ఎవరి వాటా ఎంత? | How much is his share? | Sakshi
Sakshi News home page

ఎవరి వాటా ఎంత?

Published Sun, Jul 2 2017 1:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

ఎవరి వాటా ఎంత?

ఎవరి వాటా ఎంత?

జీఎస్టీలో 50 శాతం వాటా కేంద్రానికే
► ఐజీఎస్టీలో సగం, సీజీఎస్టీ మొత్తం కేంద్ర ఖజానాకు
► డీలర్‌ టు డీలర్‌ అమ్మకాలపై ప్రతి ఇన్వాయిస్‌ అప్‌లోడ్‌ చేయాల్సిందే


సాక్షి, హైదరాబాద్‌ : దిలీప్‌ ఓ హోటల్‌కు వెళ్లి తనకు కావాల్సినవి తినగా రూ.500 బిల్లు అయింది. అందులో ఎస్‌జీఎస్టీ కింద రూ.45, సీజీఎస్టీ కింద రూ.45 కలిపి మొత్తం 590 రూపాయలను హోటల్‌ యాజమాన్యం వసూలు చేసింది. అయితే జీఎస్టీతో దేశమంతా ఒకటే పన్ను కదా.. మరి హోటల్‌ ఇచ్చిన పన్నులో రెండు జీఎస్టీలున్నాయేంటనేది దిలీప్‌ సందేహం.

రెండు జీఎస్టీలను హోటల్‌ బిల్లులో పేర్కొన డంలో ఏ మాత్రం తప్పులేదు. ఎందుకంటే జీఎస్టీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకుంటాయి. అందులో సీజీఎస్టీ కేంద్రానికి వెళుతుంది. ఎస్‌జీఎస్టీ రాష్ట్రానికి వస్తుంది. రెండూ కలిపితేనే అసలు జీఎస్టీ. అందుకే మనం ఏ వస్తువు కొన్నా అది ఏ శ్లాబ్‌లో ఉంటే అందులో సగం సీజీఎస్టీ కింద, సగం ఎస్‌జీఎస్టీ కింద వసూ లు చేస్తారు. అంతేకానీ మొత్తం పన్నును రెండు సార్లు వసూలు చేయడం కాదు. వీటికి తోడు బిల్లులో గతంలో ఉన్న 7 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ కలిపితేనే ఆ హోటల్‌ తప్పు చేసినట్లు.

రాష్ట్రంలోని లావాదేవీల్లోనూ అంతే..
రెండు రాష్ట్రాల మధ్య జరిగే పన్ను లావాదేవీల వ్యవహారం అలా ఉంటే.. ఒకే రాష్ట్రంలో జరిగే లావాదేవీలపై కట్టే పన్నును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం పంచుకుంటాయి. అంటే లావాదేవీ ఎక్కడ జరిగినా, ఏ వస్తువుపై పన్ను వచ్చినా అందులో సగం కేంద్రానికి వెళ్తుందన్న మాట. రాష్ట్రాంతర లావాదేవీల్లో డీలర్‌ కట్టే పన్ను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహ రణకు ఓ డీలర్‌ రూ.లక్ష పన్ను చెల్లిస్తే అందులో రూ.50 వేలు నేరుగా కేంద్ర ఖజానాకు, రూ.50 వేలు రాష్ట్ర ఖజానాకు వస్తుంది.

అయితే, డీలర్‌ మాత్రం ఒకేసారి కడతాడన్నమాట. కాగా, ఐజీఎస్టీకి సంబంధించిన పన్నును ఐజీఎస్టీ బోర్డు రాష్ట్రానికి, కేంద్రానికి పంపిణీ చేస్తే సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీలు మాత్రం నేరుగా ఆయా ప్రభుత్వాల ఖజానాకు వెళుతుంది. ఇందుకోసం జీఎస్టీలో రిజిస్టర్‌ చేసుకునే సమయంలో ప్రతి డీలర్‌ 11 వరకు బ్యాంకు అకౌంట్‌ నంబర్లను ఇవ్వొచ్చు. అయితే, ఏ వస్తువుపై పన్ను కడుతున్నాడో ఆ వస్తువు అమ్మకానికి సంబంధించిన ఇన్వాయిస్‌లో పేర్కొనే బ్యాంకు ఖాతా ద్వారానే పన్ను చెల్లించాలి.

కాగా, డీలర్లు ప్రతి వ్యాపార లావా దేవీలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను జీఎస్టీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన పనిలేదని జీఎస్టీ చట్టం చెబుతోంది. డీలర్‌ టు డీలర్‌కు జరిగే లావాదేవీలను పూర్తిగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉండగా, డీలర్‌కు వినియోగదారుడికి మధ్య జరిగే లావాదేవీల ప్రతి ఇన్‌వాయిస్‌ను అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరంలేదు. అయితే, ఈ లావాదేవీ రూ.2.5 లక్షలకు మించితే మాత్రం సదరు ఇన్‌వాయిస్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఎలా పంచుకుంటారంటే..
పన్ను వసూలు అలా ఉంటే.. ఈ పన్నును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పంచుకుంటా యి? పన్నును వసూలు చేసే డీలర్‌ రెండింటికీ రెండు సార్లు పన్ను కట్టాలా? ఒకసారి కడితే సరిపోతుందా? అనే సందేహాలు కూడా వ్యాపార వర్గాల్లో ఉన్నాయి.వాస్తవానికి జీఎస్టీని మూడుగా విభజించారు. అందులో మొదటిది సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ).

దీన్ని రెండు రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తారు. దీని పన్నును డీలర్‌ కట్టినప్పుడు అది నేరుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్లిపోతుంది. అక్కడ ఉన్న ఐజీఎస్టీ బోర్డు ఆ పన్ను కట్టిన వస్తువు ఏ రాష్ట్రంలో వినియోగం జరిగిందన్న దాన్ని పరిశీలించి ఆ రాష్ట్రానికి 50 శాతం పంపి, 50 శాతం తన ఖజానాలో ఉంచుకుంటుంది. అంటే అంతర్రాష్ట్ర లావాదేవీల్లో వచ్చే పన్ను రాబడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరి సగం అన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement