chandrayana gutta
-
చాంద్రాయణగుట్టకు 45 ఏళ్లుగా ఇద్దరే..
సాక్షి, హైదరాబాద్: అక్కడ ఇప్పటివరకు ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలుగా గెలిచారు.. అలా అని అదేం కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమేమీ కాదు.. ఏకంగా పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కొక్కరు వరుసగా అయిదుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అదెక్కడో కాదు..పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో. ఒకరేమో అమానుల్లాఖాన్ కాగా మరొకరు అక్బరుద్దీన్ ఒవైసీ. అమానుల్లాఖాన్ ప్రస్థానం ఇలా ♦ 1978 ఎన్నికలకు ముందు చాంద్రాయణగుట్ట నియోజక వర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అమానుల్లాఖాన్ కాంగ్రెస్ అభ్యర్థి బాలయ్యపై 1,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ♦ 1983లో ఎ.నరేంద్ర(బీజేపీ)పై 3,581 ఓట్లతో, 1985లో 3,009 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ 1989 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 28,147 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ♦1994 ఎన్నికల నాటికి సలావుద్దీన్ ఒవైసీతో విభేదించి మజ్లిస్‌కు పోటీగా అమానుల్లాఖాన్ ఎంబీటీ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎంబీటీ తరఫున పోటీచేసి ఎంఐఎం అభ్యర్థిపై 35,210 ఓట్లతో గెలిచారు. అక్బరుద్దీన్ ఒవైసీ ఎంట్రీతో... ♦ అమానుల్లాఖాన్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసేలా సలావుద్దీన్ ఒవైసీ తన చిన్న కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీని 1999 ఎన్నికల్లో పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో 11,920 ఓట్ల మెజారిటీతో అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. ♦ 2004 ఎన్నికల్లో 11,949 ఓట్ల మెజా రిటీతో గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో 15,177 ఓట్లతో, 2014లో 59,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మోగించారు. 2018 ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఒవైసీ భాజపా అభ్యర్థి షెహాజాదీ సయ్యద్‌పై 80,264 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. వరుసగా అయిదు సార్లు గెలిచి అమానుల్లాఖాన్ రికార్డును సమం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అక్బర్ చాంద్రాయణగుట్ల నుంచే పోటీ చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
చిన్నారిపై ఉపాధ్యాయుడి ఆత్యాచారయత్నం.. బాలిక వీపుపై..
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): విద్యబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కామంతో కండ్లు మూసుకుపోయి ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాల ప్రకారం... పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఆశ్వక్ అహ్మద్ ఖాన్ (35) 2015 నుంచి ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా శనివారం పాఠశాలలో సుమారు 8.30 గంటలకు సమయంలో అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా బాలిక వీపుపై విచక్షణారహితంగా కొట్టాడు. బాలిక అదే పాఠశాలలో చదువుతున్న తన సోదరుడితో ఈ విషయం చెప్పడంతో ఆ బాలుడు తండ్రికి సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న బాలిక తండ్రి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడికి మతిస్థిమితం సరిగా లేదని తోటి ఉద్యోగులు తెలిపారు. చదవండి: (Hyderabad: నగరంలో 8 మంది అదృశ్యం) -
బయటకని చెప్పి వెళ్లింది.. ఎంతసేపైనా రాకపోయేసరికి..
సాక్షి,చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): బయటకు వెళ్లిన ఓ యువతీ కనిపించకుండా పోయిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బండ్లగూడ జహంగీర్‌నగర్ ప్రాంతానికి చెందిన షకీలా బేగం, మహ్మద్ సాబేర్ దంపతులు. వీరి కూతురు సనా బేగం(20) 5వ తేదీన సాయంత్రం బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కూతురు కనిపించడం లేదని షకీలా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికంగా ఉండే సమీర్ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854763లో సమాచారం అందించాలన్నారు. ( చదవండి: పోలీస్‌స్టేషన్ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని.. ) మరో ఘటనలో.. పోలీసులమని డబ్బులు లాక్కున్న ఇద్దరి అరెస్టు డబీర్‌పురా: పోలీసులమని చెప్పి డబ్బులు, సెల్‌ఫోన్ లాక్కున్న ఇద్దరు నిందితులను మీర్‌చౌక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. దారుషిఫా ప్రాంతానికి చెందిన మహ్మద్ సోహెబ్ ఖాన్ ఈ నెల 5వ తేదీన రాత్రి మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు కాలికమాన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా పట్టుబడ్డాడు. అదే సమయంలో స్థానికంగా ఉన్న మహ్మద్ సల్మాన్(28), రఫివుద్దీన్ సయ్యద్ ఆలియాస్ మాలిక్(36)లు సోహెబ్ ఖాన్ వద్దకు చేరుకొని వాహనాన్ని మేము విడిపిస్తామని, తాము పోలీసులమని చెప్పి అతడి వద్ద నుంచి ఆన్లైన్లో రూ.3 వేలు వసూలు చేశారు. అనంతరం సోహెబ్ ఖాన్ వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకొని ఇద్దరు పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం మహ్మద్ సల్మాన్, మాలిక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
భర్త ఇంటికి వచ్చేసరికి భార్యతో సహా పిల్లలు..
సాక్షి ,చాంద్రాయణగుట్ట( హైదరాబాద్) : నలుగురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్ కాలనీ ప్రాంతానికి చెందిన మహ్మద్ రఫీ, అతియా బేగం (29) దంపతులు. వీరికి తన్వీర్ బేగం (13), మహ్మద్ హైదర్ (12), మహ్మద్ సోహేల్ (10), మెహాక్ బేగం (8) సంతానం. కాగా ఈ నెల 4న భర్త మహ్మద్ రఫీ తన సోదరుణ్ని వదిలేందుకు గుల్బార్గాకు వెళ్లాడు. అనంతరం ఈ నెల 5వ తేదీ రాత్రి 6.30 గంటలకు రఫీ తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్యతో పాటు నలుగురు పిల్లలు కనిపించకుండా పోయారు. దీంతో భార్యకు ఫోన్‌ను చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు చెందిన రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854763 నంబర్లో సంప్రదించాలన్నారు. ( చదవండి: కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య ) -
ఇదో రకం చీటింగ్: కొనక ముందు పుత్తడి.. కొన్నాక ఇత్తడి
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముగ్గురితో ఏర్పడిన అంతరాష్ట్ర ముఠా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి అంటగట్టడం మొదలెట్టింది. ట్రావెల్ ఏజెంట్లు, వ్యాపారుల విజిటింగ్ కార్డ్స్ ఆధారంగా వాళ్లకు ఫోన్లు చేసి ఎర వేస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ నుంచి రూ.17 లక్షలు కాజేసింది. ఈ ముఠా కోసం రంగంలోకి దిగిన చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వీరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్స్‌తో పరిచయం...తరువాత ► కర్ణాటక, ఏపీలోని సరిహద్దు ప్రాంతాలకు చెందిన శివయ్య (డ్రైవర్), తిరుపతయ్య (రైతు), బి.ఇంద్రాజు (డ్రైవర్) ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్స్‌తో పరిచయం ఏర్పరుచుకుని వారి నుంచి విజిటింగ్ కార్డ్స్ తీసుకుంటారు. ఆపై వారికి ఫోన్లు చేసి తమకు దొరికిన బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఎర వేస్తారు. ► చాంద్రాయణగుట్ట పరిధిలోని రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ కేఎల్ఏ లాజిస్టిక్స్ అండ్ బస్ టిక్కెట్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. గత నెలలో ఈయన వద్దకు వచ్చిన ఈ త్రయం విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు మరోసారి వచ్చి ఆ టిక్కెట్ కేన్సిల్ చేసుకున్నారు. అలా ఆయనతో పరిచయం పెంచుకుని విజిటింగ్ కార్డు తీసుకున్నారు. గత నెల 9న విజయ్‌కుమార్‌కు కాల్ చేసిన ఈ ముఠా సభ్యులు తమకు బంగారం దొరికిందన్నారు. ► మైసూర్ ప్రాంతంలో ఉన్న తమ పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బంగారు ఆభరణాలతో కూడిన లంకె బిందెలు దొరికాయని, ఆ పసిడిని కేజీ రూ.17 లక్షలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. కావాలంటే మచ్చుకు కొంత ఇస్తామన్నారు.. ఇది జరిగిన నాలుగు రోజులకు బండ్లగూడ ప్రాంతంలో విజయకుమార్‌ను కలిసిన వాళ్లు ఇత్తడితో చేసి, పుత్తడి కోటింగ్ వేసిన ఆభరణం చూపించి నమ్మించారు. పథకం ప్రకారం ముందుగా వాటిలో ఉంచిన అసలు బంగారం ముక్కల్ని తీసి ఇచ్చారు. ► వీటిని బంగారం దుకాణానికి తీసుకువెళ్లిన విజయ్‌కుమార్ పరీక్ష చేయించారు. ఆ సందర్భంలో ఇది నిజమైన బంగారమే అని తేలడంతో ఆయన పూర్తిగా నమ్మారు. ఆపై రూ.17 లక్షలు ఆ ముగ్గురికీ చెల్లించి కేజీ ‘బంగారం’ ఖరీదు చేశారు. ► పది రోజుల తర్వాత కొత్తగా ఆభరణాలు చేయించుకోవడానికి వీటిని తీసుకుని బంగారం దుకాణానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అది పుత్తడి కాదని, ఇత్తడని తేలడంతో తాను మోసపోయానని బాధితుడు గుర్తించాడు. ► దీంతో ఆయన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను గుర్తించి వారి నుంచి రూ.15 లక్షలు రికవరీ చేశారు. ( చదవండి: శ్వేతను బతికించండి ) -
చాంద్రాయణగుట్ట: బాబానగర్‌లో కాళరాత్రి
-
ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. మంగళ్‌హాట్, చాంద్రాయణగుట్టలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడేళ్ల మరుయం, అయిదేళ్ల హర్షవర్థన్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సీతారాం బాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే అయిదేళ్ల బాలుడిని పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ భగవాన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని సీఐ రంవీర్ రెడ్డి తెలిపారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. (రోడ్డు ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో..) నిర్లక్ష్యం ఖరీదు ఓ పసి బాలిక మృతి.. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మిల్లత్ నగర్ వద్ద ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మూడేళ్ల మరుయం అనే బాలిక టిప్పర్ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పాప మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు తీవ్ర కోపోద్రిక్తులు అవుతున్నారు. (ఘోర ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) -
కండల కోసం స్టెరాయిడ్స్!
సాక్షి, సిటీబ్యూరో : అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్ టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వినియోగిస్తోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి ఈ సూది మందు తీసుకుంటోంది. ఈ ఇంజక్షన్‌ను అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.5 లక్షలు విలువైన 130 మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి శనివారం వెల్లడించారు. ►చంద్రాయణగుట్ట పరిధిలోని అల్ జూబ్లీ కాలనీకి చెందిన మహ్మద్ షా ఫహద్ గతంలో ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ రకాలైన ఔషధాలు, వాటిలో స్టెరాయిడ్స్‌గా ఉపకరించే వాటిపై పట్టుంది. ఇతడికి మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, దీన్ని యువత ఎక్కువగా వాడతారని తెలిసింది. ►రోగులకు సర్జరీలు చేసే సమయంలో మత్తు (అనస్తీషియా) ఇస్తారు. ఈ ఇంజక్షన్ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పని చేయడానికి ఉపకరిస్తుంది. అలాగే గుండెపోటు వచ్చిన వారికీ వైద్యం కోసం ఈ ఇంజక్షన్‌ను వాడతారు. ►ఈ ఇంజక్షన్‌ను రోగికి ఇవ్వడం ద్వారా అతడి నరాలు పూర్తిస్థాయిలో తెరుచుకునేలా చేయవచ్చు. దీంతో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ముప్పు తప్పే ఆస్కారం ఉంటుంది. అయితే కాలక్రమంగా ఈ ఇంజక్షన్‌ను అథ్లెట్స్ స్టెరాయిడ్‌గా వాడటం మొదలెట్టారు. ►నగరంలో జిమ్‌లకు వెళ్తున్న యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం వైద్యుడి ప్రిస్కిప్షన్ లేనిదే ఈ ఇంజక్షన్ విక్రయించేందుకు వీలులేదు. ►కొందరు అక్రమార్కులు వీటిని జిమ్‌లకు వెళ్లే యువతకు అక్రమంగా, ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన ఫహద్ చాదర్‌ఘాట్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఓవైసీతో జట్టు కట్టాడు. వీరిద్దరూ ఢిల్లీకి చెందిన అక్షయ్ ఎంటర్ప్రైజెస్ అనే మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు విక్రమ్ సాయంతో ఈ ఇంజక్షన్లు ఖరీదు చేస్తున్నారు. ►అక్కడి నుంచి కొరియర్లో సిటీకి తెప్పించి జిమ్‌లకు వెళ్లే యువతకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్ థక్రుద్దీన్లతో దాడి చేసి ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. ►150 ఇంజక్షన్లను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటా యని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
చాంద్రాయణగుట్ట పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం
-
పీఎస్‌లో కలకలం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: ఒంటిపై పెట్రోలు పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్‌లో కలకలం రేపింది. సెల్‌ఫోన్ చోరీ కేసులో అనుమానితుడైన షబ్బీర్ఆలీ పోలీసులు వేధిస్తున్నారని ఒంటికి నిప్పు పెట్టుకుని రోడ్డుపై పరుగులు తీశాడు. పోలీసు సిబ్బంది వెంటనే ఆ వ్యక్తి వెంట పడి మంటలను ఆర్పారు. షబ్బీర్‌ఆలీకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. -
అరబ్‌షేక్‌కు గృహిణిని విక్రయించిన దళారీ
చాంద్రాయణగుట్ట: అరబ్ షేక్‌ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దళారీలను అడ్డుపెట్టుకుని పేద మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్‌పేటకు చెందిన వివాహిత ఫాతిమా ఉన్నీసాకు బార్కాస్ కొత్తపేట నబీల్ కాలనీలో ఇల్లు ఉంది. ఆర్థిక అవసరాల నిమిత్తం ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్న ఫాతిమా ఉన్నీసా దళారీ మహ్మద్ సాబెర్ అలియాస్ వోల్టా సాబెర్‌ను చెప్పింది. ఇల్లు కొనేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని సాబెర్ ఫిబ్రవరి 25న ఫాతిమాకు ఫోన్ చేశాడు. ఇల్లు చూపించేందుకని ఆమె తన చెల్లెలు వివాహిత రఫత్ ఉన్నీసా(25)తో కలిసి వెళ్లింది. అక్కడికి వెళ్లగానే ముందస్తు పథకంలో భాగంగా అక్కడకు వచ్చిన అరబ్ షేక్ ఇబ్రహీం షుక్రుల్లా (60) ఫాతిమాను పెళ్లి చేసుకుంటా నని అడిగాడు. దానికామె అంగీకరించకపోవటంతో ఆమె చెల్లి రఫత్‌ను కూడా అడిగాడు. ఆమె కూడా తిరస్కరించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. సాబె ర్ అనే దళారి రంగంలోకి దిగి, రఫత్‌ను విక్రయిస్తామని షేక్ దగ్గరనుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంతో సాబెర్ తన భార్య సమీనా ద్వారా రఫత్‌ను తన ఇంటికి వచ్చేలా ఒప్పించాడు. ఆమె రాగానే, నేరుగా షేక్ వద్దకు తీసుకెళ్లి ఇంట్లోకి నెట్టి బయటికి వచ్చేశారు. అప్పట్నుంచి ఆ షేక్ ఆమె పట్ల క్రూరంగా లైంగిక దాడికి దిగాడు. సిగరెట్లతో కాల్చుతూ చిత్ర హింసలకు గురి చేశాడు. తన చెల్లెలు జాడ కోసం ఫాతిమా దళారీ సాబెర్‌ను గట్టిగా అడగడంతో అసలు విషయం వెల్లడించాడు. ఆ చిరునామాకు వెళ్లేసరికి షేక్ తన పాస్‌పోర్టును వదిలి పారిపోయాడు. ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నను అడ్డుకున్నా...తమ్ముడు వదలలేదు
సాక్షి, చాంద్రాయణగుట్ట: పరిచయం లేని ఇద్దరి ఆడపిల్లల్ని ఇంటికి ఆటోలో తెచ్చిన కొడుకును సందేహించిన అతని తల్లి వారిని సురక్షితంగా వారింటికి పంపాలని రెండో కుమారుడికి అప్పగిస్తే అతనూ బరితెగించి ఓ బాలికపై లైంగికి దాడికి పాల్పడిన సంఘటన నగరంలోని చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసులో తొలుత ఇరువురి బాలికల కిడ్నాప్‌నకు పాల్పడిన అన్నను, వారిలో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడిన తమ్ముడ్ని పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండుకు తరలించారు. ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం ప్రకారం.....ఇంద్రానగర్‌కు చెందిన ఓ వ్యక్తి కుమార్తె (10) ఈ నెల 8వ తేదీ ఉదయం హాషామాబాద్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. అదేరోజు మధ్యాహ్నం ఆ బాలిక తనకు సోదరి వరుస అయ్యే మరో బాలిక (18)తో కలసి రోడ్డుపై వెళుతున్న సమయంలో అటుగా వచ్చిన వట్టెపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఆమెర్ (24) అడ్డగించాడు. వారిని ఆపి బెదిరించి తన ఆటో (టీఎస్11యూఏ 8408)లో ఎక్కించుకొని గల్లీల్లో తిప్పుకుంటూ చార్మినార్, నాంపల్లి దర్గా వద్దకు తీసుకెళ్లి వారిపై అఘాయిత్యానికి పాల్పడాలన్న పథకంతో సాయంత్రం వట్టెపల్లిలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికి ఇంట్లోనే ఉన్న అతని తల్లి వారిని చూసి ప్రశ్నించింది. వెంటనే వారికి భోజనం చేయించిన ఆమె పెద్ద కుమారుడి తీరుపై అనుమానించి....చిన్న కుమారుడు మహ్మద్ మూసా (21)కు బాలికలకు తోడుగా వెళ్లి వారి ఇంటి వద్ద దించి రావాలని సూచించింది. దీంతో అతడు వారిని బైక్‌పై ఎక్కించుకొని తీవ్రంగా బెదిరించి నేరుగా నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.వారిలో చిన్న పాప నిద్ర పోవడంతో....18 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం బాలికలను ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ వద్ద విడిచి వెళ్లిపోయాడు. అనంతరం బాధితులు వారి కుటుంబీకులకు ఫోన్ చేయడంతో వారొచ్చి ఇంటికి తీసుకెళ్లారు. తొలుత విషయం చెప్పడానికి భయపడిన వారు....చివరకు జరిగిన విషయాన్ని వెల్లడించారు. బాలికల అదృశ్యంపై 8వ తేదీ రాత్రే వారి తండ్రి చాంద్రాయణగుట్టలో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మరుసటిరోజు ఇంటికి వచ్చిన బాలికలను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘోరాన్ని తెలియజేశాడు. అత్యాచారానికి గురైన బాలికను భరోసా సెంటర్‌కు తరలించిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. -
లాల్‌దర్వాజా బోనాలు నేడే
సాక్షి, చాంద్రాయణగుట్ట : బోనాల జాతరకు లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. ఆదివారం ఉదయం అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. ఇందుకోసం శనివారం ఉదయం నుంచే ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఆలయ పరిసరాల్లో మోహరించారు. బాంబు, డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయించారు. అమ్మవారికి ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 6 గంటలకు మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా దేవి మహాభిషేకం చేస్తారు. అనంతరం బోనాల సమర్పణ ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగరావు తెలిపారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం చేయనున్నట్టు చెప్పారు. లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల్లో మంత్రులు మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మాజీ ఎంపీలు కవిత, విజయశాంతి, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కాగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం పాతబస్తీకి ఆర్టీసీ ‘లాల్‌దర్వాజా బోనాలు’ పేరుతో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. -
‘సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : అంతర్గత భద్రతా సమస్యల పరిష్కారానికి కే౦ద్ర ప్రభుత్వ౦ కృత నిశ్చయ౦తో ఉ౦దని కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కే౦ద్ర రిజర్వ్ పోలీసు బలగాల 81వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా చా౦ద్రాయణ గుట్టలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మావోయిస్టుల హింసను తగ్గి౦చటంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిందని ప్రశంసించారు. మావోయిస్టులపై కే౦ద్ర ప్రభుత్వ దృఢ వైఖరి కారణంగా గత ఐదేళ్లలో మావోయిస్టు హింస బాగా తగ్గిందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు సీఆర్పీఎఫ్ కీలకంగా వ్యవహరించిందన్నారు. ఇక ప్రభుత్వం భద్రతా దళాలకు అన్ని రకాల సాంకేతిక గాడ్జెట్లు, ఆధునిక ఆయుధాలను అందిస్తోందని, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు స౦బ౦ధి౦చిన సంక్షేమ సమస్యలను కూడా పరిష్కరిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషి౦చిన కే౦ద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు చె౦దిన అధికారులు, సిబ్బ౦ది వృత్తి నైపుణ్యాన్ని ఆయన అభినందించారు. కాగా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరి౦చుకొని సీఆర్పీఎఫ్ హైదరాబాద్ గ్రూప్ సె౦టర్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ, పుల్వామా అమరవీరులకు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సహా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఐజీపీ ఎంఆర్ నాయక్, ఇతర సీనియర్ ఆఫీసర్లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సైనికుల గౌరవార్థ౦ 40 రకాల మొక్కలు నాటారు. అదే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 81 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం గ్రూప్ సె౦టర్లోని సెక్టార్ ట్రైనింగ్ నోడ్‌ను మ౦త్రి సందర్శించారు. అదే విధంగా వివిధ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను అనుసరించి దళాల ప్రదర్శనలను ఆయన తిలకి౦చారు. ఇక ప్రదర్శనలో భాగ౦గా నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో దృశ్యాలను వర్ణిస్తూ నక్సల్ రహస్య స్థావరాలపై దళాలు దాడి చేశాయి. తరువాత ఆధునిక ఆయుధాలు మరియు ప్రతిఘటన తిరుగుబాటు కార్యకలాపాలలో ఉపయోగించే పరికరాలను ప్రదర్శించారు. జన సమూహ నియంత్రణపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రదర్శి౦చిన మరో ప్రదర్శన ప్రేక్షకులందరినీ మంత్రముగ్దులను చేసింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోహరించిన బలగాల సిబ్బంది కార్యాచరణ, పరిపాలనాపరమైన అంశాలపై సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులందరితో మంత్రి సమీక్ష సమావేశ౦ నిర్వహి౦చారు. -
అత్తింటి ముందు కోడలు ఆందోళన
సాక్షి, చాంద్రాయణగుట్ట: వేధింపులకు గురిచేస్తూ ఇంటి నుంచి గెంటేసిన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ గృహిణి ధర్నాకు దిగారు. బాధితురాలి వివరాల ప్రకారం.. మెహదీపట్నానికి చెందిన చెందిన శృతిరేఖకి లలితాబాగ్‌కు చెందిన కరణ్ కేస్వానీతో 2018 జూన్ 18న వివాహం జరిగింది. వివాహ సమయంలో బంగారంతోపాటు కట్న కానుకలు ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నప్పటికీ.. అనంతరం కరణ్ భార్యను వేధించడం ప్రారంభించాడు. తక్కువ కులం దానివని, అందంగా లేవని, అదనపు కట్నం తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. ఇలా ఎనిమిది నెలల నుంచి అత్తింటికి రాకుడా అడ్డుకుంటున్నాడు. దీంతో ఆమె మహిళా సంఘం నాయకురాళ్లతో కలిసి శనివారం కరణ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ధర్నా చేస్తుందన్న విషయం తెలుసుకున్న ఛత్రినాక ఇన్స్పెక్టర్ ఆర్ విద్యాసాగర్ రెడ్డి ఆమెను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 13తులాల బంగారం, 27 వేల నగదు, 10 తులాల వెండి, 2 సెల్ ఫోన్లను చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బరిలో బాహుబలి!
గతంలో క్రీడలు, సినీ గ్లామర్‌తో అభిమానుల మన్ననలందుకున్న క్రీడాకారులు, సినీ నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వీరిలో కొందరుహిట్టవ్వగా.. మరికొందరు ఫట్ అన్నారు. ఇంకొందరు రాజకీయచతురత కొరవడి చతికిలపడిన వారూ ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోఓ క్రీడాకారుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బాడీబిల్డర్ విభాగంలో ఎన్నో పతకాలను సాధించి తనకంటూ ప్రత్యేకతనుసాధించుకున్న ఇసా బిన్ ఒబేద్ మిస్రీ కాంగ్రెస్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా చాంద్రాయణగుట్ట బరిలో నిలిచారు. ఇక్కడినుంచి వరుసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించిన అక్బరుద్దీన్ ఒవైసీనిఢీకొట్టబోతున్నారు. బాడీబిల్డర్‌గా సత్తా చాటిన ఇసాబిన్ ఒబేద్మిస్రీ ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చాంద్రాయణగుట్ట :పాతబస్తీ కాజీపురాకు చెందిన ఇసా బిన్ ఒబేద్ మిస్రీ తండ్రి రెజ్లర్ (మల్లయోధుడు). మిస్రీ 18వ ఏటనే బాడీ బిల్డర్‌గా మారారు. అంచలంచెలుగా ఎదుగుతూ మూడు దశాబ్దాల కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కించుకున్నారు. ప్రముఖ బాడీ బిల్డర్‌గా మారిన ఇతనికి ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమంలో లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు అహ్మద్ బిన్ ఇసా మిస్రీ, ఉస్మాన్ బిన్ ఇసా మిస్రీలు సైతం బాడీ బిల్డర్లే. ఇసా మి్రïసీకి బండ్లగూడలో ఫంక్షన్ హాళ్లతో పాటు కాజీపురాలో జిమ్ వ్యాపారం ఉంది. మార్పు తెచ్చేందుకే.. పాతబస్తీలో మజ్లీస్ పార్టీ హిందు, ముస్లింల నడుమ చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రజలకు అందుబాటులో ఉండటంలేదు. ఈ విధానానికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చా. గతంలో నాలుగు పర్యాయాలు విజయం సాధించిన అమానుల్లాఖాన్‌ను అక్బరుద్దీన్ ఓడించినట్లుగానే.. నాలుగుసార్లు గెలుస్తూ వచ్చిన అక్బరుద్దీన్‌ను నేనూ ఓడిస్తా. ప్రజలంతా మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. – ఇసా బిన్ ఒబేద్ మిస్రీ -
భార్యకు నిప్పంటించిన భర్త
హైదరాబాద్: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను సజీవ దహనం చేశాడు. నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలోని గౌస్‌నగర్‌లో శనివారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. షబ్బీర్ అనే వ్యక్తి తన భార్య రెహనా బేగంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
మూడు లారీల పశుమాంసం పట్టివేత
- 115 మంది అదుపులోకి - ఓల్డ్ సిటీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ - పలు చీకటి దందాలు వెలుగులోకి హైదరాబాద్: అనుమతి లేకుండా పెద్ద ఎత్తున పశుమాంసం ఎగుమతి చేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జరిపిన కార్డన్ అండ్ అండ్ సెర్చ్ లో పలు చీకటి దందాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ జోన్ డీసీసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వందలాది పోలీసు సిబ్బంది.. ఇస్మాయిల్ నగర్, హఫీజ్‌బాబా నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చైనా, జపాన్‌లకు పశుమాంసాన్ని అక్రమంగా ఎగుమతి చేసే కబేళా ఒకటి వెలుగు చూసింది. మూడు లారీల పశుమాంసం, ఎముకలను స్వాధీనం చేసుకుని ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. తమిళనాడులో చోరీకి గురైన వాహనాలను కొనుగోలు చేస్తున్న ఓ స్క్రాప్ దుకాణాన్ని సీజ్ చేశారు. ఎలాంటి దృవపత్రాలు లేని అనుమాస్పద వ్యక్తులతోపాటు మయన్మార్ దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 115 మందిని అదుపులోకి తీసుకున్నామని, సరైన పత్రాలులేని 90 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో కార్డన్ అండ్ సర్చ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు డీసీపీ సత్యానారాయణ వివరించారు. -
లారీ, బస్సు ఢీ: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
గోడకూలి 9 మందికి తీవ్రగాయాలు
-
గోడకూలి 9 మందికి తీవ్రగాయాలు
హైదరాబాద్ : నగరంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడకూలి 9 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో చోటు చేసుకుంది. హఫీజ్‌బాబానగర్ బీబ్లాక్‌లో ఉండే మోహినుద్దీన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంటికి శుక్రవారం దుబాయి నుంచి బంధువులు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పక్కనే నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల ఇంటి గోడ నానింది. మోహినుద్దీన్ ఇంటిపై ఆ గోడ కూలి పడటంతో ఇంట్లో ఉన్న మొత్తం 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చుట్టుపక్కల వారు శిథిలాల నుంచి వారిని బయటకు తీసి, అపోలో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలోని భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహ్మద్‌నగర్ నాలా ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. (చాంద్రాయణగుట్ట) -
వరుసగా 5 ఇళ్లలో చోరీలు
చాంద్రాయణగుట్ట: చాంద్రాయణ గుట్ట పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ మెగా డ్రీమ్ సిటీలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. 2.32 కోట్లు విలువైన 80 తులాల బంగారం, రూ.16.26 లక్షల నగదు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... స్థానికంగా నివాసం ఉండే మహ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి తన కుమారుడి వివాహం కోసం 40 తులాల బంగారం, 16 లక్షల నగదు ను ఇంట్లో ఉంచారు. మహ్మద్ అబ్దుల్ మంగళవారం రాత్రి బంధువుల ఇంటికి వివాహానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లోఉన్న నగదు, విలువైన అభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. అదే కాలనీలో నివసించే మహ్మద్ జమాలుద్దీన్ ఇంట్లో 8 తులాల బంగారం, రూ. 6వేల నగదు, ఖరామత్ ఆలీ ఇంట్లో రూ.10 వేల నగదు, గౌస్ ఇంట్లో 15 తులాల బంగారం, రూ.10 వేల నగదు, మరో ఇంట్లో 17 తులాల బంగారం చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
డబ్బు కోసమే...
చిన్నారులను కిడ్నాప్ చేసి చంపేస్తున్న దుండగులు వరుస ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన చాంద్రాయణగుట్ట: తల్లిదండ్రులపై ఉన్న కోపం...ఆర్థిక వివాదాలు...అక్రమంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కొందరు పాతబస్తీలోని చిన్నారులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేస్తున్నారు. ఆరు నెలల క్రితం జంగమ్మెట్కు చెందిన బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే తాజాగా.. చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌కు చెందిన బాలుడిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేయడంతో పాతబస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటే బస్తీల్లో ఉంటున్న మానవ మృగాలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాఠశాలకు వెళ్లిన తమ చిన్నారులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో.. లేదోనని భయపడిపోతున్నారు. పాతబస్తీలోని ఫలక్‌నుమా డివిజన్ పరిధిలోనే చిన్నారుల కిడ్నాప్, హత్య ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. ఈ డివిజన్లో జరిగిన ముగ్గురు చిన్నారుల హత్యలకు ప్రధాన కారణం డబ్బే. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లే తమ పిల్లల రాకపోకలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుమానితులెవరైనా పిల్లలతో మాట్లాడుతున్నట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన సమయంలో పూర్తి వివరాలు తమకు తెలియజేస్తే చిన్నారులను కాపాడేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. స్కూళ్ల వద్ద కానరాని సీసీ కెమెరాలు... పాతనగరంలో ఇప్పటి వరకు జరిగిన చిన్నారుల కిడ్నాప్‌లో అధికంగా పాఠశాలల వద్దే జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల యజమాన్యాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగైదు పర్యాయాలు చిన్నారుల కిడ్నాప్‌కు విఫలయత్నాలు జరిగాయి. అయినా పాఠశాలల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయలేదు. పోలీసులు పట్టించుకోకపోవడమే దీనికి కారణం. గతంలో జరిగిన కొన్ని ఘటనలు చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో గతనెల 22న ప్రభాకర్, ఉమారాణిల కుమారుడు కరుణాకర్(10)ను అదే ప్రాంతానికి చెందిన మల్లికార్జున్, మోహన్‌లు కిడ్నాప్ చేసి అదేరోజు దారుణంగా హత్య చేశారు. డబ్బు కోసం వీరు పది రోజుల పాటు చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధించారు. ఛత్రినాక ఠాణా పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 5న జంగమ్మెట్ ఎంసీహెచ్ క్వార్టర్స్ ప్రాంతంలోని ఇంటి ముందు ఆడుకుంటున్న రాజు, సుజాత దంపతుల కుమారుడు మాస్టర్ డి.కార్తీక్ (10)ను బంధువు శివకుమర్ (22) కిడ్నాప్ చేసి రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. తల్లిదండ్రుల నుంచి సమాధానం వచ్చేంత లోపే బాలుడిని షాద్‌నగర్‌లో చంపేశాడు. గతేడాది నవంబర్‌లో పాతబస్తీ రికాబ్గంజ్కు చెందిన బంగారు వ్యాపారి గోపాల్ మాజీ కుమారుడు ఆకాష్ ( రెండున్నరేళ్లు)ను దుకాణంలో పనిచేసే దూరపు బంధువు రాంప్రసాద్ (26) కిడ్నాప్ చేశాడు. మూడు కిలోల బంగారం కావాలంటూ పది రోజుల పాటు డిమాండ్ చేశాడు. కాని ఈ ఘటనలో మాత్రం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని రక్షించి నిందితుడిని అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో 2010 డిసెంబర్లో చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదన్న కక్షతో సదరు ఏజెంట్ కుమారుడిని దుండగులు కిడ్నాప్ చేసి బీచ్పల్లిలో కృష్ణానది వద్ద చంపేశారు. -
బాలికపై ముగ్గురి అత్యాచారం
వేర్వేరు చోట్ల రెండు రోజుల్లో అఘాయిత్యం చాంద్రాయణగుట్టలో దారుణం పోలీసుల అదుపులో నిందితులు హైదరాబాద్: స్నేహితురాలితో ఫంక్షన్‌కు వచ్చిన ఓ అమ్మాయి రెండు రోజుల్లో మూడుసార్లు వేర్వురుచోట్ల వేర్వేరు వ్యక్తుల చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ దారుణానికి కారకులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు కథనం ప్రకారం.. కందికల్‌గేట్ జీఎం చావునీకి చెందిన బాలిక (14) గత నెల 31న సాయంత్రం 7 గంటలకు స్నేహితురాలితో కలసి దుర్దానా హోటల్ ప్రాంతానికి బయలుదేరింది. అదే ప్రాం తంలో డైరీఫామ్‌లో పని చేసే ఆమెకు పరిచయమున్న ఓ అబ్బాయి(17) బాలికను బలవంతంగా డైరీఫామ్‌కు తీసుకెళ్లాడు. ఆమె వెంట ఉన్న మరో అమ్మాయిని డైరీఫామ్‌కు దూరంగా రోడ్డుపై ఉండమని హెచ్చరించాడు. తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడి బయట ఎవరికీ చెప్పవద్దని బెదిరించి పంపాడు. అక్కడి నుంచి బయటపడ్డ ఆ అమ్మాయి తన స్నేహితురాలున్న చోటుకు చేరుకుంది. ఇద్దరూ చాంద్రాయణగుట్ట చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ సయీద్ అనే మరో యువకుడు వీరిని ఆటోలో బార్కాస్ ఫీలిదర్గా ప్రాంతంలోని ఒక శ్మశానానికి తీసుకె ళ్లాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సయీద్ బెదిరింపులకు గురైన ఆ అమ్మా యి తిరిగి తన స్నేహితురాలితో కలసి దుర్దానా హోటల్ వద్దకు వెళ్తుండగా స్నేహితురాలి సోదరుడు వచ్చి ఇద్దరినీ మందలించి తన చెల్లెలును తీసుకెళ్లాడు. భయాందోళనలో ఉన్న బాధిత బాలిక ఇంటికి వెళ్లలేదు. కూతురు కనిపించ డంలేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు ఉదయం బాధిత బాలికను హబీబ్(40) అనే ఆటోడ్రైవర్ ఆటోలో ఎక్కించుకుని తెలిసిన మహిళ ఇంట్లో ఉంచాడు. ఆ రోజు రాత్రి బాలికను ఆటోలో ఉస్మానియా ఆస్పత్రి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు (2వ తేదీ) తెల్లవారుజామున హబీబ్ సదరు బాలికను ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో బాలిక సాయంత్రానికి ఇల్లు చేరింది. రెండు రోజులపాటు ఎక్కడికి వెళ్లావంటూ కుటుంబ సభ్యులు నిలదీయగా బాలిక జరిగిన విషయా న్ని తెలిపింది. బాలిక తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు మంగళవారంరాత్రి చేరుకొని ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.