CGST
-
రూ.13.83 కోట్ల జీఎస్టీ నోటీసు.. ఆ తేడాలే కారణం..
ఏషియన్ పెయింట్స్ కంపెనీ రూ.13.83 కోట్ల జీఎస్టీ, రూ.1.38 కోట్ల పెనాల్టీ చెల్లించాలని కేంద్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ డిమాండ్ నోటీసు పంపినట్లు సంస్థ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో తేడాలపై 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈ డిమాండ్ నోటీసు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నోటిసుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ చేసిన సరఫరాలపై ఐటీసీని పొందడానికి వర్తించే అన్ని పన్నులను చెల్లించినట్లు కంపెనీ చెప్పింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ నోటీసులు వచ్చినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. ఏషియన్ పెయింట్స్ కంపెనీను 1942లో చంపక్లాల్ చోక్సీ, చిమన్లాల్ చోక్సీ స్థాపించారు. 1965 వరకు ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్ కంపెనీ ఉన్న సంస్థ పేరును ఏషియన్ పెయింట్స్‌గా మార్చారు. ఇండియాలో మొత్తం 10 తయారీ కేంద్రాలున్నాయి. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని పటాన్చెరు, విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. -
సీజీఎస్టీ అధికారి బొల్లినేని గాంధీ సస్పెన్షన్ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బొల్లినేని శ్రీనివాసగాంధీ సస్పెన్షన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) మరోసారి పొడిగించింది. 2021 ఫిబ్రవరిలో బొల్లినేని సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు అనేకసార్లు సస్పెన్షన్‌ను పొడిగించారు. తాజాగా ఆయన సస్పెన్షన్‌ను 2023 మే 7వ తేదీ వరకు పొడిగించింది. బొల్లినేనిపై సీబీఐ రెండుసార్లు కేసు నమోదు చేయగా, హైదరాబాద్ పోలీసులు కూడా ఆయనపై ఒకసారి కేసు నమోదు చేశారు. 2019లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ బొల్లినేని, ఆయన భార్యపై కేసు నమోదు చేసింది. సెంట్రల్ జీఎస్టీకి సంబంధించిన ఎగవేత నిరోధక విభాగంలో బొల్లినేని శ్రీనివాస్గాంధీ పనిచేస్తున్నప్పుడు వివేకానందస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై సీబీఐ చర్య తీసుకుంది. అయితే అనంతరం అదే విభాగంలో ఆయన కొనసాగారు. కానీ 2021 ఫిబ్రవరిలో సీబీఐసీ బొల్లినేని గాంధీతో పాటు మరో అధికారి సుధారాణిని లంచం కేసులో సస్పెండ్ చేసింది. అప్పటినుంచి బొల్లినేని సస్పెన్షన్‌ను పొడిగిస్తోంది. -
దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు!
న్యూఢిల్లీ: నవంబర్ నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. వరుసగా ఐదో నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి. 2021 నవంబరులో వసూలైన జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఆదాయం రూ.1,31,526 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ - రూ.23,978 కోట్లు, స్టేట్ జీఎస్టీ - రూ.31,127 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ - రూ.66,815 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటిసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1,39,708 కోట్లు వచ్చాయి. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా రూ.66,815 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,165 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.9,606 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.రూ.653 కోట్లతో సహా) . గత ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే నవంబర్ 2021లో సేకరించిన జీఎస్టీ ఆదాయం 25 శాతం పెరిగింది. 2019-20తో పోలిస్తే కంటే 27 శాతం పెరిగింది. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,273 కోట్లు, రాష్ట్రాలతో 22,655 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ. 51,251 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.53,782 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 43 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్ 3న జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం రూ.17,000 కోట్లు విడుదల చేసింది. (చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!) -
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు!
-
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే రెండవ అత్యధిక ఆదాయం కావడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువ. ఈ ఏడాదిలో వరుసగా నాలుగో నెల జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఈ జీఎస్టీ వసూళ్లలో కేంద్ర వాటా రూ.23,861 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.30,421 కోట్లు, సమ్మిళిత జీఎస్టీ వాటా రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,998 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.8,484 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.699 కోట్లతో సహా). ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ.51,171 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.52,815 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం ఎక్కువగా ఉన్నాయి. చిప్ కొరత వల్ల కార్లు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు ప్రభావితం కాకపోతే ఇంకా ఆదాయం ఎక్కువగా వచ్చి ఉండేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: ఇండియన్ బ్యాంకులో రూ.266 కోట్ల మోసం!) -
బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా!
సాక్షి, హైదరాబాద్: సీజీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అక్రమాలు బోలెడు. అవి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుతోపాటు రూ.5 కోట్ల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసగాంధీని మంగళవారం సీబీఐ నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన గాంధీ దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన విధులు నిర్వహించిన చోటల్లా వివాదాలతో సావాసం చేసేవారన్న ఆరోపణలకు క్రమంగా బలం చేకూరుతోంది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివిధ కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ అరెస్టు చేసే సందర్భంలో కూడా ఆయన తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందంటూ దొంగపత్రాలు సృష్టించి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. సీవీసీ, ఆర్థికశాఖ, సీజీఎస్టీ వద్ద.. పోస్టింగ్‌ల విషయంలో గాంధీకి తెరవెనుక అనేక శక్తులు సాయం చేశాయని విమర్శలున్నాయి, ఈ విషయంపై గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. 2019లో శ్రీనివాసగాంధీ బేగంబజార్ జీఎస్టీ సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కూలింగ్ పీరియడ్‌లో ఉన్నారు. వాస్తవానికి కూలింగ్ పీరియడ్‌లో ఉన్నవారికి ఎలాంటి కేసులు అప్పగించరు. నిబంధనల ప్రకారం... కూలింగ్ పీరియడ్‌లో కనీసం రెండు సంవత్సరాలపాటు పనిచేయాలి. కానీ, ఆయన కూలింగ్ పీరియడ్‌లో మూడు నెలలు కూడా పనిచేయలేదని సొంత కార్యాలయం సిబ్బందే అంటున్నారు. కొందరు రాజకీయ నేతలు, సొంత శాఖలోని ఇద్దరు వివాదాస్పద ఉన్నతాధికారులు ఆయన్ను తాత్కాలిక డిప్యుటేషన్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా బషీర్‌బాగ్‌లోని యాంటీ ఈవేషన్ వింగ్–జీఎస్టీకి బదిలీ చేశారు. సాధారణ ఉద్యోగులకు ఇలాంటి బదిలీలు దాదాపుగా అసాధ్యం. ఈ వివాదాస్పద బదిలీ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్–ఢిల్లీ, జీఎస్టీ చీఫ్ కమిషనర్ హైదరాబాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రికి కూడా పంపారని సమాచారం. గాంధీ అక్రమాలకు సహకరించిన చిలుక సుధారాణి, ఇద్దరు జీఎస్టీ ఉన్నతాధికారులపై త్వరలోనే అధికారిక విచారణ ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్‌లోని ఓ వ్యాపారి నుంచి 2020లో రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన కేసు తెరపైకి రానుంది. ఈ కేసులోనూ సీబీఐ అధికారులు చురుగ్గా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల లంచం తీసుకున్నారని సీబీఐ అధికారులు నిర్ధారించారు. మిగిలిన సాంకేతిక, డాక్యుమెంటెడ్ ఆధారాలు కూడా సేకరించేపనిలో సీబీఐ నిమగ్నమైంది. మోకాలి, కడుపునొప్పి సాకుగా చూపి! సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో గాంధీ బంధువునంటూ ఓ వృద్ధుడు ఆయన ఇంటికి వచ్చాడు. లోపల కొన్ని బట్టలు సర్దుకుని బైక్‌పై బయలుదేరడం అక్కడే వున్న అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ వృద్ధుడిని రహస్యంగా ఫాలో అయి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న ఫోన్లో బొల్లినేని శ్రీనివాస్‌తో మరోఫోన్తో జరిపిన సందేశాలు లభించాయి. అలా అతని ఆచూకీ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిక్కింది. అక్కడికెళ్లిన తరువాత బొల్లినేని ఐసీయూలో మోకాలి, కడుపునొప్పులతో చికిత్స పొందుతుండటం చూసి సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. అతని సమస్యలు తీవ్రమైనవి కావని, ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ఇంట్లో ఆన్‌చేసి.. పరారీ సీబీఐ అరెస్టును తప్పించుకునేందుకు గాంధీ విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యవహారాలు చూసిన సీబీఐ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మంగళవారం సీబీఐ అధికారులు బొల్లినేనిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా.. అక్కడ తన తెలివితేటలు ప్రదర్శించారని తెలిసింది. తన ఫోన్ స్విచ్చాన్ చేసి (తన లొకేషన్ అక్కడే కనిపించేలా) ఇంటి నుంచి పరారయ్యారు. పట్టు వీడని అధికారులు గాంధీ ఇంటి దగ్గరే మకాం వేశారు. అయితే గాంధీ కుటుంబంలోని మహిళలంతా ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ డ్రామా క్రియేట్ చేసి తమను దుర్భాషలాడారని సీబీఐ అధికారులు వాపోయారు. -
ఐదవ నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్టి వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదవ నెలలో కూడా జీఎస్టి వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టి వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.13 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 7 శాతం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,13,143 కోట్లు కాగా గత నెలలో వసూలు చేసిన రూ.1,19,875 కోట్ల రూపాయల కన్నా తక్కువ. ఫిబ్రవరి నెలకు గాను వసూలైన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,092 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.27,273 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.55,253 కోట్లు, సెస్సులు కింద రూ.9,525 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు దాటాయని, జీఎస్టీ వసూళ్లు తిరిగి పుంజుకున్నాయనడానికి ఇదే నిదర్శమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నెలలో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవిన్ 2.0 రెడీ.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా! వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్ -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం రూ.95,379 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు, మార్చిలో రూ.97,597 కోట్లు, ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లు, మేలో రూ.62,151 కోట్లు, జూన్‌లోరూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో గ్రాస్ జీఎస్టీ ఆదాయం రూ.5.59 లక్షల కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 20 క్షీణత నమోదైందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31 నాటికి 80 లక్షల జీఎస్టీఆర్–3బీ రిటర్న్‌లు ఫైల్ అయ్యాయని ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే తెలిపారు. రూ.50 వేల కంటే విలువైన వస్తువుల రవాణాలో తప్పనిసరి అయిన ఈ–వే బిల్లుల చెల్లింపుల్లోనూ అక్టోబర్ నెలలో 21 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం రోజుకు 29 లక్షల ఈ–ఇన్వాయిస్ జనరేట్ అవుతున్నాయి. -
మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597కోట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్ జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపించింది. మార్చి నెలకు రూ.97,597 కోట్లు వసూలైంది. ఇందులో.. రూ.19,183 కోట్లు సీజీఎస్టీ కింద, రూ.25,601 కోట్లు ఎస్జీఎస్టీ కింద, రూ.44,508 కోట్లు ఐజీఎస్టీ కింద, రూ.8,306 కోట్లు సెస్సు రూపంలో వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ప్రతీ నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో 83 లక్షల జీఎస్టీ రిటర్నులు నమోదు కాగా, మార్చిలో 76.5 లక్షలకు తగ్గాయి. -
నకిలీ ఇన్వాయిస్లతో రూ.700 కోట్ల మోసం
పుణె: నకిలీ జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) ఇన్వాయిస్లతో భారీ మోసానికి పాల్పడిన ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ కేసుకు సంబంధించి పుణెలో ఇద్దరు అరెస్టయ్యారు. పుణె నగరానికి చెందిన రిలయబుల్ మల్టీట్రేడింగ్, హిమాలయా ట్రేడ్‌లింక్స్ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకునేందుకు రూ.700 కోట్ల విలువ చేసే నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు జారీ చేసినట్లు కేంద్రీయ వస్తు, సేవల పన్నుల (సీజీఎస్టీ) విభాగం గుర్తించింది. -
పన్ను చెల్లింపులకు ‘సబ్కా విశ్వాస్’
సాక్షి, విశాఖపట్టణం : పారిశ్రామికవేత్తలతో పాటు అందరికీ వెసులుబాటు కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన సబ్కా విశ్వాస్ పథకాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని సీజీఎస్టీ కమిషనర్ డీకే శ్రీనివాస్ కోరారు. 2019 జూన్ చివరి నాటికి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నవారు, షోకాజ్ నోటీసులు అందుకున్నవారు ఈ పథకంతో 70 శాతం రాయితీని పొందవచ్చని తెలిపారు. ఏపీలో మూడు వేల కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలున్నాయని వెల్లడించారు. పన్ను ఎగవేతదారులు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసులు ఉపసంహరించుకునే అవకాశంతో పాటు న్యాయస్థానాలపై కూడా ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. -
సుజనా గ్రూపు ట్యాక్స్ కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి చెందిన కంపెనీలకు ట్యాక్స్ కన్సల్టెంట్ ఎన్.ఎస్.అయ్యంగార్ను అరెస్ట్ చేసినట్లు జీఎస్టీ అధికారులు శనివారం హైకోర్టుకు నివేదించారు. తన భర్త అయ్యంగార్ను జీఎస్టీ అధికారులు తీసుకెళ్లారని, అయితే, ఆయన ఆచూకీ తెలియడం లేదని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఎన్.విజయలక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, సీజీఎస్టీ అధికారి శ్రీనివాస్ గాంధీ, డిప్యూటీ కమిషనర్ సుధారాణిలు ఈ నెల 2న ఉదయం 7.30 గంటల సమయంలో అయ్యంగార్ ఇంటికి వచ్చి, ఆయనను వారివెంట తీసుకెళ్లారని చెప్పారు. మధ్యాహ్నంకల్లా పంపిస్తామని చెప్పారని, అయితే ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియడం లేదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ భర్తను జీఎస్టీ అధికారులు అక్రమంగా నిర్బంధించారని వాదించగా జీఎస్టీ తరఫు న్యాయవాది బి.నర్సింహశర్మ తోసిపుచ్చారు. అయ్యంగార్ను అక్రమంగా నిర్బంధించలేదని తెలిపారు. విచారణ నిమిత్తం తీసుకొచ్చామని, విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. సుజనా గ్రూపు కంపెనీల జీఎస్టీ ఎగవేతలో అయ్యంగార్ పాత్ర ఉన్నట్లు తేలిందని, అందుకే అతన్ని అరెస్ట్ చేశామమన్నారు. ఆయనను కోర్టు రిమాండ్‌కు పంపిందని వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషనర్ భర్తను అరెస్ట్ చేసినప్పుడు, ఇక ఈ వ్యా జ్యంలో విచారించేందుకు ఏమీలేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
సీజీఎస్టీ నిబంధనల అధికారం కేంద్రానిదే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ) చట్టం కింద ఈ–వే బిల్లులకు సంబంధించి అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న వ్యాపారులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ చట్టం కింద ఈ–వే బిల్లుల విషయంలో వ్యాపారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన జీవోలను హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. సీజీఎస్టీ కింద రాష్ట్రాల మధ్య (ఇంటర్‌స్టేట్) జరిగే వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి వ్యాపార, వాణిజ్యాల విషయంలో నిబంధనలు రూపొందించే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహజసిద్ధ అధికారాలేవీ లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కేవలం ఆయా రాష్ట్రాల్లో (ఇంట్రాస్టేట్) జరిగే వ్యాపార, వాణిజ్యాల నిబంధనలు రూపొందించే అధికారం మాత్రమే ఆయా రాష్ట్రాలకు ఉందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. గమ్యస్థానంలో సరుకును అందుకునే వ్యాపారి నుంచి ఈ–వే బిల్లు లేదన్న కారణంతో తమ సరుకును, వాటిని తరలిస్తున్న వాహనాలను ఉభయ రాష్ట్రాల అధికారులు స్వాధీనం చేసుకుంటుండటాన్ని సవాల్ చేస్తూ పలువురు వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. సరుకు, వాహనాల స్వాధీనం వద్దు... గమ్యస్థానంలో సరుకు అందుకునే వ్యాపారులు ఈ–వే బిల్లులు సమర్పించలేదన్న కారణంతో ఆ సరుకును, వాటిని తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీన్ని అడ్డంపెట్టుకుని కొందరు వ్యాపారులు పన్ను ఎగవేసే అవకాశం ఉండటంతో వే బిల్లులకు సంబంధించి అధికారులకు హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సరుకు ఏ రాష్ట్రం నుంచి అయితే తీసుకెళుతున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించి ఈ–వే బిల్లు లేదా ట్యాక్స్ ఇన్వాయిస్ లేదా డెలవరీ చలాన్‌ను ఆ సరుకుకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి చూపితే, ఆ సరుకును, వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. గమ్యస్థానంలో సరుకులు తీసుకుంటున్న వ్యాపారి నుంచి ఈ–వే బిల్లు రాలేదన్న కారణంతో అతని సరుకు ను, వాహనాలను స్వాధీనం చేసుకోరాదని పే ర్కొంది. వాహనాలను తనిఖీ చేసిన అధికారి ఆ వాహనంలోని సరుకు, ఈ–వే బిల్లు, ట్యాక్స్ ఇన్వాయిస్, డెలివరీ చలాన్లకు సంబంధించిన వివరాలను ఏ రాష్ట్రం నుంచి ఆ సరుకులు బయలుదేరా యో ఆ రాష్ట్ర అధికారులతోపాటు గమ్యస్థాన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికారులకు కూడా తెలియచేయాలని ఆదేశించింది. అలాగే ఆ సరుకుకు సం రక్షకుడిగా ఉన్న వ్యక్తి వద్ద నుంచి బాండ్ తీసుకునేందుకు నిర్దిష్ట నమూనాను తయారు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. -
ఎవరి వాటా ఎంత?
జీఎస్టీలో 50 శాతం వాటా కేంద్రానికే ► ఐజీఎస్టీలో సగం, సీజీఎస్టీ మొత్తం కేంద్ర ఖజానాకు ► డీలర్ టు డీలర్ అమ్మకాలపై ప్రతి ఇన్వాయిస్ అప్లోడ్ చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్ : దిలీప్ ఓ హోటల్‌కు వెళ్లి తనకు కావాల్సినవి తినగా రూ.500 బిల్లు అయింది. అందులో ఎస్జీఎస్టీ కింద రూ.45, సీజీఎస్టీ కింద రూ.45 కలిపి మొత్తం 590 రూపాయలను హోటల్ యాజమాన్యం వసూలు చేసింది. అయితే జీఎస్టీతో దేశమంతా ఒకటే పన్ను కదా.. మరి హోటల్ ఇచ్చిన పన్నులో రెండు జీఎస్టీలున్నాయేంటనేది దిలీప్ సందేహం. రెండు జీఎస్టీలను హోటల్ బిల్లులో పేర్కొన డంలో ఏ మాత్రం తప్పులేదు. ఎందుకంటే జీఎస్టీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకుంటాయి. అందులో సీజీఎస్టీ కేంద్రానికి వెళుతుంది. ఎస్జీఎస్టీ రాష్ట్రానికి వస్తుంది. రెండూ కలిపితేనే అసలు జీఎస్టీ. అందుకే మనం ఏ వస్తువు కొన్నా అది ఏ శ్లాబ్‌లో ఉంటే అందులో సగం సీజీఎస్టీ కింద, సగం ఎస్జీఎస్టీ కింద వసూ లు చేస్తారు. అంతేకానీ మొత్తం పన్నును రెండు సార్లు వసూలు చేయడం కాదు. వీటికి తోడు బిల్లులో గతంలో ఉన్న 7 శాతం సర్వీస్ ట్యాక్స్ కలిపితేనే ఆ హోటల్ తప్పు చేసినట్లు. రాష్ట్రంలోని లావాదేవీల్లోనూ అంతే.. రెండు రాష్ట్రాల మధ్య జరిగే పన్ను లావాదేవీల వ్యవహారం అలా ఉంటే.. ఒకే రాష్ట్రంలో జరిగే లావాదేవీలపై కట్టే పన్నును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం పంచుకుంటాయి. అంటే లావాదేవీ ఎక్కడ జరిగినా, ఏ వస్తువుపై పన్ను వచ్చినా అందులో సగం కేంద్రానికి వెళ్తుందన్న మాట. రాష్ట్రాంతర లావాదేవీల్లో డీలర్ కట్టే పన్ను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహ రణకు ఓ డీలర్ రూ.లక్ష పన్ను చెల్లిస్తే అందులో రూ.50 వేలు నేరుగా కేంద్ర ఖజానాకు, రూ.50 వేలు రాష్ట్ర ఖజానాకు వస్తుంది. అయితే, డీలర్ మాత్రం ఒకేసారి కడతాడన్నమాట. కాగా, ఐజీఎస్టీకి సంబంధించిన పన్నును ఐజీఎస్టీ బోర్డు రాష్ట్రానికి, కేంద్రానికి పంపిణీ చేస్తే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీలు మాత్రం నేరుగా ఆయా ప్రభుత్వాల ఖజానాకు వెళుతుంది. ఇందుకోసం జీఎస్టీలో రిజిస్టర్ చేసుకునే సమయంలో ప్రతి డీలర్ 11 వరకు బ్యాంకు అకౌంట్ నంబర్లను ఇవ్వొచ్చు. అయితే, ఏ వస్తువుపై పన్ను కడుతున్నాడో ఆ వస్తువు అమ్మకానికి సంబంధించిన ఇన్వాయిస్లో పేర్కొనే బ్యాంకు ఖాతా ద్వారానే పన్ను చెల్లించాలి. కాగా, డీలర్లు ప్రతి వ్యాపార లావా దేవీలకు సంబంధించిన ఇన్వాయిస్లను జీఎస్టీ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిన పనిలేదని జీఎస్టీ చట్టం చెబుతోంది. డీలర్ టు డీలర్‌కు జరిగే లావాదేవీలను పూర్తిగా అప్లోడ్ చేయాల్సి ఉండగా, డీలర్‌కు వినియోగదారుడికి మధ్య జరిగే లావాదేవీల ప్రతి ఇన్వాయిస్ను అప్లోడ్ చేయాల్సిన అవసరంలేదు. అయితే, ఈ లావాదేవీ రూ.2.5 లక్షలకు మించితే మాత్రం సదరు ఇన్వాయిస్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా పంచుకుంటారంటే.. పన్ను వసూలు అలా ఉంటే.. ఈ పన్నును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పంచుకుంటా యి? పన్నును వసూలు చేసే డీలర్ రెండింటికీ రెండు సార్లు పన్ను కట్టాలా? ఒకసారి కడితే సరిపోతుందా? అనే సందేహాలు కూడా వ్యాపార వర్గాల్లో ఉన్నాయి.వాస్తవానికి జీఎస్టీని మూడుగా విభజించారు. అందులో మొదటిది సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ). దీన్ని రెండు రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తారు. దీని పన్నును డీలర్ కట్టినప్పుడు అది నేరుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్లిపోతుంది. అక్కడ ఉన్న ఐజీఎస్టీ బోర్డు ఆ పన్ను కట్టిన వస్తువు ఏ రాష్ట్రంలో వినియోగం జరిగిందన్న దాన్ని పరిశీలించి ఆ రాష్ట్రానికి 50 శాతం పంపి, 50 శాతం తన ఖజానాలో ఉంచుకుంటుంది. అంటే అంతర్రాష్ట్ర లావాదేవీల్లో వచ్చే పన్ను రాబడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరి సగం అన్నమాట. -
గెట్.. సెట్..జీఎస్టీ!
♦ జూలై 1 నుంచీ దేశమంతా ఒకటే పన్ను ♦ కేంద్ర, రాష్ట్రాల్లోని కీలక పన్నులన్నీ దీన్లో విలీనం ♦ సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీగా విభజన ♦ వ్యాపారస్తుల నమోదుకు... జీఎస్టీఎన్ (సాక్షి, బిజినెస్ విభాగం) గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ముద్దుగా జీఎస్టీ. దీర్ఘకాల తర్జనభర్జనల అనంతరం పార్లమెంటుతో పాటు దేశంలోని రాష్ట్రాలన్నీ దాదాపుగా ఆమోదించటంతో... జూలై 1 నుంచి దీన్ని అమల్లోకి తేవటానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సరే! అంతవరకూ బాగానే ఉంది. అసలీ జీఎస్టీ అంటే ఏంటి? దీన్నెందుకు తెస్తున్నారు? దీన్ని అమలు చేసేదెలా? ఇపుడున్న ఇన్ని పన్నుల స్థానంలో ఒకే పన్నును అమలు చేయటం ఈజీయేనా? వ్యాపారులంతా దాన్లో చేరేదెలా? అసలింతకీ జీఎస్టీ వస్తేగిస్తే మనకేంటి లాభం? ధరలేమైనా తగ్గుతాయా... లేక పెరగబోతున్నాయా? ఏఏ వస్తువుల ధరలు ఎలా ఉంటాయి? ఏఏ సేవల ధరల్లో మార్పులు రాబోతున్నాయి? రాయితీలపై కంపెనీలు పెట్టిన యాజమాన్యాలకు ఇపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని చెబుతాయి? జీఎస్టీ వచ్చాక కూడా పన్ను రాయితీలివ్వటం సాధ్యమేనా? ఇవన్నీ చాలామందికి వస్తున్న సందేహాలు. వీటిని నివృత్తి చేయటానికి పలువురు నిపుణులను సంప్రదించి వారి సాయంతో ‘సాక్షి’ బిజినెస్ విభాగం ఈ వరస కథనాలను అందిస్తోంది. ‘‘జీఎస్టీ... పన్నుల పెద్దన్న’’ శీర్షికన అందిస్తున్న ఈ కథనాలు వరసగా మీ కోసం... జీఎస్టీ. వస్తువుల తయారీ, సరఫరా లేదా సేవలపై విధిస్తారు కాబట్టే దీన్ని వస్తు, సేవల పన్నుగా పిలుస్తున్నారు. వివిధ రకాల పన్నుల స్థానంలో దేశమంతా ఒకటే పన్ను విధానాన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం చేస్తున్న కీలక ప్రయత్నమే ఈ జీఎస్టీ. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌తో పాటు కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జిలు, సెస్సులు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్, ప్రవేశ పన్ను/ఆక్ట్రాయ్ వంటి 17 రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే అమల్లోకి వస్తుంది. దీంతో దేశమంతటా ఒక వస్తువు లేదా సర్వీసుపై ఒకే రకమైన పన్ను ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానం ఒక తీరులో లేదు. వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలుపెడితే దాని విక్రేతలు, చిల్లర వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకూ అన్ని దశల్లో పన్నులున్నాయి. పైపెచ్చు రాష్ట్రానికి, రాష్ట్రానికీ మధ్య వీటి విలువలు మారుతున్నాయి కూడా. పన్ను మీద పన్ను విధిస్తుండటంతో వస్తువుల ధరలు పెరగటమే కాక... కొన్నిచోట్ల తక్కువ ధరకు, మరికొన్ని చోట్ల ఎక్కువ ధరకు దొరికే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పన్ను విధానాన్ని సంస్కరించి దేశమంతటా ఒకే పన్ను అమలయ్యేలా చూడటానికి తెస్తున్న విధానమే... ‘జీఎస్టీ’!. రాజ్యాంగంలో 122వ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. జీఎస్టీ అవసరమేంటి? ఏ వస్తువు తయారీకైనా ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకులు కొనేటపుడు తయారీదార్లు వాటికి పన్నులు కడతారు. తీరా వస్తువు తయారు చేసి విక్రయించేటప్పుడు కూడా మళ్లీ పన్ను కడతారు. పైగా రాష్ట్రానికి, రాష్ట్రానికీ పన్ను రేట్లు మారుతుంటాయి కూడా. ఈ పరోక్ష పన్నులన్నీ కలిసి చివరికి వినియోగదారుడికి చేరేసరికి సుమారు 28–30 శాతం వరకూ అవుతున్నాయి. అందుకే మన దేశంలో వస్తువుల ధరలు ఎక్కువగా ఉండి... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల హవాకు కారణమవుతున్నాయి. దీన్ని సంస్కరించి జీఎస్టీని అమల్లోకి తెస్తే పన్నుల భారం కొంతయినా తగ్గి వస్తువు ధరలు దిగొస్తాయని, అప్పుడు దేశంలో ఉత్పత్తయ్యే వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులతో ధరలో కూడా పోటీ పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లోనూ మన వస్తువుల గిరాకీ పెరుగుతుందని అంచనా. జీఎస్టీని ఎవరు చెల్లించాలి? ప్రస్తుతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న వారంతా ఇకపై జీఎస్టీ పరిధిలోకే వస్తారు. వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు, వివిధ సేవలు అందించే వృత్తి నిపుణులు అంతా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అంతిమంగా మాత్రం ఈ పన్నుల భారాన్ని మోయాల్సింది కొనుగోలుదారులే. జీఎస్టీని ఎవరు నిర్వహిస్తారు? జీఎస్టీ డేటాబేస్ నిర్వహణ, సేవల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) అనే సంస్థ ఏర్పాటయింది. దీన్లో కేంద్రానికి, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు కలిపి తలా 24.5 శాతం చొప్పున 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా వివిధ ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంది. లాభాపేక్ష లేని ఈ ప్రైవేటు సంస్థ... ప్రస్తుతం ఆదాయపు పన్ను, పరోక్ష పన్నులను నిర్వహిస్తున్న ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ (టీఐఎన్) మాదిరిగానే పనిచేస్తుంది. అయితే జీఎస్టీఎన్లో పన్ను, రిటర్న్‌ల వంటివన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఏదీ కూడా భౌతికంగా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎక్కడ రిటర్న్‌లో తప్పులు దొర్లినా, జీఎస్టీ నంబర్లతో రిటర్న్‌లు సరిపోలకపోయినా ఇట్టే తెలిసిపోతుంది. జీఎస్టీ ఎన్ని రకాలంటే... 1. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సర్‌చార్జి, కౌంటర్ వీలింగ్ డ్యూటీ వంటివి సీజీఎస్టీలో విలీనమవుతాయి. 2. స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రాష్ట్ర పరిధిలోని వ్యాట్, అమ్మకం పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, వినోదపు పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, ల్యాటరీ, బెట్టింగ్‌లపై విధించే పన్నుల వంటివి ఎస్జీఎస్టీలో విలీనమవుతాయి. 3. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) ఏదైనా ఉత్పత్తులు, లావాదేవీలు రెండు రాష్ట్రాల్లోని సంస్థల మధ్య జరిగిన పక్షంలో ఐజీఎస్టీ చెల్లించాలి. ఇక్కడ ఒకే రకమైన పన్ను ఉంటుంది. అది కూడా నేరుగా కేంద్రం ఖాతాలోకి వెళుతుంది. దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, సేవలపై పన్ను కూడా ఐజీఎస్టీ పరిధిలోకే వస్తాయి జీఎస్టీతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? (రేపటి సాక్షి బిజినెస్‌లో) జీఎస్టీ నెట్‌వర్క్‌లో నమోదు చేసుకోవటమెలా? (పూర్తి వివరాల కోసం www.sakshibusiness.com చూడండి) -
నవంబర్ 16 నుంచి పార్లమెంట్
సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లుల ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూలు సంప్రదాయానికి భిన్నంగా ఒకింత ముందుకు జరిగింది. సాధారణంగా నవంబర్ చివరి వారంలో ప్రారంభమై క్రిస్మస్ పర్వదినానికి ఒకటి రెండు రోజుల ముందు పూర్తయ్యే ఈ శీతాకాల సమావేశాలను ఈ ఏడాది నవంబర్ 16వ తేదీనే ప్రారంభించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) గురువారం నిర్ణయించింది. నవంబర్ 16న మొదలై డిసెంబర్ 16వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి మిగిలి ఉన్న సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాలను పూర్తిచేయాలన్న సంకల్పంతో కేంద్రం శీతాకాల సమావేశాల షెడ్యూలును ముందుకు జరిపింది. జీఎస్టీ అమలుకు వీలుగా 122వ రాజ్యాంగ సవరణ పూర్తయినప్పటికీ సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడి అంశం ప్రధానంగా మారే అవకాశముంది.