
సాక్షి, హైదరాబాద్: ఒంటిపై పెట్రోలు పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్‌లో కలకలం రేపింది. సెల్‌ఫోన్ చోరీ కేసులో అనుమానితుడైన షబ్బీర్‌ఆలీ పోలీసులు వేధిస్తున్నారని ఒంటికి నిప్పు పెట్టుకుని రోడ్డుపై పరుగులు తీశాడు. పోలీసు సిబ్బంది వెంటనే ఆ వ్యక్తి వెంట పడి మంటలను ఆర్పారు. షబ్బీర్‌ఆలీకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment