సాక్షి, విశాఖపట్టణం : పారిశ్రామికవేత్తలతో పాటు అందరికీ వెసులుబాటు కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన సబ్‌కా విశ్వాస్ పథకాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని సీజీఎస్టీ కమిషనర్ డీకే శ్రీనివాస్ కోరారు. 2019 జూన్ చివరి నాటికి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నవారు, షోకాజ్ నోటీసులు అందుకున్నవారు ఈ పథకంతో 70 శాతం రాయితీని పొందవచ్చని తెలిపారు. ఏపీలో మూడు వేల కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలున్నాయని వెల్లడించారు. పన్ను ఎగవేతదారులు సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసులు ఉపసంహరించుకునే అవకాశంతో పాటు న్యాయస్థానాలపై కూడా ఒత్తిడి తగ్గుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment