కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను సజీవ దహనం చేశాడు.
హైదరాబాద్: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను సజీవ దహనం చేశాడు. నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలోని గౌస్‌నగర్‌లో శనివారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. షబ్బీర్ అనే వ్యక్తి తన భార్య రెహనా బేగంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.