సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ)ను సస్పెండ్ చేయాలని విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో త్వరగా నివేదిక ఇచ్చి, నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తర ఢిల్లీలోని బరాహిందూ ప్రాంతంలో ఈ నెల 2న సాయంత్రం ఓ దుర్మార్గుడు తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేస్తే నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలు చిన్నారి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ నాయకుల ఫైరవీలేనని ఆరోపించారు. వెంటనే కేంద్ర హోంశాఖ స్పందించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కోరారు.