
సాక్షి, న్యూఢిల్లీ: సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బొల్లినేని శ్రీనివాసగాంధీ సస్పెన్షన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) మరోసారి పొడిగించింది. 2021 ఫిబ్రవరిలో బొల్లినేని సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు అనేకసార్లు సస్పెన్షన్‌ను పొడిగించారు. తాజాగా ఆయన సస్పెన్షన్‌ను 2023 మే 7వ తేదీ వరకు పొడిగించింది. బొల్లినేనిపై సీబీఐ రెండుసార్లు కేసు నమోదు చేయగా, హైదరాబాద్ పోలీసులు కూడా ఆయనపై ఒకసారి కేసు నమోదు చేశారు.
2019లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ బొల్లినేని, ఆయన భార్యపై కేసు నమోదు చేసింది. సెంట్రల్ జీఎస్టీకి సంబంధించిన ఎగవేత నిరోధక విభాగంలో బొల్లినేని శ్రీనివాస్‌గాంధీ పనిచేస్తున్నప్పుడు వివేకానందస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై సీబీఐ చర్య తీసుకుంది. అయితే అనంతరం అదే విభాగంలో ఆయన కొనసాగారు. కానీ 2021 ఫిబ్రవరిలో సీబీఐసీ బొల్లినేని గాంధీతో పాటు మరో అధికారి సుధారాణిని లంచం కేసులో సస్పెండ్ చేసింది. అప్పటినుంచి బొల్లినేని సస్పెన్షన్‌ను పొడిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment