సెక్స్‌ వర్కర్‌తో ప్రేమ.. | Man falls in love with sex worker, rescues her from brothel in Delhi | Sakshi
Sakshi News home page

సెక్స్‌ వర్కర్‌తో ప్రేమ..

Published Fri, Jul 7 2017 7:47 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

సెక్స్‌ వర్కర్‌తో ప్రేమ.. - Sakshi

సెక్స్‌ వర్కర్‌తో ప్రేమ..

న్యూఢిల్లీ: ప్రేమ గుడ్డిది అంటారు కొందరు. నిజమైన ప్రేమ కళ్లతో ఎదుటి వ్యక్తిని చూడదు. మనసుతో చూస్తుంది. అలాంటి రేర్‌ ప్రేమ కథ ఒకటి ఢిల్లీలో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. 27 ఏళ్ల ఓ సెక్స్‌ వర్కర్‌ను మార్కెట్‌లో చూసిన ఓ వ్యక్తి తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు.

ఆనాటి నుంచి ఆమె కోసం రోజూ వేశ్యా గృహానికి వెళ్లి వచ్చేవాడు. ఈ తంతు దాదాపు రెండేళ్ల పాటు సాగింది. ఈ క్రమంలో మహిళ కూడా అతన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే, వేశ్యా గృహాన్ని నిర్వహించే వ్యక్తి ప్రేయసిని బయటకు రానివ్వకపోవడంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించాడు.

వేశ్యా గృహంలో ఉంటున్న మహిళ, తాను ప్రేమించుకుంటున్నామని.. తనను పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉందని, ఆమెను వేశ్యా గృహ చెర నుంచి విడిపించాలని కోరాడు. 2015లో నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత ఆమె ఢిల్లీకి రాగా, ఓ వ్యక్తి మోసం చేసి వేశ్యా గృహానికి అమ్మేశాడని మహిళా కమిషన్‌ అధికారులకు వివరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఢిల్లీ మహిళా కమిషన్‌ అధికారులు వేశ్యా గృహంపై రైడింగ్‌ చేసి ఆమెను విడిపించి ప్రేమికులను ఒక్కటి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement