న్యూఢిల్లీ: యువతిపై లైంగికదాడి కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ హైకోర్టు గురువారం పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. 24 ఏళ్ల యువతిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి పవన్ కుమార్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవాలను వెలుగులోకి తేవడానికి పోలీసులు ఏ మాత్రం కృషి చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. బాల్యం నుంచే ఆమె తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడ నే విషయమై సరైన దర్యాప్తు జరగలేదు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే చేయలేదు, ఈ కేసు దర్యాప్తు నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, దర్యాప్తులో తీవ్ర జాప్యం జరిగింది. ఈ కేసు విషయమై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిందితుడైన తండ్రి తరఫున న్యాయవాది కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. అయితే, కేసు దర్యాప్తు లోప భూయిష్టంగా సాగిందని, ఆ కారణంగా నిందితురాలు, ఆమె కుటుంబంతోపాటు నిందితుడికి కూడా న్యాయ జరుగదని జడ్జి పేర్కొన్నారు. ఇలాంటి విచారణ వల్ల ఆశించిన ప్రయేజనమేమీ నెరవేరదని అభిప్రాయపడ్డారు. ఈ రకమైన చార్జిషీట్‌తో ముందుకు వెళ్లడం కూడా సరికాదని పేర్కొన్నారు.
అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో నిష్ణాతులైన పోలీసు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి, తిరిగి కేసు దర్యాప్తు చేసి నివేదికను అందజేయాలని పోలీస్ కమిషనర్‌ను జడ్జి ఆదేశించారు. ఇప్పటి వరకూ జరిగిన కేసు దర్యాప్తు కారణంగా పోలీసులు, రాష్ట్ర యంత్రాంగం ఎంతో విలువైన సమయం వృథా అయ్యిందని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ కథనం.. మే 14,2014లో బాధితురాలైన బాలిక తన తండ్రి కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి 2010లో మృతి చెందింది. కొన్నేళ్లుగా డ్రగ్ అడిక్షన్ సెంటర్‌లో బాలిక తండ్రి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
లైంగికదాడి కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించండి
Published Thu, Dec 11 2014 11:56 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement