Assistant Commissioner
-
సీఎం రేవంత్‌రెడ్డి రెడ్‌డైరీలో బోధన్ ఏసీపీ పేరు..!
నిజామాబాద్: జిల్లాలో ఏళ్లుగా తిష్ట వేసిన పోలీస్ అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పైరవీలు షు రూ చేశారు. ప్రస్తుతం ఉన్నవాళ్లంగా బీఆర్ఎస్ ఎ మ్మెల్యేల సిఫార్సుల ద్వారా జిల్లాలో పోస్టింగ్ పొందారు. గతంలో అధికార పార్టీకి అండగా ఉండి ప్రతిపక్షపార్టీలపై కఠినంగా ఉండటంతో కొంత మంది పోలీసు అధికారులకు బదిలీ తప్పదనే ప్రచారం ఉంది. జిల్లాలోని 6 నియోజకవర్గంలో రెండు స్థానా ల చొప్పున బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యేల సి ఫార్సు లేఖలతో ఎస్సైలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలు పోస్టింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సిఫార్సుతో వచ్చినవారే విధుల్లో ఉన్నారు. పదిహేను రోజుల్లో జిల్లాలో పోలీసుల బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతుంది. సిఫార్సులతో వచ్చిన వారిపై ఆరా.. జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిఫార్సులో వచ్చిన పోలీసులకు సంబంధించిన వివరా ల జాబితాను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. వీరు పని చేసిన ప్రాంతంలో ప్రతిపక్షా పారీ్టలపై వ్యవహరించిన తీ రుపై జాబితాను తీసుకున్నట్లు సమాచారం. ఇటీవ ల అధికార పార్టీ ఎమ్మెల్యేను సీఐతో పాటు ఎస్సైలు వెళ్లి మర్యాద పూర్వకంగా కలవగా ఎన్నికల్లో అప్ప టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై సదరు ప్రజాప్రతినిధి ప్రస్తావించడంతో పో లీసు అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ వద్ద పోలీసుల జాబితా ఎన్నికల సమయంలో గత సీపీ సత్యనారాయణపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫి ర్యాదు చేయడంతో సీపీ కల్మేశ్వర్‌కు ఎన్నికల సంఘం పోస్టింగ్ ఇచ్చింది. ఎన్నికలప్పుడు అధికార పారీ్టకి అండగా ఉన్నారని ఎస్సై, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు, సీపీ కల్మేశ్వర్‌కు జాబితాను అందించినట్లు తెలిసింది. వారికి బదిలీ తప్పదనే చర్చ జరుగుతోంది. వ్యక్తిగత సెలవులో బోధన్ ఏసీపీ ఎన్నికల సమయంలో ఎడపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులిశ్రీనివాస్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో జరిగిన సమావేశంలో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ పేరును తన రెడ్‌డైరీలో రాసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 2న జిల్లా పర్యటనకు వచ్చిన ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను కూడా కాంగ్రెస్ నాయకులు కలిసి సదరు పోలీసులపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్, ఎస్‌హెచ్‌వో ప్రేమ్‌కుమార్ వ్యక్తిగత సెలవులో వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బదిలీవేటు తప్ప దని భావించిన ఏసీపీ, ఎస్‌హెచ్‌వో వ్యక్తిగత సెలవులలో వెళ్లినట్లు పోలీస్వర్గాలలో ప్రచా రం జరుగుతుంది. -
సీజీఎస్టీ అధికారి బొల్లినేని గాంధీ సస్పెన్షన్ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బొల్లినేని శ్రీనివాసగాంధీ సస్పెన్షన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) మరోసారి పొడిగించింది. 2021 ఫిబ్రవరిలో బొల్లినేని సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు అనేకసార్లు సస్పెన్షన్‌ను పొడిగించారు. తాజాగా ఆయన సస్పెన్షన్‌ను 2023 మే 7వ తేదీ వరకు పొడిగించింది. బొల్లినేనిపై సీబీఐ రెండుసార్లు కేసు నమోదు చేయగా, హైదరాబాద్ పోలీసులు కూడా ఆయనపై ఒకసారి కేసు నమోదు చేశారు. 2019లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ బొల్లినేని, ఆయన భార్యపై కేసు నమోదు చేసింది. సెంట్రల్ జీఎస్టీకి సంబంధించిన ఎగవేత నిరోధక విభాగంలో బొల్లినేని శ్రీనివాస్గాంధీ పనిచేస్తున్నప్పుడు వివేకానందస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై సీబీఐ చర్య తీసుకుంది. అయితే అనంతరం అదే విభాగంలో ఆయన కొనసాగారు. కానీ 2021 ఫిబ్రవరిలో సీబీఐసీ బొల్లినేని గాంధీతో పాటు మరో అధికారి సుధారాణిని లంచం కేసులో సస్పెండ్ చేసింది. అప్పటినుంచి బొల్లినేని సస్పెన్షన్‌ను పొడిగిస్తోంది. -
దేవదాయశాఖ డీసీ, ఏసీల వ్యవహారంపై విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఉప కమిషనర్ (డీసీ) ఈవీ పుష్పవర్ధన్‌పై సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుకతో దాడి చేసిన వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ఆదేశాల మేరకు రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్జేసీ) సురేష్‌బాబు విచారణ జరిపారు. శుక్రవారం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆర్జేసీ విచారణ చేపట్టారు. డీసీ పుష్పవర్ధన్, ఏసీ శాంతిలతోపాటు ప్రత్యక్ష సాక్షులు దేవదాయ శాఖ పర్యవేక్షకులు బి.ప్రసాదరావు పట్నాయక్, రాజారావు, టర్నర్ సత్రం ఈవో అల్లు జగన్నాథరావులను విచారించారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఘటన జరిగినప్పుడున్న అధికారులు, సిబ్బంది నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. వివరణ కోరిన మహిళా కమిషన్ విశాఖ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపణలపై విచారణ నివేదిక అందజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్‌ను కోరారు. దేవదాయ శాఖ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పని తీరుపై కూడా మహిళా కమిషన్ ఆరా తీసింది. -
డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక చల్లిన అసిస్టెంట్ కమిషనర్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్ప వర్థన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక చల్లారు. పుష్ప వర్ధన్ మాన్సస్, సింహాచలం భూముల అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. గురువారం ఆయన తన ఛాంబర్లో కూర్చుని ఉండగా శాంతి చేతిలో ఇసుకతో గదిలోకి వచ్చారు. కోపంగా ఆయనపై ఇసుకను చల్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డవటంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్..అసిస్టెంట్ కమిషనర్ల విభేదాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, తనను డిప్యూటీ కమిషనర్ మానసికంగా వేధిస్తున్నాడని, ఆ బాధ తట్టుకోలేక ఓ మహిళగా ఆయనపై ఇసుక చల్లి నిరసన తెలియజేశానని ఆమె తెలిపింది. కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించనున్నారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై డిసిప్లీనరీ యాక్షన్స్ తీసుకోనున్నారు. -
ఏపీ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ పై ఏసీబీ దాడులు
-
అసిస్టెంట్ కమిషనర్‌పై చర్యలు!
► విశాఖలో కొనసాగించబోమన్న కమిషనర్ ► కలెక్టర్ సమక్షంలో హామీ ► ఆందోళన విరమించిన దేవాదాయ ఉద్యోగులు సాక్షి, విశాఖపట్నం : దేవాదాయ, ధర్మాదాయశాఖ కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగులు ఆందోళన విరమించారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్ వేధింపులకు నిరసనగా నాలుగు రోజుల నుంచి వీరంతా సామూహిక సెలవులో ఉన్నారు. విధులను బహిష్కరించి వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఏసీ పుష్పవర్థన్ పై చర్యలు తీసుకోవాలని, ఇక్కడ నుంచి బదిలీ చేయాలని వీరు డిమాండ్ చేస్తూ తొలుత ఆ శాఖ కమిషనర్ వై.వి.అనురాధకు, ఆ తర్వాత విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబుకు విన్నవించారు. దీనిపై కమిషనర్ అనురాధ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ)తో విచారణకు ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ వివాదాన్ని పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందులోభాగంగా శుక్రవారం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ విచారణ చేపట్టారు. శనివారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దేవాదాయశాఖ డిప్యూటి కమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి సహా, ఈవోలు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. కమిషనర్ అనురాధతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. సహాయ కమిషనర్ పుష్పవర్థన్ ఈనెల 12 వరకు సెలవులో ఉన్నారని, అనంతరం ఆయనను విశాఖ నుంచి బదిలీ చేస్తామని, ఇక్కడ కొనసాగించబోమని హామీ ఇచ్చారు. అందువల్ల ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వహించుకోవచ్చని చెప్పారు. దీంతో ఉద్యోగులు, ఈవోలు చర్చించుకున్నారు. 12 తర్వాత ఏసీపై చర్యలు తీసుకోని పక్షంలో 13వ తేదీ నుంచి మళ్లీ ఆందోళన కొనసాగిస్తామని కలెక్టర్‌కు స్పష్టం చేశారు. కాగా కమిషనర్ హామీతో విజయదశమి పండగను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తామంతా తిరిగి విధులకు హాజరవుతున్నామని జిల్లా దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు ఎ.జగన్నాధరావు ’సాక్షి’కి చెప్పారు. కలెక్టర్‌తో సమావేశమైన వారిలో ఈవోలు జగన్నాధరావు, ఎ¯ŒS.ఎల్.ఎస్.శాస్తి్ర, పి.శేఖర్‌బాబు, పీఎస్.ఎన్ మూర్తి, దేవాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి జి.కృష్ణమాచారి తదితరులున్నారు. -
అసిస్టెంట్ కమిషనర్ ఆత్మహత్యా యత్నం
బెంగళూరు(బనశంకరి): కర్ణాటకలో మరో అధికారిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన గురువారం హాసన్నగరంలో చోటుచేసుకుంది. వివరాలు....... హాసన్ అసిస్టెంట్ కమిషనర్ విజయా బెంగళూరులో గురువారం కేఏటీ విచారణ ముగించుకుని ఇంటికి వెనుదిరిగింది. ఈ సమయంలో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హాసన్ ఏఎస్పీ శోభారాణికి ఫోన్‌చేసింది. ఆ తర్వాత విజయ ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడికి వెళ్లిన శోభారాణి ఇరుగుపొరుగు వారి సాయంతో విజయను కాపాడి హాసన్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలిసింది. ఈమెపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పలు సంఘాలు ధర్నాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని కిమ్స్‌కు బదిలీ చేశారు. దీంతో కేఏటీని ఆశ్రయించి హాసన్‌కు బదిలీ చేయించకుంది. అయితే కేఏటీకి తప్పుడు సమాచారం అందించారని లాయర్ దేవరాజ్‌గౌడ ఆరోపించడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. -
నటుడు రాధారవిపై ఫిర్యాదు
తమిళసినమా: నటుడు రాధారవిపై మరో నటుడు పూచిమురుగన్ శనివారం మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అందులో ఆయన పేర్కొంటూ.. నటుడు రాధారవి శుక్రవారం ఒక కార్యక్రమంలో పురుగును నలిపినట్లు కాలితో నలిపేస్తానని అన్నారన్నారు. ఆ విధంగా తనను బెదిరించే విధంగా మాట్లాడిన నటుడు రాధారవి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం నడిగర్ సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాధారవి బెదిరింపు మాటల్ని చూస్తుంటే తన ప్రాణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి తనకూ, తన కుటుంబానికీ తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని పూచి మురుగన్ పత్రికల వారికి తెలుపుతూ మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పత్రాన్ని కోడంబాక్కమ్ పోలీస్ స్టేషన్లోను అందించినట్లు చెప్పారు -
గంజాయితోట ధ్వంసం
తూర్పుగోదావరి: రాఘవాపురం పంచాయతీ పరిధిలోని సార్లంక, దబ్బాజీ గ్రామ అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న గంజాయి తోటను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేబీవీ శాస్త్రి ఆధ్వర్యంలో శనివారం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయిని మూడు ఎకరాలలో సాగు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. (రైతులపూడి) -
లైంగికదాడి కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించండి
న్యూఢిల్లీ: యువతిపై లైంగికదాడి కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ హైకోర్టు గురువారం పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. 24 ఏళ్ల యువతిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి పవన్ కుమార్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవాలను వెలుగులోకి తేవడానికి పోలీసులు ఏ మాత్రం కృషి చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. బాల్యం నుంచే ఆమె తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడ నే విషయమై సరైన దర్యాప్తు జరగలేదు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే చేయలేదు, ఈ కేసు దర్యాప్తు నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, దర్యాప్తులో తీవ్ర జాప్యం జరిగింది. ఈ కేసు విషయమై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిందితుడైన తండ్రి తరఫున న్యాయవాది కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. అయితే, కేసు దర్యాప్తు లోప భూయిష్టంగా సాగిందని, ఆ కారణంగా నిందితురాలు, ఆమె కుటుంబంతోపాటు నిందితుడికి కూడా న్యాయ జరుగదని జడ్జి పేర్కొన్నారు. ఇలాంటి విచారణ వల్ల ఆశించిన ప్రయేజనమేమీ నెరవేరదని అభిప్రాయపడ్డారు. ఈ రకమైన చార్జిషీట్‌తో ముందుకు వెళ్లడం కూడా సరికాదని పేర్కొన్నారు. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో నిష్ణాతులైన పోలీసు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి, తిరిగి కేసు దర్యాప్తు చేసి నివేదికను అందజేయాలని పోలీస్ కమిషనర్‌ను జడ్జి ఆదేశించారు. ఇప్పటి వరకూ జరిగిన కేసు దర్యాప్తు కారణంగా పోలీసులు, రాష్ట్ర యంత్రాంగం ఎంతో విలువైన సమయం వృథా అయ్యిందని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ కథనం.. మే 14,2014లో బాధితురాలైన బాలిక తన తండ్రి కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి 2010లో మృతి చెందింది. కొన్నేళ్లుగా డ్రగ్ అడిక్షన్ సెంటర్లో బాలిక తండ్రి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
500 లీటర్ల సారా పట్టివేత
మాచర్ల టౌన్, న్యూస్‌లైన్ :రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున ఎక్సయిజ్ అధికారులు దాడులు నిర్వహించి 500 లీటర్ల సారాను పట్టుకున్నారు. 500 లీటర్ల సారా ఉన్న 25 క్యాన్లను ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు జిల్లా ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు తెలిపారు. ఆటో, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారయ్యారు. ఇందుకు కారకులైన జెట్టిపాలెంకు చెందిన కామనబోయిన లచ్చయ్య, జఠావత్ మునినాయక్, రాపాటి కొండలు, దేవళ్ల గురయ్యలను అదుపులోకి తీసుకుని విచారించారు. నల్లగొండ జిల్లా నుంచి రెంటచింతలకు సారా తీసుకువెళుతున్నట్లు విచారణలో తేలింది. పరారైన వారి కోసం ఎక్సయిజ్ అధికారులు పోలీసు సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసులను నమోదు చేసి ద్విచక్ర వాహనం, ఆటోను సీజ్ చేసి నలుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు చెప్పారు. దాడుల్లో ఎక్సయిజ్ సీఐలు దేవర శ్రీనివాసరావు, మధుబాబు ఉన్నారు. ఇంట్లో మద్యం సీసాల నిల్వ.. చెరుకుపల్లి:సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు మండలంలోని బలుసులపాలెం పంచాయతీ పరిధిలోని మెట్టగౌడవారిపాలేనికి చెందిన కాటూరి సుబ్బారావు మద్యం బాటిళ్లను నిల్వ ఉంచినట్లు ఎస్ఐ పి.కిరణ్ చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడిచేసి అతని ఇంట్లో ఉన్న 205 క్వార్టర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సుబ్బారావును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. 105 మద్యం సీసాలు స్వాధీనం పిడుగురాళ్ళ: మండలంలోని గుత్తికొండ సాగర్ కాలువ వద్ద అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సయిజ్ సీఐ పి.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. వీరి వద్ద 105 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుత్తికొండ గ్రామంలో తనిఖీలకు వెళ్తుండగా గ్రామ సమీపంలోని సాగర్ కాల్వవద్ద అనుమానాస్పదంగా షేక్ యూసోబు, అన్నపురెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తులు తచ్చాడుతన్నారని సీఐ తెలిపారు. విచారించి వారి వద్ద 93 మద్యం సీసాలతోపాటు 12 బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ ఏసీ ఆదిశేషు, ఎస్ఐ రేఖారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖాజీపేట గోడౌన్లో మద్యం సీసాలు స్వాధీనం.. తెనాలి టౌన్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఖాజీపేట గ్రామంలోని గోడౌన్లో నిల్వ ఉంచిన మద్యం సీసాలను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎక్సయిజ్ అధికారులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. ఎక్సయిజ్ ఏసీ ఆదిశేషు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం కొలకలూరు గ్రామ శివారు ఖాజీపేటలోని చిట్టిమడుగుల వెంకటస్వామి చెందిన గోడౌన్లో మద్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఆ మేరకు గోడౌన్‌పై అధికారులు దాడులు నిర్వహించగా 480 ఓటి క్వార్టర్ సీసాలు లభ్యమయ్యాయి. మద్యం సీసాలను స్వాధీన పరచుకుని, తెనాలి ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, గోడౌన్‌ను సీజ్ చేసినట్లు ఆదిశేషు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామన్నారు. దాడుల్లో ఎక్సయిజ్ సీఐ జి.వీరాంజనేయులు, రూరల్ ఎస్ఐ వెంకట్రావు, ఎక్సయిజ్, సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కర్నూలులో కొకైన్ పట్టివేత
