చెందిన ప్రియదర్శిని అనే వ్యక్తికి, మొగల్తూరు మండలం తూర్పుతాళ్లుకు చెందిన కోడి దుర్గ(19)కు ఏడాది క్రితం పెరుపాలెం బీచ్‌లో పరిచయం ఏర్పడింది. గత ఏడాది ఫిబ్రవరిలో దుర్గను ఇంటికి తీసుకొచ్చిన ప్రియదర్శిని.. ఏప్రిల్‌లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె తొమ్మిదినెలల గర్భవతి. కాగా, శుక్రవారం రాత్రి దుర్గ అనుమానాస్పదంగా మృతి చెందారు. భర్తే దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుర్గ బంధువులు ఆరోపిస్తున్నారు. మరో వైపు దుర్గ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ప్రియదర్శిని బంధువులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సాక్షి, వెదురుకుప్పం(చిత్తూరు) : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు... మండలంలోని నల్లవెంగనపల్లె పంచాయతీ కేవీఎం అగ్రహారం దళితవాడకు చెందిన వెంకటేశ్ భార్య వనజ(23) వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఈ విషయంపై అప్పట్లో కుటుంబ సభ్యులు వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, స్థానికుల సహకారంతో అప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో వెతకసాగారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే శుక్రవారం ఉదయం గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బావిలో గుర్తు తెలియని శవం కనిపించడంతో పొలం యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెదురుకుప్పం ఎస్ఐ సుమన్‌తో పాటు పోలీసులు, స్థానికులు సంఘనా స్థలానికి వెళ్లి పరిశీలించగా వనజ(23)గా గుర్తించారు. ముందుగా సరిగ్గా గుర్తించలేకపోయారు. 9 రోజులుగా బావిలో పడి ఉండడంతో శవం ఆనవాళ్లు కోల్పోయింది. మొదట్లో ఆడ మగా అనేది నిర్దారించలేకపోయారు. బావిలోకి దిగి వనజగా నిర్దారించిన తరువాత స్థానికుల సాయంతో పోలీసులు బావిలోంచి శవాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరుకు తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. వనజ(23) కుటుంబానికి పక్కనే ఉన్న మరో కుటుంబానికి ఉన్న కలహాల కారణంగా మృతి చెందినట్లు స్థానికులు అంటున్నారు. ఓ వివాదాస్పద విషయమై జరిగిన సంఘటనతో మనస్తాపం చెంది, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కొందరు, కుట్ర పూరితంగా హత్య చేయించి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. వనజ మృతితో ఇద్దరు పిల్లలు ఆనాథలుగా మిగిలిపోయినట్లు స్థానికులు బోరుమంటున్నారు. -
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి
కర్నూలు, చిత్తూరు(పూతలపట్టు) : పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో గురువారం వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. రేణిగుంట వినాయకనగర్‌కు చెందిన రమేష్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కే.రమ్య(19)ను పూతలపట్టుకు చెందిన భాస్కర్‌నాయుడు కుమారుడు ఈశ్వర్‌కు ఇచ్చి 2018 ఏప్రిల్‌లో పెళ్లి చేశారు. కొన్నాళ్లకే కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. భర్తతో పాటు కుటుంబ సభ్యులు రమ్యను కట్నం పేరుతో తరచూ వేధించేవారు. ఈ విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు చెప్పడంతో ఇటీవల రూ.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చి సర్దుబాటు చేశారు. వేధింపులు మాత్రం ఆగలేదు. ఏమి జరిగిందో కాని రమ్య గురువారం ఇంటికి సమీపంలో ఉన్న నీటికుంటలో శవమై తేలింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రామంజనేయులు, ఎస్ఐ మల్లేష్ యాదవ్, తహసీల్దార్ అక్కడికి చేరుకుని రమ్య మృతికి గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వరకట్న వేధింపులతోనే తమ కూతురు మృతి చెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు పూతలపట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భర్తతో పాటు అత్త, మామపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికను బట్టి కేసు దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
దంతాలపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో బుధవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన అన్నవరపు శ్రీను కుమార్తె శైలజ(28)కు పెద్దముప్పారం గ్రామానికి చెందిన ధర్మారపు యాకయ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించాడు. శైలజ ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, యాకయ్య ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలతో తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి కూడా గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున శైలజ మృతి చెందిందని వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారంతో సీఐ చేరాలు, ఎస్సై నందీప్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించి యాకయ్యే హత్య చేశాడని మృతురాలి తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
మాసాయిపేట (హనుమంతునిపాడు): మండల పరిధి క్రిస్టపల్లి పంచాయతీ మాసాయిపేట ఎస్సీ కాలనీకి చెందిన కోలా రవి భార్య రత్నకుమారి (21) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్ఐ యూ.హరిబాబు కథనం ప్రకారం..పొన్నలూరు మండలం భోగనంపాడుకు చెందిన రాజమ్మ కుమార్తె రత్నకుమారిని మేనమామ రవికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫిట్స్ వచ్చి మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు భర్త సమాచారం అందించాడు. మృతురాలి సోదరుడు బి.ప్రభుదాసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత అనుమానాస్పదమృతి
డి.ముప్పవరం (నిడదవోలు రూరల్) : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మరణించిన ఘటన మండలంలోని డి.ముప్పవరంలో మంగళవారం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కాకరపర్రుకు చెందిన గంగిరెడ్డి నాగలక్ష్మి (26)కి, డి.ముప్పవరానికి చెందిన గంగిరెడ్డి శ్రీనుకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. శ్రీనుకు రేచీకటి వ్యాధి ఉంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. వీరు అత్తమామలతో కలిసి డి.ముప్పవరంలో కాపురముంటున్నారు. మంగళవారం నాగలక్ష్మి ఇంటి నుంచి పొగలు రావడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా కాలిపోయిన స్థితిలో నాగలక్ష్మి మృతదేహం పడి ఉంది. ఆ సమయంలో భర్త శ్రీనుతోపాటు అత్త, మామలు పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని భర్త తరఫువారు చెబుతుండగా, అది హత్యేనని నాగలక్ష్మి బంధువులు ఆరోపిస్తున్నారు. ముమ్మాటికీ హత్యే అనుమానంతోనే నాగలక్ష్మిని అత్తింటివారే హత్యచేశారంటూ ఆమె బంధువులు ఆరోపించారు. ముందు కొట్టిచంపి, ఆ తర్వాత కాల్చివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడితే మంటలకు గదిలోని మంచం, ఇతర వస్త్రాలు కాలిపోయేవని, కేకలు వినిపించేవని, అటువంటివి ఏమీ లేకుండా గోడకు జారిపడి కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించిందని బంధువులు చెబుతున్నారు. దీనిని బట్టి అది హత్యేనని స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. వారి కథనం ప్రకారం.. నాగలక్ష్మి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే మరణించడంతో మేనమామ, మేనత్త పెంచి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో రూ. 85వేలు కట్నంగా ఇవ్వగా.. మరో 10వేలు ఇవ్వాల్సి ఉంది. పెళ్ళైన నాటి నుంచి నాగలక్ష్మిని ఆమె భర్త అనుమానంతో వేధించాడు. 15రోజుల క్రితం నాగలక్ష్మిని శ్రీను అనుమానంతో కొట్టగా సమాచారాన్ని తెలుసుకున్న మేనమామ దానయ్య వచ్చి కాకరపర్రు తీసుకు వెళ్లారు. వారం రోజుల క్రితం డి.ముప్పవరంలోని స్థానిక పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంతో నాగలక్ష్మి కాపురానికి వచ్చింది. తరుచూ అనుమానించే భర్తతో కాపురం చేయలేనంటూ నాగలక్ష్మి వేడుకున్నా.. పసిపిల్లలను వదిలి ఉండలేక ఆమె కాపురానికి వచ్చిందని బంధువులు చెబుతున్నారు.