నిజామాబాద్: జిల్లాలో ఏళ్లుగా తిష్ట వేసిన పోలీస్ అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పైరవీలు షు రూ చేశారు. ప్రస్తుతం ఉన్నవాళ్లంగా బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యేల సిఫార్సుల ద్వారా జిల్లాలో పోస్టింగ్ పొందారు. గతంలో అధికార పార్టీకి అండగా ఉండి ప్రతిపక్షపార్టీలపై కఠినంగా ఉండటంతో కొంత మంది పోలీసు అధికారులకు బదిలీ తప్పదనే ప్రచారం ఉంది. జిల్లాలోని 6 నియోజకవర్గంలో రెండు స్థానా ల చొప్పున బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యేల సి ఫార్సు లేఖలతో ఎస్సైలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలు పోస్టింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సిఫార్సుతో వచ్చినవారే విధుల్లో ఉన్నారు. పదిహేను రోజుల్లో జిల్లాలో పోలీసుల బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతుంది.
సిఫార్సులతో వచ్చిన వారిపై ఆరా..
జిల్లాలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిఫార్సులో వచ్చిన పోలీసులకు సంబంధించిన వివరా ల జాబితాను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. వీరు పని చేసిన ప్రాంతంలో ప్రతిపక్షా పారీ్టలపై వ్యవహరించిన తీ రుపై జాబితాను తీసుకున్నట్లు సమాచారం. ఇటీవ ల అధికార పార్టీ ఎమ్మెల్యేను సీఐతో పాటు ఎస్సైలు వెళ్లి మర్యాద పూర్వకంగా కలవగా ఎన్నికల్లో అప్ప టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై సదరు ప్రజాప్రతినిధి ప్రస్తావించడంతో పో లీసు అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది.
బీజేపీ, కాంగ్రెస్ వద్ద పోలీసుల జాబితా
ఎన్నికల సమయంలో గత సీపీ సత్యనారాయణపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫి ర్యాదు చేయడంతో సీపీ కల్మేశ్వర్‌కు ఎన్నికల సంఘం పోస్టింగ్ ఇచ్చింది. ఎన్నికలప్పుడు అధికార పారీ్టకి అండగా ఉన్నారని ఎస్సై, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు, సీపీ కల్మేశ్వర్‌కు జాబితాను అందించినట్లు తెలిసింది. వారికి బదిలీ తప్పదనే చర్చ జరుగుతోంది.
వ్యక్తిగత సెలవులో బోధన్ ఏసీపీ
ఎన్నికల సమయంలో ఎడపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులిశ్రీనివాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో జరిగిన సమావేశంలో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ పేరును తన రెడ్‌డైరీలో రాసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 2న జిల్లా పర్యటనకు వచ్చిన ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను కూడా కాంగ్రెస్ నాయకులు కలిసి సదరు పోలీసులపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్, ఎస్‌హెచ్‌వో ప్రేమ్‌కుమార్ వ్యక్తిగత సెలవులో వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బదిలీవేటు తప్ప దని భావించిన ఏసీపీ, ఎస్‌హెచ్‌వో వ్యక్తిగత సెలవులలో వెళ్లినట్లు పోలీస్‌వర్గాలలో ప్రచా రం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment