ముదురుతున్న బాలీవుడ్ నటుడి వివాదం | Nawazuddin Siddiqui files cross-FIR against five people | Sakshi
Sakshi News home page

ముదురుతున్న బాలీవుడ్ నటుడి వివాదం

Published Mon, Jan 18 2016 4:46 PM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

ముదురుతున్న బాలీవుడ్ నటుడి వివాదం - Sakshi

ముదురుతున్న బాలీవుడ్ నటుడి వివాదం

ముంబై: అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ  వివాదం మరింత ముదురుతోంది. తమను  అక్రమంగా దూషించి, చేయి చేసుకున్నారంటూ  ముంబైలోని తల్లీకూతుళ్లు ఫిర్యాదు చేయడంతో రగడ మొదలైంది.  కారు పార్కింగ్ దగ్గర వచ్చిన  వివాదంలో ఇప్పటికే  ఆయనకే కేసు నమోదైంది.  దీన్ని వ్యతిరేకిస్తూ సదరు నటుడు కూడా  రివర్స్ కేసు పెట్టారు.  దీంతో పరస్పర ఆరోపణలు,  కేసులతో వివాదం రాజుకుంది.

ముంబైలోని జోహ్రా అగధి నగర్ హౌసింగ్ సొసైటీలో నివసించే  నవాజుద్దీన్ సిద్దిఖీపై,  అదే సొసైటీలో నివసించేవారు,  సొసైటీ ఛైర్మన్  ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా  సిద్దిఖీ తమతో తప్పుగా ప్రవర్తించాడని హీనా, (24 ) అనే మహిళ, ఆమె కూతురు సోనీ దండేకర్ ముంబై పరిధిలోని వెర్సోవా పోలీసుస్టేషన్ లో  ఆదివారం ఫిర్యాదు చేశారు.   బాడీ గార్డుల సహాయంతో అమర్యాదకరంగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. వీరికి హౌసింగ్ సొసైటీఛైర్మన్ అండగా నిలిచారు.  
 
అయితే ఈ ఆరోపణలను నవాజుద్దీన్  మేనేజర్  ఖండించారు. అలాగే  తప్పుడు ఆరోపణలతో  తనపై అన్యాయంగా  కేసుపెట్టిన  అయిదుగురిపై  సోమవారం  కేసు ఫైల్ చేసినట్టు  తెలిపారు.  తమ పరోక్షంలో  కార్యాయలంలోకి  ఐదుగురు వ్యక్తులు అక్రమంగా చొరబడి గలాటా సృష్టించినందుకు గాను వారిపై కేసు నమోదు చేసినట్టు  ఆయన తెలిపారు.   అయితే  ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలంలో  నవాజ్ కారు  పార్కింగ్ చేయడం  వివాదానికి  దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు.  ఇరువర్గాల కేసులపై విచారణ చేపడతామన్నారు. హౌసింగ్ సొసైటీలో విభేదాల నేపథ్యంలోనే  ఈ వివాదం తెరపైకి వచ్చినట్టు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement