attempts suicide
-
రైల్వే ట్రాక్‌పై మహిళ ఆత్మహత్యాయత్నం
బాలానగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై సమాచారం అందడంతో సకాలంలో స్పందించిన బాలానగర్ పోలీసులు ఆమెను రక్షించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు కాలనీకి చెందిన మంగమ్మ (45) బుధవారం ఫిరోజ్‌గూడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న కానిస్టేబుళ్లు రవీందర్, సుధాకర్ రెడ్డి ఆమెను రక్షించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు. -
పీజీ మెడికో ఆత్మహత్యాయత్నం.. ఇంజక్షన్ కోసం మొబైల్లో సెర్చ్ చేసి!
సాక్షి వరంగల్/ఎంజీఎం: ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో సీనియర్ వేధింపులు భరించలేక. గట్టిగా మాట్లాడితే ఎక్కడ మార్కులు తగ్గిస్తారోనని భయపడింది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా వేధింపులు తగ్గలేదు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే తనలోతాను కుమిలిపోయి ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది. అదీ ఆస్పత్రిలో డ్యూటీగా ఉండగా జరగడంతో కలకలం సృష్టించింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. చిన్న కుమార్తె అయిన ప్రీతి(26) ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని కేఎంసీలో అనస్తీషియా పీజీ కోర్సులో 2022లో చేరింది. ప్రస్తుతం థియరిటికల్ క్లాస్‌లు జరుగుతున్నాయి. ఇక్కడే వేధింపులు అనస్తీషియా వైద్య విభాగ డ్యూటీ చార్టులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్(ఈఓటీ)లో రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ఎస్ఆర్, ఒక సీనియర్ పీజీ, ఇద్దరు జూనియర్ పీజీ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారు. కొన్ని రోజులుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తోంది. ఇక్కడ పరిచయమైన సీనియర్ సైఫ్ కొంతకాలంగా వేధిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ మోహన్‌దాసు ఆదేశాల మేరకు అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం సైఫ్, ప్రీతిలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెకు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనే అనుమానం కలుగుతోంది. ట్రెమడాల్ ఇంజక్షన్ ఎప్పుడు వాడుతారంటే.. ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ 50 ఎంజీ ఇంజక్షన్ కీళ్లు, కండరాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో మితమైన, తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనకు నొప్పి ఉందని చెప్పే మెదడులోని రసాయన దూతలను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, అస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. చికిత్స పొందుతున్న పరిస్థితినిబట్టి మోతాదు, వ్యవధిని డాక్టర్ నిర్ణయిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదు.. విద్యలో ఎదురయ్యే ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే విద్యార్థిని ప్రీతి కాదని బంధుమిత్రులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలోనూ సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో ఉద్యోగులకు సేవలందించిందని తెలిపారు. ప్రీతి తండ్రి రైల్వే విభాగంలో చేస్తున్న క్రమంలో తన తండ్రితో విధులు నిర్వర్తిస్తున్న వారి ఆరోగ్య సంరక్షణకు సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో విస్తృత సేవలందించిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుంది..? ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిందో ఎవరూ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ప్రీతి అనస్తీషియా ఇంజక్షన్ల సమాచారం కోసం తన సెల్ఫోన్లో తీవ్రంగా సెర్చ్ చేసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్న సందర్భంలో తీసుకునే ట్రెమడాల్ ఇంజక్షన్ తీసుకున్నట్లు కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. కానీ.. ప్రీతి ట్రెమడాల్ ఇంజక్షన్ కాకుండా అనస్తీషియా తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్టుతోపాటు తన శరీరంలో పలు అవయవాలు పనిచేయకుండా పోయాయని మరికొందరు వైద్యులు చర్చించుకుంటున్నారు. ఆరు నెలల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో అనస్తీషియా ఇంజక్షన్ వికటించిన సందర్భంలో సైతం ఇద్దరు రోగులు కార్డియాక్ అరెస్టు కావడం వల్ల చనిపోయిన సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు. మంత్రుల ఆరా.. ప్రీతి ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేధింపులు అయితే విచారణ కేసు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా స్పందించారు. సీపీ రంగనాథ్‌తో మాట్లాడి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే.. కాలేజీ, ఆస్పత్రిలో ర్యాగింగ్, వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌పై ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తా అంటే వద్దు డాడీ అంటూ నివారించిందని తండ్రి తెలిపారు. ఈనెల 20న ఏడుస్తూ కాల్ చేసిందని, పీజీ సీనియర్ డాక్టర్ అరాచకంపై ఏసీపీ కిషన్‌కు చెప్పినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో తనపై ఫిర్యాదు చేస్తావంటూ మరోసారి సైఫ్ ప్రీతిని బెదిరించగా మనస్తాపానికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పాడు. ఎంజీఎం సూపరింటెండెంట్ ఏమన్నారంటే.. ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో పలు అంశాలు వివరించారు. ఆపరేషన్ థియేటర్లో ప్రీతి కాకుండా విధుల్లో ఉన్న మరో అమ్మాయి, అబ్బాయితో మాట్లాడితే ఇంజక్షన్ ఏమీ తీసుకోలేదన్నారని తెలిపారు. ఆమెను పరిశీలిస్తే కార్డియాక్ అరెస్టు రావడంతో వైద్య బృందంతో సీపీఆర్(కార్డియో పులుమోనరీ రెసిటేషన్) ద్వారా చికిత్స చేసి ట్రీట్మెంట్ అందించామని చెప్పారు. గుండెకు సంబంధించి 28 శాతం ఏజెక్షన్ ఫ్రాక్షన్ ఒఫ్ హార్ట్, గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటీస్, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు. ప్రీతికి థైరాయిడ్ సమస్య, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టుగా తేలిందని చంద్రశేఖర్ తెలిపారు. కొన్ని రోజుల నుంచి ఓ అబ్బాయి వేధిస్తున్నాడు.. కొద్ది రోజుల నుంచి ఓ అబ్బాయి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని తన సోదరికి, కుటుంబ సభ్యులకు చెప్పింది. మాట్లాడుదామని భరోసా ఇచ్చాం. ఉదయం ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని మాకు చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. – దేవేందర్, ప్రీతి మేనమామ -
రెండు కుటుంబాల్లో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం
అమలాపురం టౌన్(తూర్పు గోదావరి): అక్రమ సంబంధం రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులకు దారి తీసింది. ఇందులో ఓ కుటుంబానికి చెందిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందితే.. ఆ రెండు కుటుంబాల్లోని భార్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమలాపురం పట్టణ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానానికి చెందిన పలచోళ్ల సూర్య కొండలరావు, సంధ్యాకుమారి భార్యభర్తలు. సూర్య కొండలరావు ఎస్.యానంలోని చమురు సంస్థలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి) వీరి కుటుంబం అమలాపురం రవణం మల్లయ్యవీధిలో కాపురం ఉంటోంది. ఇదే ప్రాంతంలో చెందిన గండు సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. సుబ్బారావుకు సూర్యకొండలరావు భార్య సంధ్యాకుమారికి అక్రమ సంబంధం ఉన్న విషయం ఆ రెండు కుటుంబాల్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి. తర్వాత భార్యభర్తలు సూర్యకొండలరావు, సంధ్యా కుమారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అక్రమ సంబంధం తెచ్చిన చిచ్చుతో మనస్తాపం చెందిన సుబ్బారావు భార్య నాగలక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తర్వాత సూర్య కొండలరావు, సంధ్యాకుమారి దంపతులు సోమవారం సాయంత్రం అల్లవరం మండలం బోడసకుర్రు వంతెన వద్ద పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తక్షణమే స్థానికులు స్పందించి ఆ భార్యాభర్తలను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ భర్త సూర్య కొండలరావు బుధవారం ఉదయం మృతి చెందినట్టు సీఐ బాజీలాల్ తెలిపారు. అతడి భార్య సంధ్యాకుమారి పరిస్థితి విషమంగానే ఉంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగలక్ష్మి కూడా అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సూర్యకొండలరావు ఆత్మహత్యకు, అతడి భార్య ఆత్యహత్యాయత్నానికి కారణమైన సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులతోపాటు రవణం సాయమ్మ అనే మహిళపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్ తెలిపారు. చదవండి: Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు -
కోదండరాం ఓడిపోయాడని యువకుడు ఆత్మహత్యాయత్నం
-
చాంద్రాయణగుట్ట పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం
-
పీఎస్‌లో కలకలం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: ఒంటిపై పెట్రోలు పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్‌లో కలకలం రేపింది. సెల్‌ఫోన్ చోరీ కేసులో అనుమానితుడైన షబ్బీర్ఆలీ పోలీసులు వేధిస్తున్నారని ఒంటికి నిప్పు పెట్టుకుని రోడ్డుపై పరుగులు తీశాడు. పోలీసు సిబ్బంది వెంటనే ఆ వ్యక్తి వెంట పడి మంటలను ఆర్పారు. షబ్బీర్‌ఆలీకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. -
టిక్కెట్ రాలేదని టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూర్యాపేట: టిక్కెట్ రాలేదనే కారణంతో టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కలకలం రేగింది. టీఆర్ఎస్ అధిష్ఠానం టిక్కెట్ కేటాయించలేదని తీవ్ర మనస్తాపం చెందిన టీఆర్ఎస్ నేత అబ్ధుల్ రహీం తన నివాసంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. పట్టణంలో 39వవార్డు నుంచి టిక్కెట్ ఆశించిన ఆయన భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. రెండు క్రితం నుంచి ప్రచారం చేపట్టారు. అదే వార్డు నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మొరిశెట్టి సుధారాణి కూడా ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు.. టిక్కెట్ ఖరారు కాకముందే ఇరువురు అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేసుకోవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, మంగళవారం ప్రకటించిన జాబితాలో సుధారాణికి టిక్కెట్ ఖరారు కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన రహీం ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాలడ్డారు. సమయానికి స్థానికులు గమనించి ఆయనను కాపాడారు. -
పోలీసులు వేధిస్తున్నారని..
సాక్షి, మిర్యాలగూడ: దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న పాత నేరస్తుడు గాజు ముక్కలు మింగాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే గాజుముక్కలు మింగినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సట్టు నాగేశ్వర్రావు గతంలో ఓ దొంగతనం కేసులో శిక్ష అనుభవించాడు. కాగా, కొద్దిరోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన చోరీ కేసులో అతడిని అనుమానితుడిగా గుర్తించిన వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం పోలీస్‌స్టేషన్ మరుగుదొడ్డికి వెళ్లిన అతను అందులోని విద్యుత్ బల్బును వెంట తెచ్చుకున్నాడు. సెల్‌లోకి వెళ్లి ముక్కలుగా చేసి మింగాడు. దీంతో అతనిని స్థానిక ఏరియా ఆస్పత్రికి.. పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తరలించారు. తనను దొంగతనం కేసులో 13 రోజుల క్రితం తీసుకొచ్చారని, అప్పటినుంచి తీవ్రంగా హింసిస్తున్నారని నాగేశ్వర్రావు ఆరోపించాడు. తన కాళ్లు పనిచేయడం లేదని, పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకనే గాజు బల్బును పగులగొట్టి మింగానని ఆవేదన వ్యక్తం చేశాడు. -
పాలకొల్లులో మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, పాలకొల్లు: పోలీసుస్టేషన్లో అన్యాయంగా నిర్బంధించారంటూ ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చోటు చేసుకుంది. తన ఇంట్లో బంగారం చోరి జరిగిందని మడికి మేరిరత్నం అనే మహిళ పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భాగంగా ఆమెను స్టేషన్‌కు పిలిచిన సిఐ ఆంజనేయులు.. బంగారం రీకవరి చేస్తామని, కాకపోతే ఆ బంగారం ధరను తక్కువగా చూపించి మరో కేసు పెట్టాలని డిమాండ్ చేశారని బాధితురాలు తరపు బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా ఆమెను చేయి పట్టుకుని లాగి నిర్బధించారని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పాలకొల్లు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఐ ఆంజనేయులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేరిరత్నం బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నం
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదని నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నాడు. పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కిందకు దింపి అతని ప్రాణాలను కాపాడారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండె మండలం గుడిబండ గ్రామానికి చెందిన గణేష్ భార్య భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. కాపురానికి రావడానికి భార్య నిరాకరించడంతో చేసేది లేక శనివారం రాత్రి సుమారు 100 అడుగుల ఎత్తు ఉన్న నీటి ట్యాంక్ ఎక్కాడు. భార్య కాపురానికి రాకపోతే పైనుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకొంటానని బెదిరించారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ సీఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. ఎంతో నేర్పుతో అతడికి నచ్చజెప్పి కిందకు దించారు. తరువాత భార్య భర్తలిద్దరికి సర్దిచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. -
ముగ్గురు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన మహిళ
-
నారయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తిరుపతి: నారాయణ విద్యాసంస్థలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతి నారయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న వాసు మొదటి అంతస్థుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే పాఠశాల సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి వాసుకి తీవ్ర గాయలయ్యాయి. ఇదే విద్యాసంస్థలో పది రోజుల క్రితమే పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరవక ముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటంతో తొటి విద్యార్థులకు, తల్లితండ్రులకు ఆందోళన నెలకొంది. అయితే వాసు తల్లితండ్రులు మాత్రం సిబ్బంది వేధింపులే తమ కొడుకు ఆత్మహత్యయత్నానికి కారణమని ఆరోపించారు. -
కళ్యాణి ఏమైంది?
-
భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత.. పరారీ
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే దారుణానికి దిగాడు. భార్యతో గొడవపడి ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే, ఇంట్లో ఉన్న ఇతరులు అతడి చర్యను అడ్డుకోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. భార్య మాత్రం చనిపోయింది. బీజేపీ నాయకుడు కులదీప్ తోమర్ తన భార్య పూనమ్‌తో తొలుత గొడవపడ్డాడు. ఆ తర్వాత విపరీతంగా తిట్టుకున్నారు. తొలుత చేయి చేసుకున్న ఆయన అనంతరం తన దగ్గర ఉన్న తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. అనంతరం తనకు తుపాకీ ఎక్కుపెట్టుకొని కాల్చుకోబోతుండగా ఇంట్లో మేనళ్లుడు వచ్చి అడ్డుకున్నాడు. పూనమ్‌ను ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, భార్య చనిపోయిందనే భయంతో ప్రస్తుతం కులదీప్ పరారీలో ఉన్నాడు. మొత్తం ఆయన కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కిరోసిన్ పోసిన భర్త..నిప్పంటించుకున్న భార్య
నాగార్జునసాగర్ : భార్యాభర్తల మధ్య గొడవ జరిగి భార్యపై భర్త కిరోసిన్ పోయగా ఆమె కోపంతో నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానిక పైలాన్‌కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బం డారు షిలారు(సైదులు), రమాదేవి దంపతులు. కాగా షిలారు మద్యానికి బానిసై మంగళవారం కూడా బాగా తాగి వచ్చాడు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మళ్లీ మద్యం తాగి వస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని రమాదేవి పేర్కొంది. దాంతో షిలారు కోపంతో నీవేంటి పోసుకునేది నేనేపోస్తా అంటూ భార్యపై కిరోసిన్ పోశాడు. అనంతరం రమాదేవి ఆగ్రహంతో వంటికి నిప్పంటించుకుంది. అనంతరం షిలారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే 50 శాతం శరీరం కాలిపోయింది. వెంటనే స్థానిక కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నల్లగొండకు తరలించారు. మంటలు ఆర్పే క్రమంలో షిలారు చేతులు కూడా కాలడంతో సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఇటార్సీలో దారుణం
-
దర్శకుడిపై నటి ఆరోపణలు
చెన్నై: దర్శకుడు సెల్వకణ్ణన్ వేధింపులకు గురి చేయడం వల్లే ఆత్మహత్యాయత్నం చేశానని సినీ నటి అతిథి అలియాస్ అథిరా సంతోష్ వెల్లడించింది. తనను చంపుతానని బెదిరించాడని వాపోయింది. గత నెల 28న విషం తాగి ఆమె ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది. సెల్వకణ్ణన్ పై నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశానని మీడియాతో అతిథి చెప్పింది. నడిగర్ సంఘంలో సభ్యుడు కానందున అతడిపై చర్య తీసుకోలేమని అధ్యక్షుడు విశాల్ చెప్పారని వెల్లడించింది. దీంతో సెల్వకణ్ణన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ లో నటించిన అతిథి, తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేమిస్తున్నానంటూ సెల్వకణ్ణన్ తన వెంటపడి వేధించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని వాపోయింది. తాను ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించాడని తెలిపింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్టు వెల్లడించింది. -
టెన్త్ విద్యార్థినిపై మేనమామ పైశాచికం..
జింద్: తనపై మేనమామ లైంగిక దాడి చేస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో పదో తరగతి చదువుతున్న బాలిక ఓ ఎస్పీ ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్యకు దిగింది. విషం తీసుకొని స్పృహకోల్పోయింది. ప్రస్తుతం ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జింద్ జిల్లాలోని కైతాల్ దయోరా ఖురానా అనే ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న బాలిక తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. అయితే, గత కొద్ది రోజులుగా అతడి విచక్షణను మరిచి ఆ బాలిక పై లైంగిక దాడి చేస్తూ వస్తున్నాడు. దీంతో ఆ బాలిక మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కానీ వారు ఫిర్యాదు నమోదు చేసుకోకపోవడంతోపాటు వెళ్లి పంచాయతీలో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆ బాలిక నేరుగా విషయం తీసుకొని వెళ్లి ఎస్పీ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక0 మేనమామను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీంను పంపించింది. -
సహాయ నటుడు ఆత్మహత్యాయత్నం
తిరువొత్తియూరు: భార్య విడాకులు ఇచ్చేందుకు నోటీసు పంపడంతో విరక్తి చెందిన సినిమా సహాయ నటుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఓనాయుం, ఆటుకుట్టిం, డమాల్ డుమీల్, శకుని తదితర సినిమాల్లో సహాయ నటుడిగా నటించిన అరసు అనే ఇలవరసన్. ఇతను 2012వ సంవత్సరం మార్చి 9వ తేదీన కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి శివ అనే కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలతో ఇద్దరు విడిపోయి జీవిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇలవరసన్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది చూసిన ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికి చేరుకుని విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఇలవరసన్ను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కొడుంగయూర్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అతని ఇంట్లో లభించిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో సినీ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు దీనంగా తన బాధను వ్యక్తం చేస్తూ రాసినట్టు తెలిసింది. అందులో తాను ఏడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని తనకు సినిమా రంగంలో తగిన జీతం అందలేదని, దీని వలన కుటుంబంలో తనకు తన భార్యకు మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని తాను విరక్తి చెంది ఉన్న సమయంలో తనకు తన భార్య నుంచి విడాకులు కోరుతూ నోటీసు అందిందని, దీని వలన తన కుమారుడికి ఇబ్బందులు గురవుతున్నాడని దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అసిస్టెంట్ కమిషనర్ ఆత్మహత్యా యత్నం
బెంగళూరు(బనశంకరి): కర్ణాటకలో మరో అధికారిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన గురువారం హాసన్నగరంలో చోటుచేసుకుంది. వివరాలు....... హాసన్ అసిస్టెంట్ కమిషనర్ విజయా బెంగళూరులో గురువారం కేఏటీ విచారణ ముగించుకుని ఇంటికి వెనుదిరిగింది. ఈ సమయంలో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హాసన్ ఏఎస్పీ శోభారాణికి ఫోన్‌చేసింది. ఆ తర్వాత విజయ ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడికి వెళ్లిన శోభారాణి ఇరుగుపొరుగు వారి సాయంతో విజయను కాపాడి హాసన్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలిసింది. ఈమెపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పలు సంఘాలు ధర్నాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని కిమ్స్‌కు బదిలీ చేశారు. దీంతో కేఏటీని ఆశ్రయించి హాసన్‌కు బదిలీ చేయించకుంది. అయితే కేఏటీకి తప్పుడు సమాచారం అందించారని లాయర్ దేవరాజ్‌గౌడ ఆరోపించడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. -
మహిళా ఎస్ఐ ఆత్మహత్యా యత్నం
బెంగళూరు: నగరంలో ఓ మహిళా ఎస్ఐ మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డీఎస్పీలైన కల్లప్ప, గణపతిల బలవన్మరణాలు ఘటనలు మరిచిపోవడానికి ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సహచర ఉద్యోగులు చెబుతున్న వివరాల ప్రకారం...స్థానిక విజయనగర పోలీస్‌స్టేషన్‌లో రెండేళ్లుగా ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రూపా మొదటి నుంచి సున్నిత మనస్కురాలు. దీని వల్ల కేసుల పరిష్కారం సరిగా జరిగేది కాదని తెలుస్తోంది. అయితే పోలీస్‌శాఖలో కొంత కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే విధులుసజావుగా సాగుతాయని ఉన్నతాధికారులు చెబుతూ వచ్చేవారు. అయితే రూపా తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు. ఈ నేథ్యంలోనే మంగళవారం సాయంత్ర స్టేషన్‌లోని ఉన్నతాధికారులకు, రూపాకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అటుపై ఆవేశంతో ‘మీకు సరైన గుణపాఠం చెబుతా. డీఎస్పీ గణపతి మాదిరి నేను కూడా...’ అంటూ ఉన్నతాధికారులు ఉన్న గది నుంచి బయటికి వచ్చి వేగంగా యూనిఫాంలోనే తన ఇంటి వైపు వెళ్లారు. ఆ సమయంలో ఆమె నిద్రమాత్రలు మింగారు. కంగుతిన్న అధికారులు అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ రూపాను అనుసరించాల్సిందిగా కానిస్టేబుల్స్‌కు సూచించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత రూపా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే కానిస్టేబుల్స్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి రూపాను స్థానికుల సహకారంతో దగ్గర్లోని సుగుణ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వైద్యాధికారి రవీంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా మొబైల్ దొంగతనం విషయం పైన రూపా ఆత్మహత్య యత్నం ఘటనలో మరో వాదన కూడ వినిపిస్తుంది. స్టేషన్ పరిదిలో ఇటివల జరిగిన ఓ అతి ఖరీదైన మొబైల్ దొంగతనం జరిగింది. రెండు రోజుల ముందు ఆ మొబైల్ రికవరీ కూడ అయింది. అయితే మొబైల్ బాధితుడికి ఆ మొబైల్ ఇవ్వ కుండా రూపా తన వద్ద పెట్టుకుంది. ఈ విషయం ఉన్నతాధికారులకు కూడ తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారి రూపను ప్రశ్నించడమే కాకుండ స్టేషన్ డైరిలో ‘‘రూపా రికవరి మొబైల్‌ను దుర్వినియోగం చేసింది’’ అని లిఖిత పూర్వకంగా రాశారు. దీంతో మనోవేదనకు గురైన రూపా ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. కాగా పోలీసు ఉన్నతాధికారులు చరణ్‌రెడ్డి, సందీప్ పాటిల్ ఆస్పత్రికి వెళ్లి రూపను పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని సిబ్బందిని ఆరా తీశారు. -
భార్య పట్టించుకోలేదని...
-
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే లోపే..
బహదూర్‌పురా(హైదరాబాద్): భర్తతో గొడవ పడిన ఓ మహిళ నెహ్రూ జూలాజికల్ పార్కులోని మీరాలం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన మోసీనా పర్వీన్(40), అబ్దుల్ అన్నాన్ దంపతులు. కొన్ని సంవత్సరాలుగా మోసీనా పర్వీన్‌తో భర్త అబ్దుల్ అన్నాన్ ‘అంటిముట్టనట్లు’గా ఉంటున్నాడు. దీనిపై కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శనివారం స్టేషన్‌కు వచ్చింది. ఫిర్యాదును విన్న పోలీసులు భర్తతో కలిసి ఉండాలంటూ సర్ది చెబుతూ కౌన్సెలింగ్ ఇచ్చే లోపు పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వెళ్లి నేరుగా జూపార్కు చెరువుకు వెళ్లింది. అక్కడ చెరువులో దూకేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న జూ సిబ్బంది అప్రమత్తమై పర్వీన్‌ను బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. దీంతో పర్వీన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
పెళ్లయిన ఆర్నెల్లకే.. ప్రియుడితో ఆత్మహత్య
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం హజీపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఓ జంట శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం కనపర్తి గ్రామానికి చెందిన సౌందర్య... ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నమ్నూరు గ్రామంలోని బంధువుల ఇంటికి తరచుగా వెలుతుండేది. ఈ క్రమంలో నమ్నూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి సురేష్‌తో ప్రేమ చిగురించింది. విషయం పెద్దలకు తెలియడంతో సౌందర్యకు ఆరు నెలల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. కాగా, వారం క్రితం సౌందర్య, సురేష్ కలసి అదృశ్యమయ్యారు. దీంతో సౌందర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సురేష్‌పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. శనివారం వీరు హజీపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పురుగుల మందు సేవించడంతో వారిని సత్వరమే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మార్చారు. చికిత్స పొందుతూ సౌందర్య మృతి చెందగా, సురేష్ పరిస్థితి విషమంగా ఉంది. -
హల్‌టికెట్ ఇవ్వలేదని...
-
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
-
మేడ్చల్ CMR కాలేజీ విద్యార్ధి ఆత్మహత్య
-
కత్తితో నరుక్కుని ఆత్మహత్య
-
హోదా కోసం విద్యార్థి ఆత్మహత్యాయత్నం
-
ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం ప్రకారం... గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యకు శ్రీశైలం, మహేశ్, చంద్రశేఖర్, కుమార్ అనే నలుగురు కుమారులు ఉన్నారు. వీరు ఇటీవలే గ్రామంలో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. ఆ స్థలంలో కురుమ, యాదవ సంఘం వారు భవనం నిర్మాణం కోసం పునాదులు తీశారు. దీంతో ఇరు వైపుల వారి మధ్య వివాదం మొదలైంది. ఆ స్థలం తమదంటే, తమదని వారి మధ్య వివాదం నడుస్తోంది. దీంతో జడ్చర్లకు చెందిన ఓ రాజకీయ నేత మధ్యవర్తిత్వం వహించాడు. ఆయన సంఘం వారికే వంత పాడుతున్నాడంటూ మనస్తాపం చెందిన వెంకటయ్య, ఆయన నలుగురు కుమారులు ఆదివారం జడ్చర్లకు వెళ్లారు. మధ్యవర్తిత్వం వహించిన నేత ఇంటి వద్దే పురుగుల ముందు తాగారు. వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శ్రీశైలం, మహేశ్ మృతి చెందారు. చంద్రశేఖర్, కుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. వెంకటయ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఎదురుచూసి మోసపోయింది!
- అసోంలోని అత్తారింటికి బయలుదేరి.. భర్త చేతిలో మోసపోయిన యువతి - సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడురోజులుగా పడిగాపులు - మోసపోయానని గ్రహించి ట్యాంక్ బండ్ వద్ద ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి...సొంత రాష్ట్రానికి తీసుకుని వెళతానని నమ్మించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వదిలించుకుని వెళ్లిపోయాడు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా మూడు రోజులు వేచి చూసిన ఆ యువతి.. చివరికి మోసపోయానని గ్రహించింది. తీవ్ర మనస్థాపంతో అలా నడుచుకుంటూ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. అదృష్టవశాత్తు ఆమెను పోలీసులు కాపాడారు. లేక్ ఇన్స్పెక్టర్ కె.శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం దోగి గ్రామానికి చెందిన అమీరాబేగం స్థానికంగా సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుంది. శంకర్‌పల్లిలో ఆమె పనిచేసే చోట అసోం రాష్ట్రానికి చెందిన సాహబ్ అలీ కూడా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరి ప్రేమగా మారింది. జూలై 15వ తేదీన ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని శంకర్‌పల్లిలో కలిసి నివసిస్తున్నారు. తన సొంత రాష్ట్రమైన అసోంకు తీసుకుని వెళతానని సాహబ్ అలీ గత నెల 30వ తేదీన అమీనాబేగంను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకుని వచ్చాడు. ఆమెను ప్లాట్‌ఫాంపై వదిలి టికెట్లు తెస్తానని వెళ్లి తిరిగిరాలేదు. శనివారం వరకు స్టేషన్ లోనే వేచి చూసిన ఆమె మోసపోయానని గ్రహించి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. సాయంత్రం లేపాక్షి పూజా స్టోర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఆమెను లేక్ పోలీసులు గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి విచారించగా తనకు జరిగిన మోసం గురించి చెప్పింది. దీంతో ఆమె వివరాల కోసం జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ముషీరాబాద్‌లోని మహిళా హోంకు ఆమెను తరలించారు. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యా యత్నం
మహబూబ్ నగర్: విచారణలో ఉన్న రిమాండ్ ఖైదీ గొంతు కొసుకుని బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన మంగళవారం గద్వాల్లో వెలుగులోకి వచ్చింది. రాజు అనే పాత నేరస్తుడిని ఓ దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా స్టేషన్ ఆవరణలో బ్లేడుతో గొంతుకొసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పోలీస్ సిబ్బంది సదరు వ్యక్తిని కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డిపో ఎదుట డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
మెదక్(సంగారెడ్డి): సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రైవర్ నుంచి కిరోసిన్ డబ్బా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు సంగారెడ్డి డిపోలో దీక్ష చేపట్టారు. ఎట్టి పరిస్థితిల్లో ఈ రోజు బస్సు నడిపించి తీరతామని పోలీసులు చెప్పడంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. -
కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కేసు విచారణ నిమిత్తం ఎర్రమంజిల్ కోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పి.వంశీకృష్ణ (30)ను మారేడ్‌పల్లి పోలీసులు 2012లో వ్యభిచారం కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ-1 ముద్దాయి అయిన వంశీకృష్ణ అప్పటి నుంచి కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరవుతూ ఉన్నాడు. మంగళవారం కేసు విచారణ ఉండటంతో కోర్టుకు వచ్చాడు. బెంచ్‌లో తన కేసు విచారణ జరుగుతుండగా వంశీకృష్ణ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. నోటి నుంచి నురగలు రావడం గమనించి అక్కడి సిబ్బంది వెంటనే సోమాజిగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, బాధితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా సంబంధీకులకు ఫోన్ చేస్తే వారు అతనితో తమకు సంబంధంలేదని చెప్తున్నారని పోలీసులు తెలిపారు. కోర్టు సూపరింటెండెంట్ శోభాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం
-
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్‌ఫండ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ శుక్రవారం జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న ఆయన 58 నిద్రమాత్రలు మింగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కునాల్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు హుటాహుటీన ఎన్ఎన్కెఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా కునాల్ ఘోష్‌పై ఆరోపణలు రావటంతో తృణమూల్ కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కునాల్ గత నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు కునాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించటంతో జైల్లోనే ఉన్నారు. శారద స్కాంలో ప్రమేయం ఉన్న చాలామంది స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, మూడు రోజుల క్రితం కునాల్ కోర్టుకు వెల్లడించారు. వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. -
జయలలిత కోసం నటి ఆత్మహత్యాయత్నం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను విడుదల చేయాలని కోరుతూ ఆ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. జయకు జైలు శిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ కోలీవుడ్ నటి మాయ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం మాయ తన కుమార్తె గుణప్రియతో కలసి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఆమె తన వెంట కిరోసిన్ క్యాన్ కూడా తీసుకువచ్చారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మాయను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. జయలలిత కోసం తాను, తన కుమార్తె ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నామని మాయ చెప్పారు. దివంగత ఎంజీఆర్ నటించిన 'అమరకావ్యం', రజనీకాంత్ సినిమా 'గర్జనాయ్'లలో మాయ నటించారు. -
కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్
-
పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ సంఘటన జరిగింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు వెంటనే మంటలు ఆర్పి బాధితుణ్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప్రత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి మూడేళ్ల క్రితం దొంగతనం కేసులో నిందితుడు. ఇటీవల మియాపూర్ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరగడంతో అతణ్ని పిలిపించి పోలీసులు విచారించారు. అయితే ప్రస్తుతం తాను దొంగతనం చేయడం మానేశానని, పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని బాధితుడు చెప్పాడు. అయినా పోలీసులు వేధించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు ఆరోపించాడు.