డిప్యూటీ సీఎం సభకు లేటుగా వచ్చినందుకు.. | Four constables suspended for dereliction of duty | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం సభకు లేటుగా వచ్చినందుకు..

Published Tue, Feb 2 2016 5:13 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

డిప్యూటీ సీఎం సభకు లేటుగా వచ్చినందుకు..

డిప్యూటీ సీఎం సభకు లేటుగా వచ్చినందుకు..

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు పోలీసు కానిస్టేబుళ్లపై వేటు పడింది. తూర్పు ఢిల్లీలోని పాట్పర్ గంజ్ ప్రాంతంలో ఆదివారం సిసోడియా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాండవనగర్ పోలీసు స్టేషన్‌ కు చెందిన పోలీసులను ఈ కార్యక్రమ బందోబస్తు కోసం నియమించారు. అయితే ఓ మహిళ సహా నలుగురు కానిస్టేబుళ్లు సకాలంలో ఈ కార్యక్రమం వద్దకు  చేరుకోలేదు. బందోబస్తు విధుల నిర్వహణలో వారు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఏసీపీ విచారణ నిర్వహించారు. ఆలస్యంగా వచ్చినట్టు తేలడంతో నలుగురిపై వేటు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement