సాక్షి, హైదరాబాద్: నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని.. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతో మాత్రమే నేరగాళ్లతో కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నార్కోటిక్, సైబర్ సెక్యూరిటీ ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. అనంతరం టీజీ న్యాబ్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థలో అనేక విభాగాలు ఉన్నాయి. నేరగాళ్లు ఆలోచన కూడా సాంకేతికంగా మారింది. నేరాలను నియంత్రించే క్రమంలో పోలీసులకు అన్ని వసతులు ఉండాలన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ సైబర్ క్రైం. రేప్‌లు, మర్డర్లు కంటే పెద్ద క్రైమ్‌గా సైబర్ క్రైం, డ్రగ్స్ మారాయి. గత 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల గల్లీ గల్లీకి గంజాయి పాకింది. కాలేజీలలో విచ్చలవిడిగా గoజాయి దొరుకుతుంది. వీటిని నియత్రించేందుకు అధికారులకు అన్ని అధికారులు ఇచ్చాం. మధ్య తరగతి పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు’’ అని సీఎం పేర్కొన్నారు.
సైబర్ క్రైమ్, డ్రగ్స్ కేసుల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి నగదు బహుమానంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించండి. సినిమా షూటింగ్ పర్మిషన్లకు మా దగ్గర వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వారు టికెట్ ధరల పెంపు కోసం మా దగ్గరకు వస్తున్నారు. డగ్స్ర్ నియంత్రణ, సైబర్ క్రైం నియంత్రణ కోసం సినిమా రంగం పని చేయాలి. థియేటర్ యజమానులు కూడా సినిమాకు ముందు డ్రగ్స్, సైబర్ క్రైంపై యాడ్స్ ప్రదర్శించాలి. అవగాహన వీడియోలు తీసి ఇస్తేనే మా తరపున సహకారం ఉంటుంది’’ అని రేవంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment