
సాక్షి, పాలకొల్లు: పోలీసుస్టేషన్‌లో అన్యాయంగా నిర్బంధించారంటూ ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చోటు చేసుకుంది. తన ఇంట్లో బంగారం చోరి జరిగిందని మడికి మేరిరత్నం అనే మహిళ పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భాగంగా ఆమెను స్టేషన్‌కు పిలిచిన సిఐ ఆంజనేయులు.. బంగారం రీకవరి చేస్తామని, కాకపోతే ఆ బంగారం ధరను తక్కువగా చూపించి మరో కేసు పెట్టాలని డిమాండ్ చేశారని బాధితురాలు తరపు బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా ఆమెను చేయి పట్టుకుని లాగి నిర్బధించారని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పాలకొల్లు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఐ ఆంజనేయులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేరిరత్నం బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment