అసిస్టెంట్ కమిషనర్ ఆత్మహత్యా యత్నం
బెంగళూరు(బనశంకరి): కర్ణాటకలో మరో అధికారిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన గురువారం హాసన్‌నగరంలో చోటుచేసుకుంది. వివరాలు....... హాసన్ అసిస్టెంట్ కమిషనర్ విజయా బెంగళూరులో గురువారం కేఏటీ విచారణ ముగించుకుని ఇంటికి వెనుదిరిగింది. ఈ సమయంలో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హాసన్ ఏఎస్పీ శోభారాణికి ఫోన్‌చేసింది. ఆ తర్వాత విజయ ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడికి వెళ్లిన శోభారాణి ఇరుగుపొరుగు వారి సాయంతో విజయను కాపాడి హాసన్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలిసింది. ఈమెపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పలు సంఘాలు ధర్నాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని కిమ్స్‌కు బదిలీ చేశారు. దీంతో కేఏటీని ఆశ్రయించి హాసన్‌కు బదిలీ చేయించకుంది. అయితే కేఏటీకి తప్పుడు సమాచారం అందించారని లాయర్ దేవరాజ్‌గౌడ ఆరోపించడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.