కర్నూలు, న్యూస్‌లైన్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో కర్నూలు కొత్త బస్టాండ్‌లో ముగ్గురు వ్యక్తుల నుంచి రెండు ప్యాకెట్లలో భద్రపరిచిన కొకైన్(మత్తు పదార్థం)ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు డిపోకు చెందిన బస్సులో కొకైన్‌ను తరలిస్తున్నట్లు తనకు సమాచారం రావడంతో సీఐలు కృష్ణకుమార్, రాజశేఖర్ గౌడ్, పద్మావతి, ఎస్ఐలు ప్రసాదరావు, నాగమణి, రమణ తదితరులను అప్రమత్తం చేశానని తెలిపారు. వీరు కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద కాపు కాసి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరుకు చెందిన బొల్ల శివశంకర్, జి.కొండూరు గ్రామానికి చెందిన కొర్లపాటి సుబ్బారావు, హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన అనూషలను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.6 లక్షలు విలువ చేసే 300 గ్రాముల కొకైన్‌ను స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన అనూష, శివశంకర్, సుబ్బారావు ముఠాగా ఏర్పడి ఆరు నెలలుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు. ఈ కొకైన్‌ను విజయవాడలో కొని, బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. -
బళ్లారి ఏసీ కార్యాలయ ఫర్నీచర్ జప్తు
సాక్షి, బళ్లారి : ఓ రైతుకు పరిహారం ఇవ్వడంలో బళ్లారి జిల్లా అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ కార్యాలయ ఫర్నీచర్‌ను కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది బుధవారం జప్తు చేశారు. బళ్లారి జిల్లా తోరణగల్లు వద్ద ఏర్పాటు చేసిన వీఎస్‌పీఎల్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం 1979లో కుడితినికి చెందిన రైతు వెంకటప్ప ఆధీనంలోని 20.47 ఎకరాల భూమిని ఎకరా రూ.6,500 ప్రకారం సేకరించింది. పరిహారం పూర్తిగా అందకపోవడంతో సదరు రైతు 1997లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్పందించి రైతుకు రూ.3లక్షల పరిహారం ఇవ్వాలని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ అధికారులను ఆదేశించినా ఎలాంటి స్పందన లేకపోయింది. దీంతో కార్యాలయ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని వెంకటప్ప కుమారుడు ఘన శ్యామ సుందరమూర్తికి సూచిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈనేపథ్యంలో మంగళవారం శ్యామసుందరమూర్తి ఏసీ కార్యాలయాన్ని జప్తు చేసేందుకు వెళ్లగా ఏసీ అందుబాటలో లేరు. దీంతో అధికారులు ఒకరోజు గడువు తీసుకున్నారు. బుధవారం ఉదయం వరకూ పరిహారం విషయంపై అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. దీంతో ఘన శ్యామ సుందరమూర్తితో పాటు కోర్టు సిబ్బంది శ్రీకాంత్, సంబంధిత లాయరు ఏసీ కార్యాలయానికి చేరుకుని ఏసీ కుర్చీతో పాటు పలువురు అధికారుల కుర్చీలు, ఇతర సామగ్రిని జప్తు చేసి లారీలోకి వేసి కోర్టుకు అప్పగించారు. రైతుకు ప్రభుత్వం పరిహారం అందించిన తర్వాతనే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న సామగ్రిని తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. కార్యాలయానికి తాళాలు: కోర్టు సిబ్బంది ఏసీ కుర్చీతోపాటు ఇతర అధికారుల కుర్చీలను జప్తు చేసి స్వాధీనం చేసుకోవడంతో కూర్చునేందుకు కుర్చీలు లేక అధికారులు కార్యాలయానికి తాళం వేశారు. జిల్లాధికారి తర్వాత అంతే హోదా కలిగిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని జప్తు చేయడం, ఆ తర్వాత అధికారులు కార్యాలయానికి తాళాలు వేయడం నగరంలో చర్చనీయాంశమైంది. దాదాపు 30 ఏళ్లపాటు రైతుకు పరిహారం అందించకుండా అధికారులు ఎందుకు కాలయాపన చేశారనే విషయంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పలువురు రైతులు అక్కడికి చేరుకుని ఘనశ్యామసుందరమూర్తికి మద్దతు తెలిపారు.