నటుడు రాధారవిపై ఫిర్యాదు | Poochi Murugan Files Complaint against Radha Ravi | Sakshi
Sakshi News home page

నటుడు రాధారవిపై ఫిర్యాదు

Published Sun, Oct 18 2015 2:48 AM | Last Updated on Fri, Aug 17 2018 2:35 PM

నటుడు రాధారవిపై ఫిర్యాదు - Sakshi

నటుడు రాధారవిపై ఫిర్యాదు

తమిళసినమా: నటుడు రాధారవిపై మరో నటుడు పూచిమురుగన్ శనివారం మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అందులో ఆయన పేర్కొంటూ.. నటుడు రాధారవి శుక్రవారం ఒక కార్యక్రమంలో పురుగును నలిపినట్లు కాలితో నలిపేస్తానని అన్నారన్నారు. ఆ విధంగా తనను బెదిరించే విధంగా మాట్లాడిన నటుడు రాధారవి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం నడిగర్ సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాధారవి బెదిరింపు మాటల్ని చూస్తుంటే తన ప్రాణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి తనకూ, తన కుటుంబానికీ తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని పూచి మురుగన్ పత్రికల వారికి తెలుపుతూ మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పత్రాన్ని కోడంబాక్కమ్ పోలీస్ స్టేషన్‌లోను అందించినట్లు చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement