Rehana
-
Sheikh Hasina: ఆ అక్కకు.. చెల్లెలే ధైర్యం!
ఆగస్ట్ 15, 1975 సైనిక తిరుగుబాటులో బంగ్లాదేశ్ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, అతడి భార్య, కుమారులు ఊచకోతకు గురయ్యారు. ఆ కల్లోల సమయంలో రెహమాన్ కుమార్తె రెహానా తన అక్క షేక్ హసీనాతో పాటు యూరప్‌లో ఉంది. అంత పెద్ద విషాదాన్ని, దుఃఖాన్ని తట్టుకోవడానికి ఎవరికి ఎవరు ధైర్యం చెప్పుకున్నారో తెలియదు.ఇక అప్పటి నుంచి వారిది వీడని బంధం అయింది. హసీనా ‘లైఫ్‌లాంగ్ షాడో’గా రెహానాకు పేరు పడిపోయింది. కుటుంబసభ్యుల ఊచకోత జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత బంగ్లాదేశీ విద్యావేత్త అహ్మద్ సిద్దిఖీని వివాహం చేసుకుంది రెహానా. ఆర్థిక కారణాల వల్ల లండన్‌లో జరిగిన ఈ పెళ్లికి షేక్ హసీనా వెళ్లలేకపోయింది అంటారు. తమ కుటుంబ సభ్యుల కిరాతక హత్యపై నిష్పాక్షిక విచారణకు పిలుపునిస్తూ మొదటిసారిగా అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది రెహానా. ఈ సమావేశంలో ప్రవాసంలో ఉన్న ఆమె రాజకీయ సహచరుల నుంచి అంతర్జాతీయ న్యాయనిపుణుల వరకు ఎంతోమంది పాల్గొన్నారు.క్రూరమైన సైనిక నియంతృత్వ నీడలో బంగ్లాదేశ్ ప్రజల దుస్థితిని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించింది రెహానా. కుటుంబ ఊచకోతకు సంబంధించిన అప్పటి విషాదం ఊహకు అందనిది. ఇప్పటి సంక్షోభం గురించి మాత్రం ఇద్దరికీ తెలుసు. నిరసనకారులు ఇంటిని చుట్టుముడుతున్నారు. మరోవైపు హసీనా సన్నిహితులు, సలహాదారులు పారిపోయే దారిలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా అక్క చెయ్యి వీడలేదు రెహానా. ‘పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం’ అని అత్యంత సన్నిహితులు చెబుతున్నప్పటికీ ‘అది జరిగేది కాదు’ అంటూ వెనక్కి తగ్గలేదు హసీనా. ఆ సమయంలో వారు రెహానాను ఆశ్రయించారు. హసీనా దేశం వీడడానికి ఒప్పుకోవడానికి ఆమె కుమారుడు కారణమని, కాదు రెహానే కారణమని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏది నిజం అయినప్పటికీ రెహనా అక్కతో పాటు ఇండియాలోకి అడుగు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.రెహానా కుమార్తె తులిప్ సిద్దిఖీ లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు. యూకేలో లేబర్ పార్టీ అధికారంలో ఉండడంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని హసీనా ఆశ్రయం కోరింది. అయితే బ్రిటన్ నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో ఇండియాను ఆశ్రయించక తప్పలేదు. అక్క అధికారిక పర్యటనలలో రెహానా ఉండేది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభ (2006 –2008) సమయంలో హసీనా జైలులో ఉన్నప్పుడు అక్క తరపున పార్టీ సమావేశాలు నిర్వహించింది. కార్యకర్తల్లో ధైర్యం నింపింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌లో ఎంత చరిత్ర ఉందో ఆమె చెల్లెలు రెహానాకూ అంతే చరిత్ర ఉంది. ఆ చరిత్ర హసీనా వెలుగు ముందు మసక మసకగా కనిపించేది. అయితే ప్రతి కల్లోల సమయంలోనూ ఆమె పేరు మీద వెలుగు ప్రసరిస్తుంటుంది.‘రెహానా అక్కను తప్పుదారి పట్టించింది’ అని విమర్శించిన వారూ ఉన్నారు. ‘అక్క సరిౖయెన దారిలో పయనించడానికి, బలమైన నాయకురాలిగా ఎదగడానికి రెహానానే కారణం’ అన్నవారూ ఉన్నారు. ఈ వాదోపవాదాలు, నిజానిజాలతో సంబంధం లేకుండా ఒక్కమాట మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు... అక్కకు చెల్లి కొండంత అండగా నిలిచింది. నిలుస్తోంది. "షేక్ హసీనా పేరు వినిపించగానే ప్రతిధ్వనించే మరో పేరు... రెహానా. అలనాటి కల్లోల కాలం నుంచి అధికార పర్యటనల వరకు అక్క హసీనాతోనే ఉన్నది రెహానా. అక్క జైలుపాలైనప్పుడు పార్టీ క్యాడర్లో ధైర్యాన్ని నింపింది. ఒకప్పుడు కుటుంబాన్ని కోల్పోయి... ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి అక్కాచెల్లెళ్లు మన దేశంలో తలదాచుకోవడానికి శరాణార్థులుగా వచ్చారు..." -
జర్నలిస్ట్ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
జర్నలిస్ట్ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: జర్నలిస్ట్ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్‌డ్రైవ్ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆమె వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్ డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రెహాన ప్రయత్నాన్ని సీఎం జగన్ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు) -
పోరాట స్ఫూర్తి
‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ మొదలైంది. చిత్రాభిమానుల విశిష్ట పండగ లో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. మొదటి విశేషం... చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే సగం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మహిళా దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైన బంగ్లాదేశ్ చిత్రం ‘రెహన మరియమ్ నూర్’ మహిళల సమస్యను ప్రతిబింబిస్తుంది. 37 సంవత్సరాల రెహన మెడికల్ కాలేజి ప్రొఫెసర్. ఒక బిడ్డకు తల్లిగా, అమ్మకు కూతురిగా, సోదరుడికి అక్కగా ఆమె వ్యక్తిగత జీవితానికి, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌గా వృత్తి జీవితానికి మధ్య సమన్వయం, వాటి మధ్య తలెత్తే వైరుధ్యాలు, వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది.రెండో విశేషం... ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుర్దిష్ ఫిల్మ్‌మేకర్ లిసా కలన్ను ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ పురస్కారంతో సత్కరిస్తారు. కొన్ని నిజజీవిత కథలు, కల్పన కంటే ఆశ్చర్యపరుస్తాయి. ‘లిసా కలన్’ది అచ్చంగా అలాంటి కథ... ఐసిస్ ఉగ్రవాదుల బాంబుదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకుంది లిసా. అయితే ఆమె పోగొట్టుకుంది కాళ్లు మాత్రమే. ఆమెలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, దూసుకుపోయే తత్వం ఎక్కడికీ పోలేదు. ‘హిడెన్’ అనే సినిమాకు ఆర్ట్‌డైరెక్టర్‌గా వ్యవహరించడంతో పాటు నటించింది. ‘వాయిస్ ఆఫ్ ది స్ట్రీట్’ సినిమాకు సౌండ్ అండ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించింది. ఎన్నిరకాల సృజనాత్మక బాధ్యతలను చేపట్టినా ఆమె నమ్మిన సూత్రం ... బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించాలని. ఇందుకు చిత్రాలను బలమైన ఆయుధంగా ఎంచుకుంది. టర్కీలోని కుర్ద్‌ల కుటుంబంలో పుట్టిన లిసా, బాల్యంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. రాజ్యహింసను దగ్గర నుంచి చూసింది. హైస్కూల్ చదువుతోనే ఆమె చదువు ఆగిపోయింది. దీనికి కారణం...పై చదువులు తన మాతృభాషలో కాకుండా ‘టర్కిష్’లో మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండడం. చదువుకు దూరమైనప్పటికీ ‘అరమ్ టైగ్రన్ సిటీ కన్జర్వేటరీ’లో సినిమా పాఠాలు చదువుకుంది. విస్తృతమైన ప్రపంచాన్ని చూసింది. సినిమా కోర్స్ తన మాతృభాష లోనే ఉండడం ఆమెకు బాగా నచ్చిన విషయం. ఈ చిత్రకళల ఆలయంలో తాను గడిపిన రెండు సంవత్సరాల కాలం విలువైనది. విలువల గురించి తెలుకునేలా చేసింది. ఆ తరువాత... ఊరు, వాడ, పల్లె, పట్లణం అనే తేడా లేకుండా కుర్దుల జీవితాన్ని చూడడానికి తిరిగింది. ముఖ్యంగా కుర్దీష్ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు లిసాను కదిలించాయి. వారి ఆత్మగౌరవ పోరాటం ఆకట్టుకుంది. తాను చూసిన దృశ్యాలను పొలిటికల్ డాక్యుమెంటరీల రూపంలో ప్రపంచానికి చూపింది. మృత్యువు ఎదురొచ్చిన రోజు... జూన్, 2015లో దియర్బకిర్ నగరంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పాల్గొంది లిసా. పార్టీని లక్ష్యంగా చేసుకొని ‘ఐసిస్’ ఉగ్రవాదులు చేసిన బాంబుదాడిలో మృత్యువు అంచుల వరకు వెళ్లింది లిసా. రెండు కాళ్లు పోగొట్టుకుంది. ‘లిసా బతకడం అరుదైనఅదృష్టం’ అన్నారు. మంచమే ఆమె ప్రపంచం అయింది. తాను అమితంగా ప్రేమించిన చిత్రప్రపంచం దూరమైపోయింది. ‘ఇంటిపట్టునే ఉండు తల్లీ ఎందుకొచ్చిన కష్టాలు!’ అన్నవాళ్లతోపాటు– ‘రెండు కాళ్లే పోయినప్పుడు, ఇంట్లో పడుండక ఏమి చేస్తుంది’ అని వెక్కిరించిన వాళ్ళూ ఉన్నారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఆరు సంవత్సరాలు నరకప్రాయంగా గడిచాయి. వేరే వాళ్లలో అయితే జీవన ఆసక్తి అంటూ లేకుండా పోయేదేమోగానీ లిసా మాత్రం మళ్లీ అడుగులు వేసింది. ఈసారి కృత్రిమకాళ్లతో! గతంలోలాగే ఉద్యమాలలో భాగం అయింది. చిత్రాలను తీయడం మొదలు పెట్టింది. ‘ఎందరి జీవితాలనో తెరకెక్కించింది లిసా. నిజానికి ఆమె జీవితమే ఒక అద్భుతమై చిత్రం’ అనే మాట తిరువనంతపురం చిత్రోత్సవంలో నలుమూలలా వినిపిస్తూనే ఉంది. -
విధ్వంసకర పరిణామాల దిశగా...
‘రష్యా లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు.’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘ద వరల్డ్ ఆర్డర్ 2018’ పేరుతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఇది. ఉక్రెయిన్ గడ్డను రణరంగంగా మార్చేసిన సమ యంలో... అనేక దేశాలు రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి, యూరోపి యన్ యూనియన్, నాటో దేశాల ఆంక్షల నడుమ... ప్రస్తుతం రష్యా అనుసరిస్తున్న వైఖరికీ, నాటి పుతిన్ వ్యాఖ్యలకూ మధ్య ఒక లింక్ కనిపిస్తోంది. రష్యా అడుగులు ఎటువైపు పడే అవకాశం ఉందనే ప్రశ్నకు ఓ సంకేత సమాధానం వినిపించి ఆందోళనకు గురి చేస్తోంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ అతలాకుతలం అవు తోంది. లక్షలాది మంది ఉక్రేనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులు దాటు తున్నారు. ఆ సాహసమూ చేసే అవకాశం లేని వాళ్ళు బంకర్లలోనో, అండర్ గ్రౌండ్ స్టేషన్ల లోనో, నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ప్రపంచ ప్రజానీకం అంతా యుద్ధోన్మాదాన్ని ఆపాలని రష్యాను కోరుతున్నారు. అయినా పుతిన్ పట్టించు కోవడం లేదు. రష్యా లేని ప్రపంచమే అవసరం లేదన్న పుతిన్ వ్యాఖ్యలు మళ్లీ మళ్ళీ వినిపి స్తున్నాయి. ప్రపంచ దేశాల ఆంక్షలు పెరుగుతున్న నేపథ్యంలో అణ్వాయుధ దాడికి సిద్ధం అవుతున్న సంకేతాలు పుతిన్ ఇచ్చేశారు. మొదటి రోజే ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ను రష్యా సేన స్వాధీనం చేసుకుందని వార్తలొచ్చాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా అణు యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని తమ అణ్వాయుధ దళా లను పుతిన్ ఆదేశించటం ముంచుకు రానున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పట్టణాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని ఆ నగర వాసులకు రష్యా తాజాగా జారీ చేసిన హెచ్చరిక తీవ్ర ఆందోళనకరమైంది. అంటే 48 గంటల తర్వాత కీవ్ నగరంపై రష్యా విరుచుకుపడే ప్రమాదం ఉందన్న మాట. అణు ఆయుధాల ప్రయోగం దిశగా రష్యా వేసిన మరో ఎత్తుగడను ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా రష్యాతో స్నేహం చేస్తున్న బెలారుస్ దేశం తాజాగా ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఉన్న అణ్వాయుధ రహిత హోదాను విడిచిపెడుతూ ఇది నిర్ణయం తీసుకుంది. అంటే రష్యా తన అణ్వాయు ధాలను బెలారుస్ గడ్డపై మోహరించి అటు నుంచి దాడి చేయటానికి లేదా దాడిని ప్రతిఘటించ టానికి మార్గం సిద్ధం చేసుకుంటున్నట్లు అర్థమవు తోంది. రష్యా బ్యారెంట్స్ సముద్రంలో అణు జలాంతర్గాములతోనూ, సైబీరియా ప్రాంతంలో మొబైల్ మిస్సైల్ లాంచర్లతోనూ విన్యాసాలు చేయడం ద్వారా మరో అడుగు ముందుకేసింది. రష్యా, ఉక్రెయిన్ల విషయాన్ని ప్రస్తావించే క్రమంలో ‘బయటి నుంచి జోక్యం చేసుకోవాలని ఎవరైనా భావిస్తే... జోక్యం చేసుకున్నట్లయితే, మీలో ప్రతి ఒక్కరూ చరిత్రలో ఎదుర్కొన్న వాటి కన్నా అతి తీవ్రమైన పర్యవసానాలను ఎదు ర్కొంటారు’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సంకేతాలన్నీ ఒకచోట పోగేస్తే అణ్వాయుధ ప్రమాదం ఉక్రెయిన్ ముంగిట ఉందని స్పష్టం అవుతోంది. అదే జరిగితే ఆ విధ్వంసకర ఘటన పరిణామాలను ప్రపంచం కూడా చవిచూడక తప్పదు. ఈ వినాశకర పరిణామాలకు అడ్డుకట్ట పడాలనీ, చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలనీ కోరుకుందాం. వ్యాసకర్త: రెహానా జర్నలిస్ట్ -
కానిస్టేబుల్ థెరిసా.. రెహానా!
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో మహారాష్ట్ర, దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకుల్లా వణికిపోవడంతో.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, ఆపదలో సాయం అడిగిన ప్రతి ఒక్కరికి సాయమందించి ‘అభినవ మదర్ థెరిసా’ గా గుర్తింపు తెచ్చుకున్నారు ముంబైకి చెందిన పోలీసు కానిస్టేబుల్ రెహానా షేక్. విపత్కర పరిస్థితులో తనని సాయం అడిగిన వారందరికి రెహానా ఆక్సిజన్, ప్లాస్మా, బ్లడ్, బెడ్స్ ఏది కావాంటే అది ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించారు. దీంతో రెహానా భర్త, తన తోటి ఉద్యోగులు, తెలిసిన వారు మదర్ థెరిసాగానేగాక ఆమెను మంచి సామాజిక కార్యకర్తగా పిలుస్తున్నారు. కరోనా సమయంలో మానవత్వం తో వ్యవహరించిన రెహానాను పోలీసు కమిషనర్ ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్తో సత్కరించారు. అంతేగాక అందరు పిలుస్తున్నట్లుగానే మదర్ థెరిసా అవార్డు వరించడం విశేషం. మదర్ థెరిసాగా.. 2000 సంవత్సరంలో ముంబై పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టిన రెహానా మంచి వాలీబాల్ ప్లేయర్, అథ్లెట్ కూడా. 2017లో శ్రీలంకలో జరిగిన పోటీల్లో ఆమె రజత, స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ఆటలు, డ్యూటీలో చురుకుగా ఉండే రెహానా సామాజిక సేవలోనూ ముందుంటారు. ఈ క్రమంలోనే గతేడాది మే 13న తన కూతురు పదహారో పుట్టినరోజు సందర్భంగా రాజ్‌గఢ్ లోని వాజే తాలుకాలో ఉన్న డయానై సెకండరీ స్కూల్ సందర్శించి అక్కడ చదువుతోన్న విద్యార్థులకు స్వీట్లు పంచారు. ఆ సమయంలో స్కూలు ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడిన ఆమె.. స్కూల్లో చదువుతోన్న ఎక్కువమంది విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారిలో కొందరికి కనీసం కాళ్లకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవని తెలుసుకున్నారు. దీంతో తన కూతురి పుట్టిన రోజుకోసం ఖర్చు చేద్దామని కేటాయించిన డబ్బులు, ఈద్ కోసం ఖర్చుచేసే మొత్తం డబ్బులను స్కూలు పిల్లలకోసం ఇచ్చేశారు. అంతేగాక యాభై మంది పిల్లలను పదోతరగతి వరకు చదివిస్తానని మాట ఇచ్చారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో బెడ్ల ఏర్పాటు, ప్లాస్మా, రక్త దానం, ఆక్సిజన్ సరఫరా చేసి 54 మందిని ఆదుకున్నారు. దీంతో ఆమె మంచి సామాజిక వేత్తగా గుర్తింపు పొందారు. తోటి ఉద్యోగులకుసైతం.. తన తోటి కానిస్టేబుల్ తల్లికి ఇంజెక్షన్ దొరకక ఇబ్బంది పడుతున్నారని తెలిసి.. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సంబంధిత ఇంజెక్షన్ ఎక్కడ దొరుకుతుందో తెలిసేంత వరకు కాల్స్ చేసి ఇంజెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన పోలీసు యంత్రాంగంలోని కొంతమంది బ్లడ్, ప్లాస్మా, ఆసుపత్రిలో తమ బంధువులకు బెడ్లు కావాలని అడగడంతో ఆమె బ్లడ్ డోనార్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరి రక్తదాతలకు మెస్సేజులు చేసి కావాల్సిన బ్లడ్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాక క్యాన్సర్ రోగులకు అవసరమైన సాయం చేస్తున్నారు. ఉద్యోగంతోపాటు తోటి వారి సమస్యలు తీర్చే రెహానా లాంటి వారు అరుదుగా కనిపిస్తారు. -
అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌లతో వివాదంలో చిక్కుకున్న కేరళ ఆక్టివిస్టు రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయించాల్సిందిగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అసలు మీరెందుకు ఇదంతా చేశారు? మీరు ఆక్టివిస్టే కావొచ్చు. అయినంత మాత్రాన ఇలా ఎందుకు ప్రవర్తించారు? సమాజంపై ఇది చాలా దుష్ప్రభావం చూపుతుంది. మీరు అసభ్యతను వ్యాపింపజేస్తున్నారు. అసలు ఇలాంటి చర్యలు ఎదుగుతున్న పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసా’’అని అసహనం వ్యక్తం చేసింది.(అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం) ఇక రెహానా ఫాతిమా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. తన క్లైంట్‌పై చైల్డ్ పోర్నోగ్రఫీ కింద ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. పురుషులు అర్ధనగ్నంగా కనిపిస్తే లేని అభ్యంతరం మహిళల విషయంలో ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తన క్లైంట్ మహిళ అయినందు వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాగా అర్ధనగ్న శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకుంటూ రెహానా ఫాతిమా ఇటీవల ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మైనర్లతో అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు.(సుప్రీంకోర్టులో ఆ బిషప్కు షాక్..) ఈ నేపథ్యంలో కేరళలోని పలు ఆలయాల్లో కొన్ని దేవతా మూర్తులు కూడా అర్ధనగ్నంగా కనిపిస్తాయని.. అయినప్పటికీ ఆలయానికి వెళ్లిన వారిలో లైంగిక ప్రేరేపణ బదులు ఆ విగ్రహాల్లో దైవత్వమే కనిపిస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. తల్లి శరీరంపై బిడ్డల పెయింటింగ్ కూడా ఇలాంటిదేనని అభిప్రాయపడ్డారు. అదే విధంగా తనపై ఐటీ చట్టం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నించారు. ఆ నేపథ్యంలో ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ముందస్తు బెయిలుకు నిరాకరించడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. -
అర్థనగ్నంగా పెయింటింగ్స్.. అరెస్ట్ ఆలస్యం
తిరువనంతపురం : అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను అరెస్టు చేయడంలో ఆలస్యం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముందస్తు బెయిల్ కోసం ఫాతిమా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ రెహనాను అరెస్టు చేయడంలో అధికారి విఫలమయ్యారని తిరువల్లాకు చెందిన న్యాయవాది ఏవీ అరుణ్ బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా రెహనా ఫాతిమా మంచం మీద అర్థనగ్నంగా చిన్నపిల్లలతో తన శరీరంపై పెయింటింగ్ వేయించుకోవడమే కాకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. చిన్నపిల్లలతో అర్థనగ్నంగా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. (అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం) పిటిషనర్ మాట్లాడుతూ.. జూన్ 25న రెహానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడంలో విఫలమయ్యారన్నారు. నిందితురాలిని అరెస్టు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న దర్యాప్తు అధికారిని మార్చాలని దర్యాప్తును అసిస్టెంట్ కమిషనర్‌కు అప్పగించాలని కోర్టును షిటిషనర్ కోరారు. తన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన 10 నిమిషాల్లోనే న్యాయవ్యవస్థను విమర్శిస్తూ ఫాతిమా ఓ వీడియోను అప్లోడ్ చేసిందని పిటిషనర్ ఆరోపించారు. ఆమె తన వీడియోలో మొత్తం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నట్లు కనిపింస్తోందని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉంది. (ఇల్లు ఖాళీ చెయ్) -
ఇల్లు ఖాళీ చెయ్
మంచి ఉద్యోగం. మాట వినే జీవిత సహచరుడు. రత్నాల్లాంటి పిల్లలు. లోకంతో ఇక పని ఏముందీ? కానీ రెహానా.. లోకంతోనే పని పెట్టుకుంది. దారులు వేసే పని! లోకం ఊరుకుంటుందా? ‘ఇల్లు ఖాళీ చెయ్’ అంది. సూర్య గాయత్రి అనే పేరంటే ఇష్టం రెహానా ఫాతిమాకు! అది ఆమె కలం పేరు కాదు. ఆమెకే ఇంకో పేరు. తనకై తను పెట్టుకున్నది. సంఘ సంస్కర్త చలం గారి భాషలో.. ఈ సాయిబుల పిల్లకు హైందవం, మహమ్మదీయం అనేవి లేవు. ‘నువ్వు తక్కువ, నేను ఎక్కువ’ అంటుండే మగ సమాజం మీద అస్సలు మంచి ఉద్దేశం లేదు. మొదట అడుగుతుంది.. ‘ఏమిటిది!’ అని. ‘నీకేంటి చెప్పేది?’ అన్నట్లు చూస్తే, తనేమిటో చూపిస్తుంది. తను అంటే తను కాదు. స్త్రీశక్తిగా తను. ‘తత్వమసి’ అనే భావనను నమ్ముతుంది రెహానా. ఎందుకు, ఎవరికి నమస్కారం పెడుతున్నావో తెలుసుకుని నమస్కారం పెట్టమని అర్థం తత్వమసి అంటే. వేదాల్లోని మహావాక్యమిది. స్త్రీని తక్కువ చేసే ఏ విశ్వాసానికీ, సంప్రదాయానికీ రెహానా మర్యాద ఇవ్వదు. సంఘ సంస్కర్తనని చలం ఏనాడూ చెప్పుకోలేదు. తను చెప్పదలచింది రాసుకుంటూ పోయారు. రెహానా ఫాతిమాను కూడా ‘మహిళా హక్కుల ఉద్యమకారిణి’ అని మనం అంటున్నాం కానీ.. రైట్స్ యాక్టివిస్ట్నని ఆమె ఎక్కడా చెప్పుకోలేదు. ఆమెను అనుమానించడానికి, అవమానించడానికి, అరెస్టు చేయించడానికి ఒక పేరు కావాలి. అందుకే ‘అల్ట్రా–లెఫ్ట్ ఉమన్ యాక్టివిస్ట్’ అన్నారు! యాక్టివిస్ట్ అంటే సరిపోతుంది. ఉమన్ యాక్టివిస్ట్ అన్నారంటే.. ఉమన్ అసలు యాక్టివిస్ట్‌గా ఉండటం ఏంటి అని! ఆలయాల్లోకి ప్రవేశం లేనట్లే.. స్త్రీకి ప్రశ్నించే, నిరసించే, ధిక్కరించే, అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉండకూడదని!! ప్రస్తుతం రెహానా కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆమె ఎక్కడికీ పారిపోలేదు. కొచ్చిలోనే తన అపార్ట్మెంట్లోనే.. భర్త, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. పెద్ద కేసే పెట్టారు పోలీసులు ఆమె మీద. సెక్షన్ 67 (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటింగ్ సెక్సువల్లీ ఎక్స్ప్లిసిట్), సెక్షన్ 75 (పనిష్మెంట్ ఫర్ క్రూయల్టీ టు చైల్డ్) ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. íపిల్లల్ని హింసించి, పెద్దల్ని చెడగొడుతోందని అరుణ్ ప్రకాశ్ అనే లాయర్ ఫిర్యాదు ఇస్తే పోలీసులు కేసు ఫైల్ చేశారు. కొడుకు, కూతురు తన ఒంటిమీద పెయింటింగ్ వేస్తున్న వీడియోను జూన్ 19న యూట్యూబ్‌లో, తర్వాత తన ఫేస్బుక్లో పెట్టుకుంది రెహానా. ఆ వీడియోపైనే లాయర్ అభ్యంతరం. సమాజం కొన్ని దారులు వేసి ఉంచినప్పుడు ఆ దారుల్లోనే వెళ్లి వస్తుంటే పోలీసులు ఎవరినీ వెతకరు. ‘అల్ట్రా ఉమన్’ అనే పేర్లూ రావు. జీవితం సాఫీగా సాగిపోతుంది. రెహానా సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. బి.కాం. చదివింది. ఎం.సి.ఎ. చేసింది. లోకం దారుల్లో ఏదో తేడా కనిపించింది తనకు. దారులు శుభ్రంగా ఉన్నాయి కానీ, మనుషులు నీరసంగా, నిరోమయంగా నడుస్తున్నారు. ముఖ్యంగా మహిళలు.. ‘ఏదారెటు పోతుందో ఎవరికి ఎరుక..’ అని నిస్తేజంగా.. లేని దారుల కోసం కళ్లు తిప్పి చూడటం గమనించింది. ‘మీ ఆశల దారిని నేను నిర్మిస్తాను’ అని పలుగు, పార అందుకుంది. మొదటి దారి ‘కిస్ ఆఫ్ లవ్’. 2014లో. భారతీయ సంస్కృతిని పరిరక్షించే ‘మోరల్ పోలిసింగ్’కి వ్యతిరేకంగా కొచ్చి కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్ట్‌లో ధైర్యంగా నిలబడింది. యువతీయువకుల నిరసన ఉద్యమ చుంబనాలకు, కౌగిలింతలకు మద్దతు ఇచ్చింది. రెండో దారి 2016లో. త్రిచూర్‌లో ఓనమ్ పండుగకు సాంప్రదాయికంగా అందరూ మగవాళ్లే ఉండే బృందంలో కలిసిపోయి ‘టైగర్ డాన్స్’ చేసింది. మూడో దారి 2018లో. కోళికోడ్‌లోని ఫరూక్ ట్రెయినింగ్ కాలేజ్ నుంచి వేసింది. కాలేజ్‌లో మగ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారొకరు మహిళల బ్రెస్ట్‌పై కామెంట్ చేశారు. ‘స్త్రీలను తమరు ఇలాగే కదా చూసేది..’ అని అతడి కామెంట్లో ఉన్న విధంగా.. నేకెడ్ బ్రెస్ట్ మీద రెండు వాటర్ మిలాన్స్ను ఉంచుకుని, ఆ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ప్రొఫెసర్ గారి తల కుర్చీలోకి కుచించుకుపోయింది. నాలుగో దారి శబరిమలకు వేసిన దారి. అదే ఏడాది. రెహానా ఇప్పుడు వేసింది ఐదో దారి. అయితే ఆ దారిని తన పిల్లల చేత వేయించింది. కంటి ఇన్ఫెక్షన్తో ఆమె మంచంపై పడుకుని ఉంటే ఆమె ఒంటిపైన అప్పుడే టీనేజ్‌లోకి వస్తున్న కొడుకు, అతడికన్నా చిన్నదైన కూతురు.. ఫీనిక్స్ పక్షిని పెయింట్ చేశారు. ఆ వీడియో ఆమెపై కంప్లయింట్‌కు కారణం అయింది. అందుకు సమాధానంగా.. ‘స్త్రీ దేహం గోప్యనీయమైనదే భానన కలగకుండా సహజంగా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక స్త్రీ పట్ల విపరీతాలకు పాల్పడరు’ అని రెహానా అన్నమాట స్త్రీలకైతే ఆర్థం కాకుండా పోదు. రెహానాపై పోలీసులు కేసు పెట్టారని తెలియగానే ఆమె ఉంటున్న తమ క్వార్టర్స్‌ను నెల లోపు ఖాళీ చేసేయాలని బి.ఎస్.ఎన్. ఎల్. సంస్థ నోటీసులు పంపింది. రెహానా ఆ సంస్థ ఉద్యోగే. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్ట్‌లు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణంతో గత మే నెలలోనే బి.ఎస్.ఎన్.ల్. ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. ఈ తొలగింపులను, బెదిరింపులను లెక్క చెయ్యకుండా మళ్లీ ఇంకో దారిని వేసే ప్రయత్నంలో ఉండటం చూస్తే.. రెహానాను ఉద్యమకారిణి అనాలనే అనిపిస్తుంది.. అది ఆమెకు ఇష్టం లేకున్నా. -
అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం
తిరువనంతపురం: కేరళ మహిళా యాక్టివిస్టు రెహానా ఫాతిమా మరో వివాదంలో చిక్కుకున్నారు. అర్థనగ్నంగా కనిపిస్తూ తన సోషల్ మీడియాలో ఖాతాల్లో బుధవారం ఓ వీడియో పోస్టు చేశారు. అందులో తన శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకున్నారు. ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట పోస్టు చేసిన సదరు వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది.(కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి) ‘కంటి సమస్యతో బాధపడుతున్న తల్లి విశ్రాంతి తీసుకుంటుంటే.. ఆమె పిల్లలు ఫోనిక్స్ బర్డ్ చిత్రం వేసి కూల్ చేశారు’ అంటూ వీడియోకు ఫాతిమా కామెంట్ ను జోడించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. చిన్నపిల్లలతో అర్థనగ్నంగా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు తిరువల్ల స్టేషన్ పోలీసులు ఫాతిమాపై కేసు నమోదు చేశారు. ‘వీడియోను ఎలా? ఎందుకు పోస్టు చేశారన్న దానిపై విచారిస్తున్నాం’ అని స్టేషన్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. (వర్సిటీల్లో పరీక్షలు రద్దు!) 2018లో అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల తర్వాత ఫాతిమా శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో హిందూవులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులకు 18 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. -
మీ పేరేంటి.. చారుశీల
కశ్మీర భూమి చాలా రమణీయంగా ఉంది. ‘మేడమ్...కుచ్ లేంగే..కాఫీ...చాయ్...?’ రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘విస్మృత యాత్రికుడు’ నవలలో నుంచి తలెత్తి కుడి వైపుకు చూశాను. తెల్లటి యూనిఫారమ్‌లో చేతులు వెనక్కి కట్టుకుని వినయంగా నిలుచుకుని ఉన్నాడతను. ముఖంపై చిరునవ్వు రేఖ. ఈ అబ్బాయి కళ్లల్లో ఏదో మెరుపు ఉంది అనుకున్నాను ఆ క్షణంలోనే. ‘వుడ్ యు లైక్ టు టేక్ సమ్..’ అతని మాట పూర్తి కాకముందే ‘ష్యూర్...కాఫీ మిలేగా?(కాఫీ ఉందా)’ అడిగాను. ఇప్పుడే తెస్తాను అని చెప్పి వెనక్కి తిరిగాడు. నాకు ప్రయాణాలు చేయటం చాలా ఇష్టం. వృత్తికి ఆర్కిటెక్ట్నైనా... సగటున ప్రతి మూడు నెలలకోమారు ఏదో ఒక ప్రాంతానికి భుజాన బ్యాగ్ వేసుకుని వాలిపోతుంటాను. కాశ్మీర్ లోయ అందాలను చూడాలని, ఇక్కడి ప్రకృతిని, ప్రశాంతతను, అనుభూతులను రంగుల్లో ముంచి కాన్వాసుపై అద్దాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతూ వచ్చాను. ఇప్పటికి ఇలా కుదిరింది. ఈ హోటల్లో రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఈ హోటల్‌కు ఉన్న గార్డెన్, లాన్ చూసి మనసు పారేసుకున్నాను. అందులోనూ నా రూమ్‌ను ఆనుకునే లాన్ ఉంది.లాన్‌కు నాలుగు దిక్కుల్లో గుండ్రటి టేబుళ్లు, చుట్టూ కుర్చీలు వేశారు. నేను ఓ ఖాళీ టేబుల్ చూసుకుని సెటిల్ అయ్యాను. కాస్త దూరంగా మరో టేబుల్ చుట్టూ ఐదారుగురు చేరి ఉన్నారు అప్పటికే. రేపు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఈ గార్డెన్లో వాకింగ్ చేయాలి అనుకుంటున్నప్పుడే తెల్ల యూనిఫాం అబ్బాయి చిరునవ్వుతో పాటు కాఫీ తెచ్చాడు. ‘ఏం పేరు?’ ‘ఆసిఫ్..’ ‘మీది శ్రీనగరేనా?’ ‘కాదు మ్యామ్...త్రాల్.’ ‘త్రాల్! మ్...ఎక్కడో విన్నట్లుంది...’ ‘న్యూస్‌లో చూసుంటారు. మాది కొంచెం సెన్సిటివ్ ప్రాంతం.’ ‘ఓ...అంటే అల్లర్లు ఎక్కువగా జరుగుతుంటాయా?’ ‘అవును మ్యామ్. ఇంతకీ...మీరు కాఫీ రుచి చూడలేదు. పుస్తకం చదువుతున్నారు కదా...టీనో, కాఫీనో తాగుతూ చదువుతుంటే ఈ వాతావరణంలో ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది. అందుకే వచ్చి అడిగాను. వేరేలా అనుకోవద్దు. థ్యాంక్యూ మ్యామ్.’ వెల్కమ్ అనో, పర్వాలేదనో, నేనే అడుగుదామనుకున్నాను అనో...చెప్పేందుకు నోరు తెరిచేంతలో వెళ్లిపోయాడు. 4 సెకన్ల పాటు అతను వెళుతున్న వైపు చూసి చూపు మరల్చాను. అటూ ఇటూ చూడకుండా కాఫీ సిప్ చేస్తూ పుస్తకంలో కళ్ళు పెట్టి ఆ అబ్బాయితో జరిగిన సంభాషణను నెమరేయటం మొదలు పెట్టాను. ఏం పేరు చెప్పాడు...ఆసిఫ్ఫా...? ఊరేదో చెప్పాడే... తాస్... త్రాస్.... కాదు కాదు...త్రాల్. గూగుల్ చేయాలి. తన గురించిన ఎక్కువ వివరాలు ఇవ్వటం ఇష్టం లేక తెలివిగా టాపిక్ డైవర్ట్ చేశాడా? లేదంటే ఇలా గెస్ట్‌లతో అసుకేస్తూ పని ఎగ్గొడతారని వాళ్ల బాస్ కోప్పడతాడని వెళ్ళిపోయాడా? అయినా... ఆ అబ్బాయి గురించి నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? ∙∙ అలారం పెట్టుకుని ఐదు గంటలకే నిద్ర లేచాను. బ్రష్షూ గట్రా కానిచ్చి... ఐదున్నరకు లాన్లోకి వచ్చాను. చెప్పులు ఓ మూలన పెట్టి నగ్న పాదాలు గడ్డిపై పరిచాను. పచ్చటి గడ్డిపోచలు, వాటిపై సేదతీరుతున్న తుషారపు తునకలు... చల్లటి ఆ స్పర్శ జర్రున పాకి మనసుకు చేరింది. హిమ శిఖరాలపై నుంచి వస్తున్న గాలి తెమ్మెరల్ని నా లోపలికి తీసుకున్నాను. తనివి తీరితేనా..? కాసేపు నడవగానే మనసు ఏదో చిత్రానికి రూపం ఇచ్చేస్తోంది. రంగులు కళ్ళముందు కదులుతున్నాయి. కాన్వాస్ టేబుల్, రంగులు, అన్నీ తెచ్చుకుని... లోపల రేగుతున్న ఆలోచనలకు చిత్ర రూపం ఇవ్వటం మొదలు పెట్టాను. నా ప్రయాణాల మొదటి లక్ష్యం చిత్రాలు వేయటమే. ట్రావెల్ పెయింటింగ్ నా హాబీ. అలా తిరుగుతూ తిరుగుతూ నచ్చిన చోట, మనసు స్పందించిన దృశ్యాన్ని కుంచెలోకి ఇంకిస్తుంటాను. పోటీ పడుతూ అరవిచ్చుకుంటున్న పూలు, చెట్ల మోదులు, పచ్చగా పరుచుకున్న లేత గడ్డిపోచలు, వాటిపై నడిచి వెళుతున్న రెండు నగ్న పాదాలు... పెన్సిల్‌తో ఔట్ లైన్ వేసేశాను. యాభైకి కాస్త అటూ ఇటూగా ఒక వ్యక్తి ఒక పెద్దాయనను నెమ్మదిగా నడిపిస్తూ నా వైపు వస్తున్నారు. బహుశా అతని నాన్నేమో. ఏదో అనారోగ్యంతో ఉన్నారని అర్థం అవుతోంది. డాక్టర్లు ఇలా కాస్త లాన్స్‌లో నడిపించమని ఉంటారు అనుకున్నాను. అతని కాళ్ళకు చెప్పులు లేకపోవటం నా దృష్టిని దాటలేదు. ఆ పెద్దాయన తల కాస్త కిందకు వ్రేలాడినట్లుగా ఉంచి అడుగులో అడుగు వేస్తూ వస్తున్నారు. నా కాన్వాస్ స్టాండ్‌ను కాస్త పక్కకు జరిపాను వారు వెళ్లేందుకు ఎక్కువ స్థలం ఉండేటట్లు. ‘థ్యాంక్యూ...’ ‘యు ఆర్ వెల్కమ్...’ ‘పర్యాటకులు అనుకుంటా. ఆర్టిస్ట్ అని నేను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు.’ ఆ పెద్దాయనకు కాన్వాస్ ఆసక్తిని రేపినట్లుంది. తల అలానే ఓ కింద నుంచి ఒక వాలుగా పైకి ఎత్తి చూస్తున్నారు. ‘అవును. మీరిక్కడి వారేనా?’ ‘ఈ హోటల్ పక్కనే మా ఇల్లు. నాన్నకి అనారోగ్యం. ఉదయం, సాయంత్రం ఇక్కడ వాకింగ్‌కు తీసుకువస్తుంటాను. ‘అలానా...’ ‘మీ పేరేంటి...?‘మాటలు కూడబలుక్కుని పెద్దాయన అడిగారు. నాకు అర్థం కాలేదు. నా పేరు అడుగుతున్నారని కొడుకు చెప్పారు. ‘చారుశీల...’ నా పేరును తనలోనే చెప్పుకుంటూ తల ఊపారు. ‘నాన్నా... పదండి వెళదాం...’ ఆ పెద్దాయన మాత్రం కదల్లేదు. వాలు తలతోనే కాన్వాసు వైపే చూస్తున్నారు. ఇంకా రంగులు వేయటం అవ్వలేదు కనుక ఆయనకు చిత్రంలో ఆసక్తి కాదు చిత్రం వేసే ప్రక్రియపైనే ఆసక్తి అని నేను అర్థం చేసుకున్నాను. ‘ఇక్కడ ఏ ప్రాంతాలు బాగుంటాయి చూడటానికి? మీరేం సలహా ఇస్తారు?’ సంభాషణ కొనసాగించే ప్రయత్నం నాది. ‘కశ్మీరే ఓ దృశ్య కావ్యం. ఏ దిక్కు చూసినా... మీరిలా స్ఫూర్తిని పొందుతారు పెయింటింగ్స్ వేయటానికి. కాని పరిస్థితులు అనుకూలించకపోవటమే అసలు సమస్య. మీరు ఇప్పుడు రాకుండా ఉండాల్సింది.’ ‘ఏం అలా అన్నారు. వాస్తవంగా ఇక్కడకు రావాలని చాలాసార్లు అనుకున్నాను. కాని ప్రతిసారి ఏదో ఒక అన్రెస్ట్ ఉండనే ఉంటోంది. ఏదైతే ఏంలే అని ఈసారి వచ్చేశాను...’ ‘..............’ ‘మీరేం చేస్తుంటారు?’ ‘నేను ఇంగ్లీష్ మీడియాలో దాదాపు 30 ఏళ్ళు జర్నలిస్ట్‌గా పని చేశాను. నాన్నకు ఆరోగ్యం దెబ్బతినటంతో చూసుకోవటం కోసం మానేశాను. ఇప్పుడు ఇంట్లోనే.’ ‘నాన్నా... వెళదామా?’ ‘.....’ పెద్దాయన ఏదో అడిగారు.. నాకు అర్థం కాలేదు. ‘ఏమన్నారు?’ ‘ఎక్కడి నుంచి వచ్చారని నాన్న అడుగుతున్నారు.’ పెద్దాయనకు నా పట్ల ఆసక్తి రేగటం నాకు ఆనందాన్నిచ్చింది. ఆయన నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నాకులానే మనుషులతో మాట్లాడటం ఈయనకూ ఇష్టం అనుకుంటా. ‘హైదరాబాద్ నుంచి వచ్చాను’ చిరునవ్వు చెరక్కుండా చెప్పాను. వాళ్లబ్బాయి మళ్లీ ఆయనకు చెప్పారు హైదరాబాద్ సే ఆయే. ‘కశ్మీరీగా మీ అభిప్రాయం ఏమిటి? సగటు కశ్మీరీ అయితే ఆజాదీ కావాలంటున్నారు. మీరు జర్నలిస్ట్‌గా పని చేశారు కనుక. మీకు చాలా విషయాలపై అవగాహన ఉంటుంది.’ ‘ఇక్కడ ఎప్పుడూ అభ్రదత, అన్రెస్ట్ ఉంటాయి. భవిష్యత్తులో అయినా పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటాను.’ ‘నాన్నా... ఇంక నడవాలి. ఇబ్బంది పెట్టకూడదు....’ ఈమారు ఆ పెద్దాయన సహకరించారు. నేను వాళ్ళవైపు చూస్తున్నాను. అతను వెనక్కి తిరిగి ‘క్షమించాలి....మీకు అంతరాయం కలిగించాం. మాట్లాడినందుకు ధన్యవాదాలు...’ ‘అయ్యో అంతరాయం ఏమీ లేదు. మీతో మాట్లాడటం నాకు ఆనందాన్నిచ్చింది.’ ∙∙ తర్వాత రెడీ అయి దాల్ లేక్ వైపు బయలు దేరాను ఆటో మాట్లాడుకుని. చాలా చోట్ల తుపాకులు పట్టుకుని పహారా కాస్తున్న సిపాయిలు కనిపించారు. చేతిలో ఏకే–47, నెత్తి మీద హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు.. కొందరు అయితే ముఖం కనిపించకుండా నల్లటి మాస్క్‌లు, గుడ్డలు కట్టుకున్నారు. వాళ్ళను చూస్తేనే బెదురుపుట్టింది. కొన్ని చోట్ల కౌంటర్ టెర్రర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో పైన ఇద్దరు సిపాయిలు తుపాకి ఎక్కుపెట్టి ఉన్నారు... లోపల మరికొందరు ఉంటారనుకుంటా... రయ్‌మని వెళుతున్నారు. ఆర్మీ ట్రక్కులైతే ఇంకా చాలా కనిపించాయి. మన దగ్గర ఇటువంటి దృశ్యం జీవితకాలంలో ఓసారి కూడా కనిపించదు అని గట్టిగా చెప్పగలను. మీరేం అనుకున్నా సరే. నా ముప్ఫైయేళ్ళ జీవితంలో నేనైతే మన దగ్గర ఇలాగ ఎప్పుడూ చూడ్లేదు. అంతెందుకు చిన్నప్పుడు అసలు పోలీసులు వేసుకునే ఖాకీ నీడ కనిపిస్తేనే భయం వేసేది. అన్నం తిననని మారాం చేస్తే... అదిగో పోలీస్ వస్తున్నాడు అని బెదిరించి అమ్మ అన్నం తినిపించటం నాకు ఇంకా గుర్తే. ఒక సారి నిజంగానే పోలీస్ మా ఇంటికి వచ్చాడు. అమ్మో... అమ్మ చెప్పినంత పని చేసిందని గజగజా వణికిపోయాను. ‘నువ్వు చెప్పినట్లే చేస్తా అమ్మా...’ అంటూ అమ్మను నడుం వెనక నుంచి చుట్టుకుని ఒకటే ఏడుపు. ఆ వచ్చిన పోలీసు నాకు వరుసకు మామయ్య అవుతారు... ఏదో పని మీద మా ఇంటి వైపు రావటంతో అమ్మను పలకరించి పోదామని వచ్చారు అని ఎంత చెప్పినా... నేను వింటేనా? ఆయన వెళ్లేంత వరకు ఏడుపూ ఆపలేదు, అమ్మనూ వదల్లేదు. కాని ఇక్కడ మాత్రం సిపాయిల కవాతు కశ్మీర్ జీవితంలో భాగం. అందుకే కాబోలు జనాలు మాత్రం తమ మానాన తమ పనులు చేసుకుంటున్నారు. దాల్ సరస్సు శ్రీనగర్‌కు నడిబొడ్డున ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో విశాలంగా పరుచుకున్న దాల్ సరస్సు. ఆకాశంలో కొంగల బారులాగా, ఇసుక ఎడారుల్లో ఒంటెల వరుసలాగా, పల్లెల్లో ఒకదాని వెంట ఒకటి పరుగులు పెట్టే జోడెడ్ల బండ్లలాగా... దాల్ సరస్సులో వరుస కట్టాయి రంగు రంగుల బోట్లు. హౌస్బోట్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ‘కశ్మీర్ ఓ దృశ్య కావ్యం’ పొద్దుటి జర్నలిస్ట్ మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన సరైన పదం వాడారు అనుకున్నాను. కొంత మంది జర్నలిస్టులు, రచయితలు పదాలతో భలే ఆడుకుంటారు. నేను గీతలు గీయటమే కాని... నాలుగు ముక్కలు రాయమంటే చేతులెత్తేస్తాను. సాయంత్రం మళ్లీ లాన్లో ఉదయం వేసిన పెయింటింగ్‌పై పని చేయటం మొదలు పెట్టి ఆసిఫ్ కనిపిస్తాడేమో అని చూస్తున్నాను. కప్పు కాఫీ, నాలుగు మాటలు దొరుకుతాయి కదా. అసలు ఆ అబ్బాయిని చూస్తే ఈ హోటల్లో అటెండెంట్‌గా పని చేస్తాడని అనుకోం. వయస్సు ఇరవై ఐదేళ్ళ లోపే ఉండొచ్చు. ఎత్తయిన విగ్రహం, మరీ సన్నం అనలేం గాని ఓ మోస్తరు సన్నం. మన దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు ఈ కశ్మీర్ లోయలోనే ఉంటారు. పెద్ద కళ్లు, కోల ముఖాలు, గులాబీ రంగు శరీర ఛాయతో చూడగానే ముచ్చటేసేటట్లు ఉంటారు. ఆసిఫ్ మినహాయింపు కాదు. అసలు ఇలాంటి వారు గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఇట్టే క్లిక్ అవుతారు. మనసులో ఏవో ఆలోచనలు. ‘ఎక్స్క్యూజ్ మీ మేడమ్... చిత్రం చాలా బాగుంది...’ చిరునవ్వుతో ఆసిఫ్. ‘థ్యాంక్యూ. ఇంక చాలా ఉంది. ఇది రఫ్ స్కెచ్చే. కలర్ వేసిన తర్వాత చూస్తే కశ్మీర్ ప్రకృతిని నేను ఎలా చూపించానో తెలుస్తుంది.’ ‘ఔట్ లైన్లోనే మీరు ఏం వేయనున్నారో నాకు అర్థం అయ్యింది... కాఫీ తీసుకురానా మేడమ్...?’ ‘కాఫీ కోసమే ఎదురుచూస్తున్నా....’ ఐదు నిమిషాల తర్వాత కాఫీ కప్పు టేబుల్‌పై పెడుతూ– ‘మీరు కశ్మీర్ అందాలనే కాకుండా ఇక్కడి జీవితాన్ని కూడా బాగా వేయగలరు. థ్యాంక్యూ మేడమ్...’ వినయంగా చెప్పి వెనక్కి తిరిగాడు. ‘ఆసిఫ్... మీతో మాట్లాడాలి...’ ఈసారి వదలదలుచుకోలేదు. ‘ఇక్కడి జీవితం గురించి నాకు తెలియదు. మీతో మాట్లాడితే తెలుస్తాయని...’ సెకన్ గ్యాప్ ఇచ్చి ‘‘మీ గురించి చెప్పండి... ఏం చదువుకున్నారు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు?’’ ‘‘డిగ్రీ పూర్తయ్యింది మేడమ్. ఇంట్లో అమ్మా, నాన్న, చెల్లి ఉంటారు. అందరూ త్రాల్లోనే. నాన్నకు అనారోగ్యం. మంచానే ఉంటారు. చెల్లి ఇంటర్ చదువుతోంది. కాస్త పొలం, ఇంట్లో రెండు, మూడు ఆపిల్, ఆప్రికాట్ చెట్లున్నాయి. సీజన్లో నాలుగు డబ్బులు వస్తాయి. నేను నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి డబ్బులిచ్చి వస్తుంటాను. అందరం సంతోషంగానే ఉన్నాం.’’ ‘ఉద్యోగం కోసం మీరు శ్రీనగర్ వచ్చారా?’ ‘నిజం చెప్పాలంటే ఉద్యోగం కోసం ఇక్కడికి రాలేదు... ఊర్లో ఉండకుండా ఉండేందుకే ఇక్కడికి వచ్చాను.’ ‘అర్థం కాలేదు..’ ‘మా ఊరు సున్నితమైంది. వేర్పాటువాద భావజాలం ఎక్కువ. ఎవరైనా పట్టుబడితే ....ఇరుగు పొరుగున ఉండే మాలాంటి యువకులను కూడా అనుమానంతోనే చూస్తారు. కేసులు పెడతారు. ఒకసారి కేసు మెడకు చుట్టుకుందంటే కష్టాల్లో కూరుకుపోయినట్లే. గొడవ జరుగుతుంటే మేము చూడటానికి వెళ్లినా, యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ఉన్నా లోపలికి వెళ్లాల్సిందే. మా వాళ్లకు ఏదైనా చెబుదామని చూస్తే వాళ్ళ వైపు నుంచి మాకు భయం ఉంటుంది. ఊరంతా ఓ దారిలో వెళుతున్నప్పుడు నేను ఎదురీదలేను కదా. అందుకే ఇలా దూరంగా వెళ్లి బతకమని అమ్మ పంపేసింది. అక్కడ ఏ గొడవ గురించి విన్నా... ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో అని ఆందోళనగా ఉంటుంది నాకు.‘చిరునవ్వు చెదరలేదు. ముఖంలో ప్రశాంతత పోలేదు. నా నోట మాట రాలేదు. అతను చెప్పిన మాటలను దృశ్యీకరించుకుంటోంది మెదడు. నేను వేయాల్సింది అందమైన పూలు, కొండలు, లోయలు కాదు... ఇక్కడి మనుషుల్ని. వారి జీవితాలని. ఆసిఫ్ నా ఆలోచనలను లోతుల్లోకి తీసుకువెళ్లాడు. ఉదయం చాలా అద్భుతంగా అనిపించిన నా స్కెచ్ ఇప్పుడు చాలా పేలవంగా అనిపించసాగింది. రాత్రి హోటల్లోని రెస్టారెంట్లో డిన్నర్ కోసం వెళ్లగానే టేబుల్ దగ్గరకు ఆసిఫ్పే వచ్చాడు. మెను కాసేపు అటూ ఇటూ తిప్పి ఏదీ డిసైడ్ చేసుకోలేక చపాతితో పాటు నాకు నచ్చే కూరను ఎంపిక చేసి తెచ్చే బాధ్యత ఆసిఫ్‌కే ఇచ్చా. ‘నువ్వు ఏది తెస్తే అది తింటా’ అని చెప్పాను. క్షణం ఆశ్చర్యపోయి నేను ఇచ్చిన గౌరవానికి ఆనందపడి కిచెన్‌లోకి వెళ్ళాడు. క్రష్డ్ మష్రూమ్ మసాలా కర్రీ తెచ్చాడు. నాకు కూర నచ్చిందో లేదో అన్న ఆత్రుత ఆసిఫ్ ముఖంలో స్పష్టంగానే కనిపించింది. తన చాయిస్ చాలా బాగుందని చెప్పేసరికి చాలా సంతోషపడ్డాడు. ఈసారి సంభాషణ కొనసాగించదలుచుకున్నాడనుకుంటా. ‘‘మీరు కశ్మీర్ రావటం ఇదే మొదటిసారా మేడమ్...?’’ ‘‘అవును... చాలాసార్లు అనుకున్నాను రావాలని. ఏదో ఒక గొడవ జరుగుతుండటం, టికెట్లు క్యాన్సిల్ చేసుకోవటం కూడా జరిగింది.’’ ‘‘ఒకసారి మా ఊరికి కూడా రండి మేడమ్. మా ఇంటికి తీసుకువెళతాను. మా ఇంట్లోనే ఉండండి. మేము ఎలా ఉంటామో మీరు దగ్గరగా చూడొచ్చు.’’ ‘‘థ్యాంక్యూ... ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తా.’’ ‘‘మీరు వేసే పెయింటింగ్స్ చూస్తే మా చెల్లెలు మిమ్మల్ని అస్సలు వదలదు. నాకు కూడా బొమ్మలు వేయటం చాలా ఇష్టం. ఒకసారి నా చిత్రం వేయించుకోవాలని కోరిక కూడా.’’ ‘‘ఇక్కడ ఇంకో నాలుగు రోజులుంటా. ఆ లోపు వీలైతే వేసి ఇస్తా.’’ ‘‘అయ్యో పర్వాలేదు మేడమ్. తొందర లేదు. మరోసారి వచ్చినప్పుడు వేద్దురు. మా వాళ్ళందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తాను. మేము అతిథుల్ని చాలా గౌరవంగా, అభిమానంగా చూస్తాం. అది మా సంస్కృతిలో, కశ్మిరీయత్లో భాగం.’’ ‘‘ఈసారి తప్పకుండా మీ ఊరికి వెళ్లేటట్లు షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వస్తాను...’’ ∙∙ రెండో రోజు బండి మాట్లాడుకుని గుల్మార్గ్ వైపు వెళ్ళాను. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. పైన్, ఫర్ చెట్ల అడవులను దాటుకుని ఇక్కడికి చేరుకోవటం ఓ అద్భుత అనుభవం. శీతాకాలంలో అయితే స్కియింగ్, స్నో బోర్డింగ్ వంటి వింటర్ గేమ్స్‌కు అడ్డాగా మారుతుందట గుల్మార్గ్. రోజంతా తిరిగి హోటల్‌కు చేరుకునేటప్పటికి రాత్రి తొమ్మిది దాటింది. అలసిపోయి తినకుండానే పడుకున్నాను. రెండోరోజు ఉదయం టీవీ పని చేయలేదు. వాట్సప్ ఓపెన్ కాలేదు. నెట్వర్క్ కనెక్ట్ కానందుకు అసహనంగా కాసేపు రూమ్‌లోనే అటూ ఇటు తచ్చాడి రెస్టారెంట్ తెరిచే సమయానికి బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్ళాను. ‘‘రూమ్‌లో టీవీ పని చేయటం లేదు..’’ ‘‘సారీ మేడమ్. మొన్న రాత్రి నుంచే నెట్వర్క్ ఆపేశారుగా.’’ ‘‘ఎందుకు? ఫోన్లో నెట్ అందుకే రావటం లేద?’’ ‘‘మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, కేబుల్ నెట్ అన్నీ ప్రభుత్వం నిలిపేసింది. ఫలానా అతన్ని ఎన్కౌంటర్ చేశారుగా. పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అతనికి ఇక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది. చాలా మంది యువకులు అతన్ని హీరోగా చూస్తారు. అందుకే లోయ అంతా 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచి శ్రీనగర్ అంతా మూతబడే ఉంది.’’ ‘‘అవునా...?!!’’ ఒక్క క్షణం నిర్ఘాంత పోయాను. ‘‘అయితే ఇవాళ నను బయటకు వెళ్ళలేనా?’’ ‘‘వెళ్లకపోవటమే మంచిది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.’’ ‘‘ఎన్కౌంటర్ జరిగింది శ్రీనగర్లోనేనా?’’ ‘‘కాదు మేడమ్. త్రాల్. ఆసిఫ్ వాళ్ల ఊరు. వాళ్ళ నాన్నకు మందులైపోయాయని నాలుగు రోజుల క్రితమే ఫోన్ వచ్చింది. మందులు ఇచ్చేసి వస్తానని వద్దన్నా వినకుండా వెళ్ళాడు. వాళ్ళ నాన్న పెరాలిసిస్ పేషెంట్. బెడ్ మీదే. నెలనెలా అతనికి మందులు అవీ... ఇతనే తీసుకువెళ్ళి ఇచ్చి వస్తుంటాడు. చెల్లెలు అంటే ఎంత ప్రేమో. చాలా మంచోడు పాపం. ఎవరి జోలికీ పోడు. ఇంట్లో అందరూ తన మీదే ఆధారం అని జాగ్రత్తగా ఉంటాడు. ఈపాటికి వస్తానన్నాడు. అతను వస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.’’ రూమ్‌కు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళే పని లేదు కనుక పుస్తకం అందుకున్నాను. గుగి వా థియాంగో రాసిన మాటిగొరి నవల. పుస్తకం వెనక తిప్పి నవల దేని గురించా అని చదివాను. కెన్యా దేశం వలస పాలనలో ఉన్నప్పుడు అడవుల్లో ఉండి విముక్తి పోరాటం చేసిన నవలా నాయకుడు. సొంత పాలన వచ్చిందన్న విషయం తెలుసుకుని తన ఆయుధాలను అడవిలోనే ఓ చెట్టు కింద పాతిపెట్టి తన కుటుంబాన్ని కలుసుకోవాలనే ఆకాంక్షతో వస్తాడు. తీరా ఇక్కడికి వచ్చాక పాలకులు మారారు కాని పాలితులపై దౌర్జన్యాలు, దాడులు, దోపిడీ వ్యవస్థ మారలేదన్న విషయం తెలుసుకుని మరోసారి ఆయుధం చేపట్టాల్సిందే అని నిర్ణయించుకోవటం నవల సారాంశం. అక్షరాల వెంట కళ్ళు పరుగులు పెడుతున్నా... మధ్య మధ్యలో ఆసిఫ్, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్న ఆలోచన మెదులుతూనే ఉంది. వెళ్ళిపోయే ముందు ఆసిఫ్‌కు ఓ ఊహించని బహుమతి ఇస్తే బాగుంటుందనిపించింది. కాన్వాస్ టేబుల్ సిద్ధం చేసుకున్నాను. ఆ మరుసటి రోజు కూడా అలానే గడిచిపోయింది. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లు. ఫోన్ మోగలేదు. ఇంటర్నెట్ లేదు. టీవీ లేదు. బయటకు ప్రయాణం కట్టే ఆస్కారం లేదు. సైన్యం పహారాలో నిశ్శబ్దంగా ఉన్న శ్రీనగర్ రోడ్ల పై కాలి నడకన కాసేపు తిరిగాను ఐడెంటిటీ కార్డ్ పాకెట్లో పెట్టుకుని. పుస్తకాలు, కాన్వాసుతో కాసేపు కాలక్షేపం చేశాను. ఈ మొత్తం ప్రక్రియలో ఆసిఫ్, అక్కడి కల్లోలం గురించిన ఆలోచనలు సమాంతరంగా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఆ రోజు కూడా అతని రాక గురించి వాకబు చేశాను. బంద్ కదా రావటానికి వాహనాలు దొరికి ఉండకపోవచ్చు లేదా ఎలాగో ఇంటికి వచ్చాను కదా అని మరో రోజు కుటుంబ సభ్యులతో ఉండాలనుకుని ఉండొచ్చు. తర్వాతి రోజు పదకొండు గంటల ఫ్లైట్‌కు తిరుగు ప్రయాణం. అందుకే రాత్రి కల్లా ఆసిఫ్ చిత్రాన్ని పూర్తి చేసేస్తే ఉదయం హడావిడి ఉండదు అనుకున్నా. సరిగ్గా ఒంటి గంటా ముప్ఫై నిమిషాలకు కుంచె పక్కన పెట్టి అన్ని కోణాల నుంచి చిత్రాన్ని చూసుకుంటూ నిలబడ్డాను. ఆ చిరునవ్వు, కళ్ళల్లో మెరుపు అనుకున్న దాని కంటే బాగానే వచ్చాయి. ఆసిఫ్ ఆశ్చర్యపోతాడు అనుకుని ప్రశాంతంగా నిద్ర పోయాను. తెల్లారింది. చివరి రోజు లాన్లో నడకను మరిచిపోలేదు. ఫోటోలు దిగాను. బ్రేక్‌ఫాస్ట్ కోసం డైనింగ్ హాల్లోకి వెళ్ళాను. కళ్లు ఆసిఫ్‌ను వెతికాయి. మరో అబ్బాయి ఉంటే ఆలూ పరాఠా ఆర్డర్ ఇచ్చాను. ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఆ వేళ ఒక అబ్బాయే ఉన్నాడు. పది నిమిషాల తర్వాత వేడి వేడి పరాఠాల ప్లేటు తెచ్చి నా ముందు పెట్టాడు. ‘‘ఆసిఫ్ ఇంకా రాలేదా?’’ ‘‘నహీ ఆయా మేడమ్... ఆయేగా భీ నహీ... ఇక రాడు మేడమ్.’’ వెన్నులో సన్నటి వణుకు. కసి, కోపంతో అతను కూడా తుపాకి పట్టాడా? బలగాలు అదుపులోకి తీసుకున్నాయా? ఇక్కడ రహస్య జీవితం గడిపాడా? ‘‘ఏం..?’’ గొంతు పెగుల్చుకుని అడిగాను. ‘‘వాళ్ళ చెల్లి బయటకు వెళితే వెతుక్కుంటూ వెళ్ళాడు. అదే సమయంలో రోడ్డు మీద రాళ్ళ దాడి జరుగుతోంది. స్థానికులు రాళ్ళు రువ్వుతుంటే వాళ్లను కంట్రోల్ చేయటానికి పెల్లెట్లు పేల్చుతా ఉన్నారు. దారిన పోతున్న ఆసిఫ్‌కు పెల్లెట్లు తగిలాయి. వెంటనే వైద్యం దొరికితే బతికేవాడేమో... హాస్పటల్‌కు తీసుకెళ్ళే వరకే ...’ బాధ, పశ్చాత్తాపం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు... నా లోతుల్లోనూ అనుమానపు ఛాయలు ఉన్నాయన్నమాట. లేక ఆసిఫ్ చనిపోతాడన్న ఊహే నాలో లేకపోవటమా? నేనలా నన్ను నేను సమర్థించుకుంటున్నానా? ఆ మెరిసే కళ్ళు, చెదరని చిరునవ్వు తెరలై కళ్ళ ముందు వేళ్ళాడుతున్నాయి. -
ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు!
శబరిమలకు వెళ్లే ముందు కొందరు ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని నటి రంజిత ఆవేదనను వ్యక్తం చేశారు. ఈమె శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలను అనుమతించడాన్ని ఆమె వ్యతిరేకించారు. తమిళంలో ముదల్ మర్యాదై చిత్రాల్లో నటించిన రంజిత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటోంది. ఇటీవల శబరిమలకు వెళ్లడానికి మహిళలు అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో శబరిమల అయ్యప్ప దేవాలయం వద్ద పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా మంది మహిళలు తాము అయ్యప్ప దర్శనం చేసుకునే తీరరతామని బయలుదేరడంతో అక్కడ వాతావరణం రణరంగంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొందరు మహిళలు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ శబరిమలకు వెళ్లడానికి వేచి చూస్తాం.. అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో నటి రంజిత కూడా సభ్యురాలిగా ఉన్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో శబరిమల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటికి నిప్పంటించుకోవడం వల్ల అక్కడ పరిస్థితులు మళ్లీ సమస్యగా మారాయని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయం వద్ద అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో నిజమైన భక్తులకు స్వామి దర్శనం చేసుకోలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఆ మధ్య రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆమె సమర్థించారు. దీంతో కొందరు మహిళలు.. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరి కొందరు శబరిమలకు వెళ్లే ముందు తన ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని, ఈ చర్యలు క్రిమినల్ కేసు కిందకు రావా? అంటూ నటి రంజిత శనివారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ వాపోయారు. -
స్త్రీలోక సంచారం
శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసి గత అక్టోబర్‌లో వార్తల్లోకి వచ్చిన రెహానా ఫాతిమా అనే 32 ఏళ్ల కేరళ మోడల్, సామాజిక కార్యకర్త, బి.ఎస్.ఎన్.ఎల్. కంపెనీలో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తున్న రెహానా ఫాతిమాపై తాజాగా కేసు నమోదైంది. అయ్యప్ప భక్తురాలి వస్త్ర, వేషధారణల్లో నల్లరంగు చొక్కా ధరించి, మెడలోను, చేతికి రుద్రాక్ష మాలలు వేసుకుని, నుదుటిపై విభూది దిద్దుకుని అయ్యప్పస్వామిలా కూర్చొని, తొడభాగం కలిపించేలా తీయించుకున్న ఫొటోను ఆమె తన ఫేస్బుక్లో పెట్టడంపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇదే విషయమై బి.ఎస్.ఎన్.ఎల్. కూడా ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. దీనిపై ఫాతిమా భర్త స్పందిస్తూ, ‘‘దిగంబర సన్యాసులు పూజలు అందుకునే ఈ దేశంలో.. ఒక మహిళ తన తొడభాగం కనిపించేలా ఫొటో తీయించుకోవడం ఏ విధంగా మతవ్యతిరేక చర్య అవుతుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి 10–50 వయసులో ఉన్న మహిళల్ని కూడా అనుమతిస్తూ సుప్రీంకోర్టు గత సెప్టెంబర్‌లో తీర్పును ఇచ్చాక అక్టోబర్‌లో తొలిసారి ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు దర్శనం కోసం ప్రయత్నించిన తొలి మహిళగా ఫాతిమా గుర్తింపు పొదారు. శబరిమలకు బయల్దేరడానికి ముందు తీయించుకున్న ఫొటోనే ఆమె ఇప్పుడు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ‘ఆకాశంలో సగం’ స్త్రీ. ఆ ఆకాశంలో యుద్ధనౌకల విమానాల్ని చక్కర్లు కొట్టించే స్త్రీ.. శుభాంగి స్వరూప్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై ఏళ్లకు భారత నౌకాదళంలోకి పైలెట్‌గా అడుగుపెట్టిన తొలి మహిళ శుభాంగి. సరిగ్గా ఏడాది క్రితం ఆమె నేవీ పైలెట్‌గా చార్జి తీసుకున్నారు. మహిళా లోకాన్ని రీచార్జ్ చేశారు. శుభాంగి.. బరేలీ (ఉత్తరప్రదేశ్) అమ్మాయి. కేరళలోని కన్నూర్ దగ్గరి ఎళిమల ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’ లో తొలి మహిళా బ్యాచ్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. నేవీ పైలెట్ పోస్ట్‌కు ఎంపికైన తొలి మహిళగా గుర్తింపు పొందింది. ఇవాళ ఇండియన్ నేవీ డే. మన నౌకాదళానికి, నౌకాదళ విమాన తొలి మహిళా పైలట్ శభాంగికి మనస్పూర్తిగా శుభాభినందనలు తెలియజేయవలసిన సందర్భం. నాగాలాండ్‌లో ఏటా జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ డిసెంబర్ 1న ప్రారంభమైంది. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది టూరిస్టులు వస్తారు. ఈ సందర్భంగా మహిళా టూరిస్టులు, స్థానిక మహిళల కోసం భారత ప్రభుత్వం ‘112 ఇండియా’ అనే మొబైల్ యాప్‌ని ఆవిష్కరించింది. ఆ యాప్‌ని స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని ఉంటే, ప్రమాదంలో ఉన్నప్పుడు అందులోని ‘షౌట్’ అనే ఫీచర్ ద్వారా.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కనెక్ట్ అయి తక్షణం పోలీసులు, వలంటీర్ల నుంచి బాధిత మహిళకు ఆపత్కాల సహాయ సహకారాలు లభిస్తాయి. దేశంలో హిమాచల్ ప్రదేశ్ తర్వాత మహిళల భద్రత, రక్షణల కోసం ఇలా సింగిల్ నెంబర్ ఎమర్జెన్సీ మొబైల్ అప్లికేషన్ సదుపాయం ఉన్న రెండో రాష్ట్రం నాగాలాండే కాగా, ఈశాన్యంలో ఇదే మొదటి రాష్ట్రం. -
పరిమళించిన సంస్కారం
ఒంటరిగా జీవన పోరాటం చేస్తున్న ఆ యువతిని ఆదుకోడానికి ఆపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రెహానాకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు సాక్షి పాఠకులు కనుమూరు హరిచంద్రారెడ్డి. ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.లక్ష అందజేసి, స్నేహితుల ద్వారా మరో రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. మంచంలో ఉన్న భర్తకు తల్లిగా సపర్యలు చేస్తూ, కాలం చేసిన మామకు.. తనే కొడుకై తల కొరివి పెట్టి అంతిమ సంస్కారం నిర్వహించింది రెహానా. ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులను, బంధువులను వదిలేసి వచ్చి మతాంతర వివాహం చేసుకున్న యువతి ఆమె. భర్త అనారోగ్యంతో శల్య స్థితిలో మంచంలో ఉన్నాడు. మామ మరణించడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అయిన వారెవరూ ముందుకు రాలేదు. దీంతో రెహానానే హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశానం వరకూ వెళ్లి అక్కడ, ఆ ధర్మం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించింది. దీనిపై సాక్షి ‘ఫ్యామిలీ’ అక్టోబర్ 24న ‘అంతిమ సంస్కారం’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని చూసి పాఠకులు కొందరు స్పందించారు. వారిలో ఒకరు గూడూరు తూర్పువీధి ప్రాంతానికి చెందిన కనుమూరు హరిచంద్రారెడ్డి. ‘‘ఈ కథనం నా మనసును కదలించింది’’ అంటూ రెహానా సంస్కారాన్ని ఆయన అభినందించారు. ఆమె భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో మంచంలోనే ఉన్నాడని చెప్పడంతో అతనికి అవసరమైన సహాయం చేస్తామనీ, రెహానాను తమ ట్రస్ట్ ద్వారా మరింత ఆదుకునే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. శ్రీనివాసులు స్నేహితుడైన శ్రీనాథ్ కూడా స్పందించి ‘హెల్ప్ టు శ్రీను’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి, అందులో అతని స్నేహితుల నంబర్లను అనుసంధానం చేశారు. దీంతో అతని మిత్రులైన ఎస్వీ సుధాకర్ రూ.20 వేలు, ఉమాశంకర్‌రాజు, బిల్డర్ చంద్రతో పాటు మరికొందరు కలిసి రూ.1,05,000 శ్రీనివాసులు అకౌంట్లో జమ చేశారు. – సాక్షి ప్రతినిధి, గూడూరు -
రెహానా ఫాతిమాను వీడని కష్టాలు
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను కష్టాలు వీడటం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారన్న కారణంగా ఆమెను ముస్లిం సమాజం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రెహానాను బదిలీ చేస్తూ బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం.. పలవరివట్టం అనే ప్రాంతానికి ఆమెను బదిలీ చేసింది. అయితే అక్కడ కూడా ఆమె పని చేయడానికి వీల్లేదని, ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శబరిమల కర్మ సమితి సభ్యులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి బెదిరింపులకు రెహానా భయపడే రకం కాదని, ఎవరి కారణంగానో తన ఉద్యోగాన్ని వదులుకోరని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించారు. కాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్లో రెహానా ఫాతిమా కస్టమర్ రిలేషన్ విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన కారణంగా ఆమెను బోట్ జెట్టీ ప్రాంతం నుంచి పబ్లిక్ కాంటాక్ట్ అంతగా అవసరం లేని పలరివట్టం ఎక్ఛ్సేంజీకి బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా
పుట్టుకకు చావుకు ఉందా ధర్మం వ్యాధికీ బాధకూ ఉందా మతం నీటికీ నిప్పుకూ ఉందా భేదం మనుషులందరికీ అంతిమంగా ఉండాల్సింది సంస్కారం... ఆ యువతి ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది... కట్టుకున్న భర్తతోపాటు, మామ కూడా మంచానికే పరిమితమైనా.. మొక్కవోని దీక్షతో వారిద్దరికీ సపర్యలు చేస్తూ... ఉన్న ఒక్కగానొక్క ఇంటిని తాకట్టు పెట్టి, వారిద్దరి వైద్యానికి ఖర్చు చేసింది. ఈ కష్టానికి ముప్పులా ఆదివారం (అక్టోబర్ 21) ఆమె మామ మృతి చెందాడు. మృతదేహాన్ని తమ సొంతింటికి తీసుకురాగా, దానిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అడ్డుగా నిలిచాడు. శవాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు అన్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఏకమై, వారి బాకీని వారంలోగా తీరుస్తామని హామీ ఇవ్వడంతో, మృతదేహాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. ఆ తర్వాత ఆ యువతే కొడుకులా నిలిచి, హిందూ ధర్మం ప్రకారం తానే బద్దె వేసుకుని, కాటివరకూ వచ్చి, శ్మశానంలో తన మామకు తలకొరివి పెట్టింది. టీవీ సీరియళ్లలో దుర్మార్గమైన కోడళ్లను చూపుతున్న ఈ కాలంలో ఈ కోడలు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏం జరిగింది? గూడూరు గమళ్లపాళానికి చెందిన పర్వతాల రమణయ్య, రమణమ్మల ఏకైక కుమారుడు శ్రీనివాసులు. తండ్రి రమణయ్య చెన్నై దుకాణదారులకు అవరసమైన వస్తు సామాగ్రిని తీసుకొచ్చి అందజేస్తూ సీజ వ్యాపారం చేస్తుండేవారు. శ్రీనివాసులు కూడా తండ్రికి చేదోడుగా, అప్పుడప్పుడూ చెన్నై వెళ్లి అవసరమైన వారికి సామాగ్రిని తీసుకొస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం తల్లి రమణమ్మ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. దాంతో తండ్రి బాగోగులు కొడుకు శ్రీనివాసులు ఒక్కడే చూసుకుంటూ ఉన్నాడు.రెండేళ్ల క్రితం శ్రీనివాసులుకు రెహానా అనే యువతితో పరిచయమై, అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కోడలిగా ఆ ఇంట అడుగు పెట్టిన రెహానా ఇంటిని చక్కదిద్దే పనిలో పడింది. అయితే ఏడాది క్రితం రమణయ్యకు కూడా క్యాన్సర్ వ్యాధి సోకింది. కొత్త కోడలు మామ సేవలను చూసుకుంటూ ఉండగా, శ్రీనివాసులు సీజ¯Œ వ్యాపారం చేస్తూ ఇల్లు లాక్కొచ్చేవాడు. విధికి అంతటితో సంతృప్తి కలగలేదు. మూడు నెలల క్రితం శ్రీనివాసులు కూడా అనారోగ్యానికి గురయ్యాడు.రోజురోజుకూ శుష్కించిపోతూ మంచం పట్టాడు. దీంతో రెహానాకు ఏం చేయాలో తెలీక కుంగిపోయింది. డబ్బు అవసరమయ్యింది. అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తికి తాముంటున్న ఇంటిని తాకట్టుపెట్టి 3 లక్షలు తీసుకుని, భర్తతోపాటు, మామకూ వైద్యం చేయిస్తూ బతుకుబండిని లాక్కురాసాగింది. ఇంతలో మరో అశనిపాతం. ‘‘ఇకపై మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే ఖాళీ చేయాల్సిందే’’నని ఇంటిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి కరాఖండీగా చెప్పాడు. చేసేదిలేక రెహానా, తన మామ రమణయ్యతోపాటు, శ్రీనివాసులును తీసుకుని నెల్లూరుకు వెళ్లి, అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని, ఉన్న కాస్త డబ్బుతో మామ, భర్తలకు వైద్యం చేయిస్తూ బతుకుతోంది. ఈ క్రమంలో ఆదివారం రమణయ్య తీవ్ర అస్వస్థతకు గురవడంతో, తిరుపతికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రమణయ్య ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో రెహానా బతుకులో చీకట్లు మరింత చిక్కనయ్యాయి. ఒకవైపు మంచంలో ఉన్న భర్త, మరోవైపు మృతి చెందిన మామ... చేసేది లేక నెల్లూరులోని అద్దె ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్తే రానివ్వరని, అంబులెలో గూడూరుకు తీసుకొచ్చింది. తాము తాకట్టుపెట్టిన ఇంటిని అద్దెకు ఇచ్చి ఉన్నారని తెలియడంతో, రమణయ్య పార్ధివ దేహాన్ని ఎక్కడ ఉంచి అంత్యక్రియలు చేయాలా... అని ఆందోళనకు గురైంది. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్నవారికి సంగతి తెలిసింది. వారంతా రమణయ్య మృతదేహాన్ని సొంతింటికే తీసుకురావాలని సలహా ఇచ్చారు. దాంతో మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఈలోగా ఇల్లు తాకట్టుపెట్టుకున్న వ్యక్తికి సమాచారం అందడంతో అక్కడకు వచ్చాడు.మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించనంటూ తలుపునకు అడ్డుగా నిలుచున్నాడు. అది న్యాయం కాదంటూ కొందరు చెప్పిచూశారు. కొంత వాగ్వివాదం జరిగాక కూడా ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆయన ససేమిరా అన్నాడు. ఆ ఇంటి పక్కనే రమణయ్య సోదరులూ ఉన్నారు. ‘‘మీరైనా ఇంట్లోకి రానివ్వ’’మంటూ రెహానా ఎంతో ప్రాధేయపడింది. అయినా వారికి కనికరం కలగలేదు.మా ఇంట్లోకి రానివ్వమని తెగేసి చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని వారంతా కలసి, ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా వారిపై ఎలాంటి కనికరం చూపించకుండా, తానేమీ చేయలేనని పోలీసు కేసు పెట్టుకోండంటూ పంపేశారు. దీంతో చేసేది లేక, అర్ధరాత్రి వరకూ ఆ ఇంటి బయటే మృతదేహాన్ని ఉంచారు. దాంతో ఆ ఇంట్లో అద్దెకున్నవారు వెళ్లిపోయారు. ఇంత జరిగినా తాకట్టుపెట్టుకున్న వ్యక్తి మాత్రం తాను వెళ్లిపోకుండా గడియపెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న ఇరుగుపొరుగు వాళ్ల మనసు కరిగింది. వారు అతడిని పిలిచి... ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తామని, ఇలా శవాన్ని బయట ఉంచడం బాగుండదని, ఈలోపు తమదీ పూచీ అని హామీ ఇవ్వడంతో శవాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా ముస్లిం యువతి అయిన రెహానా తన మామకు సోమవారం సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించింది. ఆమే కుమారుడిలా బద్దె వేసుకుని, ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకూ వెళ్లింది. అక్కడ హిందూ ధర్మం ప్రకారం తానే తలకొరివి పెట్టి, అంత్యక్రియలు జరిపించింది. మధ్యలో దింపుడు కళ్లం వద్ద కూడా మామ పేరును తానే మూడుసార్లు పిలవడం, అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ‘‘ఇదిరా ప్రేమంటే. కలసిన మనసులకు ఉదాహరణ ఆ దంపతులేరా’’ అంటూ రెహానాను చూసి కంటతడి పెట్టారు. ఆ సంఘటనకు చలించిపోయిన ఆ ప్రాంతంలోని వారంతా కూడా సాయం అందించి రెహానాకు బాసటగా నిలిచారు. యావత్ స్త్రీ జాతికే రెహానా ఆదర్శమంటూ కొనియాడారు. దాతలు ముందుకొచ్చి ఆ త్యాగమూర్తికి సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి, సాక్షి, గూడూరు -
శబరిమల ప్రవేశం; స్మృతి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళలు ప్రయత్నించడాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కామెంట్ చేయాలనుకోవడం లేదన్న స్మృతి.. ‘ ఇది కేవలం వ్యక్తుల ఇంగిత ఙ్ఞానంపై ఆధారపడి ఉన్న అంశం. రుతుస్రావ సమయంలో వాడిన సానిటరీ న్యాప్కిన్లను కనీసం స్నేహితుల ఇంటికైనా తీసుకెళ్తామా. అలా చేయం కదా. మరి దేవుడు ఉండే చోటుకి అలా వెళ్లడం ఎందుకు. ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచిది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ప్రతీ ఒక్కరికీ దేవుడిని ప్రార్థించే హక్కు ఉంటుంది.. కానీ హక్కుల పేరిట అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ‘ఒక మహిళగా నాకు కూడా ఫైర్ టెంపుల్(జొరాస్ట్రియన్ల ప్రార్థనా స్థలం)లోకి ప్రవేశించే హక్కు లేదు. ఒకవేళ నా కుమారుడు ప్రార్థించడానికి వెళ్లిన సమయంలో బయటే అతడి కోసం ఎదురుచూస్తా. అలా అని దేవుడంటే నాకు నమ్మకం లేనట్లేనా’ అంటూ స్మృతి ప్రశ్నించారు. కాగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా తన ఇరుముడిలో సానిటరీ న్యాప్కిన్లను తీసుకువెళ్లారనే ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అది నిజమో కాదో తేలక ముందే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మహిళ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ స్మృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఈ మహిళకు ముస్లింగా ఉండే అర్హత లేదు!
ప్రముఖ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ మత బహిష్కరణ విధించింది! శబరిమలకు అన్ని వయసుల స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా స్త్రీ, పురుష భేదం లేకుండా కేరళలోని హిందూ మతస్థులందరూ ఒక వైపు నిరసన ప్రదర్శనలు జరుపుతుండగా.. ఆలయంలోకి ప్రవేశించేందుకు రెహానా ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించిన ముస్లిం కౌన్సిల్ ఆమెపై ఈ విధమైన చర్యను తీసుకుంది. అంతేకాదు, ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ‘మహల్లు’ సభ్యత్వం నుంచి తొలగించాలని ‘ఎర్నాకుళం సెంట్రల్ ముస్లిం జమాత్’ ను కూడా కేరళ కౌన్సిల్‌ను ఆదేశించింది. ‘‘ఆమె చర్య లక్షలాది మంది హైందవ భక్తుల మనసులను బాధించింది. వారి ఆచారాలను అగౌరవపరిచింది. ‘కిస్ ఆఫ్ లవ్’ ఆందోళనలో పాల్గొని, నీలి చిత్రంలో నటించి, ఇప్పుడు మతవిశ్వాసాలకు భంగకరంగా ప్రవర్తించిన ఈ మనిషికి ముస్లింగా ఉండే అర్హత లేదు’’ అని కేరళ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.పూన్కుంజు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మరోవైపు, రెహానా శుక్రవారం శబరిమలను ఎక్కే ప్రయత్నం చేశారన్న విషయం తెలిసి కోపోద్రిక్తులైన ముస్లింలు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. జమ్మూలోని కఠువాలో ఈ ఏడాది ఆరంభంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో బాలిక తరఫున న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన కేసును విచారిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆ కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. ‘‘నాకు ఏ విధంగానూ తాలిబ్ హుస్సేన్ వైపు వాదించాలని లేదు. నేనీ నిర్ణయం తీసుకోవడానికి అతడి గురించి నాకు తెలిసిన విషయాలు చాలు’’ అని జైసింగ్ అన్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థినిపై బాట్లా హౌస్ ఏరియాలోని ఆమె అపార్ట్మెంట్లో హుస్సేన్ అత్యాచారం జరిపినట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని చదివిన అనంతరం జైసింగ్ కేసు నుంచి తప్పుకున్నారు. ఆ వార్తా కథనంలో బాధితురాలు జరిగిన ఘటనలనన్నిటినీ వివరంగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో నాపై అత్యాచారం చేసిన హుస్సేన్ అంతకు ముందు నుంచే తనను పెళ్లి చేసుకోవాలని నన్ను వేధిస్తున్నాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో తను అందరిలాంటి మగాణ్ణి కాదని నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటికీ వినకపోవడంతో బలప్రయోగంతో అనుభవించాడు’’ అని ఆమె వివరించారు. ప్రముఖుల్ని వెంటాడి రహస్యంగా వారి ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్లను ‘పాప్పరాజ్జీ’ అంటారు. అలాంటి ఒక పాప్పరాజ్జీ తీసిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. పాప్పరాజ్జీల అనుచిత ప్రవర్తనతో తనలాంటి వారు ఎంతగా ఇబ్బంది పడతారో తెలియజేస్తూ ఓ పొడవాటి పోస్ట్ పెట్టిన 23 ఏళ్ల అమెరికన్ సూపర్ మోడల్ జిజీ హదీద్‌పై ఓ ఫొటో ఏజెన్సీ కేసు పెట్టింది. ‘ఫొటోలు తీసుకోవాలనుకునే వాళ్ల కోసం వీలైనంత వరకు మేము ఓపిగ్గానే చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం. అయితే ప్రతిసారీ అలా కుదరదు. అయినప్పటికీ ఫొటోల కోసం బలవంతం చేస్తుంటారు. ఇవ్వకపోతే.. మేము ఎక్కడికి వెళితే అక్కడికి మమ్మల్ని వెంటాడి, వేటాడి ఫొటోలు తీసుకుని, వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటారు. మాలో ఏం స్పెషల్ ఉంటుంది? ఏ సందర్భమూ లేకుండానే ఓ ఆరడుగుల మనిషి కారు ఎక్కడాన్ని, కారు దిగడాన్ని, పని చేస్తున్నచోట ఆఫీస్ బిల్డింగ్‌లోకి వెళ్లడాన్ని, మళ్లీ బయటికి రావడాన్ని నిరంతరం షూట్ చేస్తూనే ఉంటారు. అందుకోసం వారు మూర్ఖంగా, నిర్దాక్షిణ్యంగా కూడా ప్రవర్తిస్తుంటారు. అది మమ్మల్నే కాదు, మా పక్కన ఉన్న సాధారణ వ్యక్తులను కూడా ప్రమాదంలో పడేసేలా, ప్రాణాంతక స్థితిలోకి నెట్టేసేలా ఉంటుంది. మరీ వ్యక్తిగత జీవితంలోకి కూడా ప్రవేశిస్తే ఎలా? పాప్పరాజ్జీలు తమ స్వార్థాన్ని, ధనార్జన ధ్యేయాన్ని పక్కన పెట్టి.. కనీస మానవత్వంతో బిహేవ్ చేయాలి’’ అని ఆ పోస్టులో పెట్టిన హదీద్ ఆ తర్వాత కొన్ని గంటలకే దానిని తొలగించారు! ఐదు రోజుల మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు పూజల అనంతరం సోమవారం మూత పడ్డాయి. అయితే ఆలయంలోకి స్త్రీల ప్రవేశంపై కేరళలో జరుగుతున్న రభస మాత్రం పూర్తి కాలేదు. మరోవైపు.. శబరిమల ఆలయంలోకి స్త్రీలను అనుమతించడం సబబా కాదా అన్నదానిపైనా సోషల్ మీడియాలో వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘‘ఒక మలయాళీగా, ఒక హిందువుగా ఈ పరిణామాలు నన్నెంతో బాధించాయి. అంతా చదువుకున్న వారే అయిన కేరళలో స్త్రీ, పురుషులు ఎందుకని ఇలా దురుసుగా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. శబరిమలను దర్శించుకోవాలని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కానీ దర్శించుకోవాలని ఆశపడుతున్న మహిళలను నేను వ్యతిరేకించను’’ అని మాయా మీనన్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో మలయాళీ నేపథ్య గాయని అంజూ జోసెఫ్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ‘‘మహిళలకు హక్కులు లేని కాలానికి తిరోగమించడం కోసం పోరాడుతూ ఆ క్రమంలో పురోగమనం కోసం పోరాడిన మన ముందు తరం వారి ప్రయత్నాలను, ప్రయాసను వృథా చేస్తున్నాం. వాళ్లు మనకు ఓటు హక్కు తెచ్చారు. సతీ సహగమన దురాచారాన్ని నిర్మూలించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం తెచ్చారు. ఇప్పుడు ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం ఏర్పరిచారు. అయినప్పటికీ మనమింకా వెనకే ఉండిపోతాం అంటున్నాం’’ అని అంజు ఆవేదన చెందారు. యు.ఎస్.లోని హోండురాన్ వలస గుంపుల (మైగ్రెంట్ క్యారవాన్స్) నుంచి మహిళలను, చిన్నారులను దేశంలోకి అనుమతించే కార్యక్రమాన్ని మెక్సికో ప్రారంభించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ‘దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. డెమోక్రాట్లు వలస గుంపుల్ని కోరుకుంటున్నారు. అసలీ వలస గుంపులేంటీ అని అనేకమంది ఆశ్చర్యపోతున్నారు’ అన్నారు. -
నిరసనల శబరిమల
పంబా: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున మహిళా భక్తుల అడ్డగింపుల పర్వం ఐదో రోజూ కొనసాగింది. ఆదివారం ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆరుగురు తెలుగు మహిళా భక్తులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలమ్మ(47) అనే మహిళ కుటుంబంతో కలసి శబరిమల కొండ ఎక్కుతుండగా సన్నిధానం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే 4 కిలోమీటర్ల మేర కొండ ఎక్కి వచ్చిన ఆమెను చుట్టుముట్టి వయసు ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు చూపాల్సిందిగా కోరారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాలమ్మ స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే ఆమెను అంబులెన్స్‌లో పంబాలోని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు బంధువులతో వచ్చిన 40 ఏళ్ల వయసు ఉన్న మరో ఇద్దరు మహిళా భక్తులను కూడా కొండపైకి రానివ్వకుండా ఆందోళనకారులు నిలువరించారు. దీంతో పోలీసులు వారిరువురిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం నిలక్కల్ బేస్ క్యాంప్‌నకు వచ్చిన ఆ ఇద్దరు ఆలయ సాంప్రదాయాన్ని అతిక్రమించటానికి తాము ఇక్కడికి రాలేదని రాతపూర్వకంగా తెలిపారు. వారిరువురిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాసంతి (41), ఆదిశేషి (42)గా గుర్తించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రెహానా ఫాతిమాను ఇస్లాం నుంచి బహిష్కరించినట్లు కేరళ ముస్లిం జమాత్ మండలి వెల్లడించింది. -
శబరిమల వెళ్లినందుకు బహిష్కరణ..!
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళ హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లిం సమాజం బహిష్కరించింది. హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆమె ప్రవర్తించారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫాతిమాను ముస్లిం సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ (సీఎంజే) ఎర్నాకులం కౌన్సిల్‌ను ఆదేశించింది. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మోజో టీవీ జర్నలిస్ట్ కవిత జక్కలతో కలిసి రెహానా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అనేక ఘర్షణలో నడుమ పోలీసు బందోబస్త్‌తో ఇరుముడితో ఇద్దరూ కొండపైకి చేరుకున్నారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే గుడిని ముసివేస్తామని ప్రధాన అర్చకుడు హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారు వెనుదిరిగారు. కొండపైకి వీరి ప్రవేశం తీవ్ర అల్లర్లకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ భక్తుల సాంప్రదాయలకు భంగం కలిగే విధంగా రెహానా వ్యవహించిందని.. ఆమెతో పాటు వారి కుటుంబాన్ని కూడా ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ ప్రకటించింది. రెహానా కొండపైకి చెరిన సమయంలో గుర్తుతెలియని కొంతమందివ్యక్తులు ఆమె ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. కాగా వ్యక్తిగతంగా సామాజిక కార్యకర్త అయిన రెహానా గతంలో కేరళలో వివాదస్పదంగా మారిన కిస్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నారు. ముస్లిం సాంప్రదాయనికి వ్యతిరేకంగా ఆమె కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొన్నారని జమాత్ కౌన్సిల్ గతంలో ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది. -
కామెడీ థ్రిల్లర్‌గా సైవ కోమాళి
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం సైవ కోమాళి అని ఆ చిత్ర దర్శకుడు సెరేశ్ శాంతారామ్ తెలిపారు. దర్శకుడు ధరణీ, జగన్, బాలుశివన్, శాంతకుమార్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇది. ఎస్ఎంఎస్.మూవీస్ పతాకంపై ఏసీ.సురేశ్, మహేంద్రన్, సారుుమహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సైవ కోమాళి చిత్రంలో నడువుల కొంచెం పక్కల్తై కానోమ్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్, రెహానా, నాన్‌కడవుల్ రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో పవర్‌స్టార్ జీఎం.కుమార్, టీబీ.రాజేంద్రన్, రంజిత్, సూపర్‌గుడ్ లక్ష్మణన్, క్రేన్‌మనోహర్, కృష్ణమూర్తి, టీకే.కళ, గాయత్రి, వనిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కామెడీ థ్రిల్లర్ అంశాలతో రూపొందిస్తున్న చిత్రం సైవ కోమాళి అని తెలిపారు. ప్రతి మనిషిలో సైకో ఉంటాడు. అమాయకుడు ఉంటారన్నారు. సమాజ తీరును బట్టి ఆ మనిషి ప్రవర్తన ఉంటుందని చెప్పే చిత్రంగా సైవ కోమాళి ఉంటుందన్నారు. అదే విధంగా సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న దురాగతాలు, వాటిని ఎలా ఎదుర్కొవాలన్న అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. 108 అంబులెన్స ప్రాధాన్యతను సైవ కోమాళి చిత్రంలో చెప్పనున్నట్లు చెప్పారు. దీనికి కే.బాల ఛాయాగ్రహణ, గణేశ్ రాఘవేంద్ర సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఇందులోని పాటలను గానాబాలా రాసి పాడటం విశేషం అని దర్శకుడు పేర్కొన్నారు. -
భార్యకు నిప్పంటించిన భర్త
హైదరాబాద్: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను సజీవ దహనం చేశాడు. నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలోని గౌస్‌నగర్‌లో శనివారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. షబ్బీర్ అనే వ్యక్తి తన భార్య రెహనా బేగంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
అత్తింట్లో నరకం
తన లాయర్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక గోడు * అత్తామామ, భర్త కలసి తీవ్రంగా వేధించారు * అడుగడుగునా అవమానాలే.. * భర్త బలాదూర్‌గా తిరిగాడు.. నా డబ్బులన్నీ వాడుకున్నాడు * వివాహేతర సంబంధంపై ప్రశ్నిస్తే కొట్టేవాడు * పిల్లల్ని ఏనాడూ పట్టించుకోలేదు.. పాల డబ్బాలు కొనాలన్నా ఇబ్బందే * వంటగదికి తాళం వేసేవారు.. పస్తులు అలవాటైపోయాయి * భర్త కోసం త్యాగాలు చేయాలని రాజయ్య అనేవారు * ఆయన మాటలకు చచ్చిపోవాలనిపించేది సాక్షి, హన్మకొండ: ప్రేమ పేరుతో సారిక జీవితంలోకి ప్రవేశించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ అనుక్షణం ఆమెకు నరకాన్ని చూపించాడు. భర్తగా కష్టసుఖాల్లో తోడుండాల్సిన వ్యక్తి బాధ్యతలను గాలికొదిలి బలాదూర్‌గా తిరిగాడు. సారిక కష్టార్జితాన్ని ఇష్టారీతిగా వాడుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తప్పు దారిలో వెళ్తున్న కొడుకును మందలించాల్సిన తల్లిదండ్రులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. సూటిపోటి మాటలు, భౌతిక దాడులతో సారికకు అనుక్షణం నరకం చూపించారు. భర్త, అత్తమామాలు పెడుతున్న ఇబ్బందులను తన తరఫున న్యాయవాదికి, షాహిన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక పూసగుచ్చినట్టు వివరించింది. ఆ వివరాలివీ.. నా కొడుకును పెళ్లి చేసుకో.. అనిల్, నేను ఉద్యోగాలు తెచ్చుకుంటే మా వాళ్లను, అనిల్ కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నా. పెళ్లికి ముందు మా అత్తగారు మాధవి నన్ను తన కాలేజీకి (కేయూలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో) తీసుకెళ్లి మాయ మాటలు చెప్పింది. నన్ను మా అమ్మవాళ్ల ఇంట్లోంచి బయటకొచ్చి, వాళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది. చదువుకున్న వ్యక్తి, లెక్చరర్, మంచీచెడు అన్ని తెలిసిన పెద్దావిడ అని తల్లిలా భావించాను. ఆమె చెప్పినట్లే ఇంట్లోంచి వచ్చేసి అనిల్‌ను పెళ్లి చేసుకున్నా. ఆవిడ మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. ఘోరమైన తప్పుడు స్టెప్ వేశాను. ఒక తప్పుడు నిర్ణయంతో జీవితం ఎలా నాశనం చేసుకుంటామన్నదానికి నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా భర్త ఇంట్లో ప్రతీ క్షణం నన్ను అవమానించాడు. నా కష్టార్జితాన్ని వాడుకున్నారు. నన్ను, నా పిల్లలను పట్టించుకోలేదు. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ఆస్పత్రికి వెళ్లడం నాకో పెద్ద పరీక్ష. ఇంట్లో మూడు కార్లు ఉన్నా.. ఒక్కటీ తీసేవారు కాదు. చివరికి పాల డబ్బాలు, మందులు కొనడం కూడా ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో వంటగదికి తాళం వేసేవారు. వండిన వంటలో అడుగుకు మిగిలినవే నాకు నా బిడ్డలకు దక్కేవి. రెండోసారి గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లో అన్ని గదులకు తాళం వేసి నన్ను హాల్లోనే ఉంచేవారు. బాత్రూమ్కి వెళ్లడం కష్టంగా ఉండేది. బట్టలుతికే స్థలంలో స్నానం చేయాల్సి వచ్చేది. పెద్ద పొట్టతో హాల్లో నేను ఇబ్బంది పడుతుంటే ఇంట్లోకి వచ్చిన అత్తామామలు.. పెద్దవాళ్లు వచ్చినప్పుడు లేచి నిలబడాలని తెలియదా? అంటూ తిట్టేవాళ్లు. ఇద్దరు కవల పిల్లలు పుట్టాక పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పాలు, సెరిలాక్ డబ్బా కొనడానికి కూడా నేను ఇబ్బంది పడాల్సి వచ్చేది. పస్తులు కామన్ అయ్యాయి.. అనిల్‌తో 2006లో జరిగిన పెళ్లితో నా నరకప్రాయమైన జీవితం మొదలైంది. ఇంట్లో ఎవరూ నన్ను తిన్నావా? అని అడిగేవారు కాదు. అన్నానికి కూడా పిలిచేవారు కాదు. పస్తులు ఉండటం కామన్ అయిపోయింది. నా డబ్బులు రూ.20 లక్షలు, 10 తులాల బంగారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. మా అమ్మ వాళ్లతో మాట్లాడేప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయమనేవాడు. కాల్‌లాగ్ చెక్ చేసేవాడు. మీ చెల్లెలితో మాట్లాడావా.. అంతసేపు ఏం మాట్లాడావు? అంటూ ఆరా తీసేవాడు. ఇదీ అని చెబితే, నాకు చెప్పింది 5 నిమిషాలే కదా.. మిగతా 25 నిమిషాలు ఏమి మాట్లాడావని అడిగేవాడు. ఇలాంటివెన్నో భరించాను. ఎక్కడా ఎప్పుడు ఎవరితో చెప్పుకునేదాన్ని కాదు. మా అమ్మవాళ్లతో కూడా ఏమీ చెప్పలేదు. పెళ్లైనప్పట్నుంచీ అనిల్ ఇంతవరకు ఒక్క పని చేయలేదు. జాబ్ చేయమని ఎంతో నచ్చ చెప్పేదాన్ని. రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, ఇంటర్వ్యూ తేదీలు ఇలా ఏ టూ జడ్ పనులు చేసినా ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండేవాడు. మా అత్తమామలు తలచుకుంటే ఏదైనా మంచి బిజినెస్, జాబ్ పెట్టించి ఉండొచ్చు. కానీ ఏదీ చేయలేదు. 2007 నుంచి 2010 వరకు కలకత్తా, ముంబై, పుణేలో మూడేళ్లు జాబ్ చేశాను. ఆ సమయంలో ఏటీఎం అనిల్ దగ్గరే ఉండేది. సేవ్సింగ్స్ లేకుండా డబ్బులన్నీ వాడుకున్నాడు. 2010లో పుణేలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని. ముందుగా ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకున్నాడు. తప్పులను ప్రశ్నిస్తే చాలు.. నాపై చేయి చేసుకునేవాడు, ఒకసారి నా జుట్టు పట్టుకుని నన్ను విసిరేస్తే, మంచం చివర తగిలి పెద్ద గాయమైంది. అత్తామామకు ఈ విషయం చెబితే పట్టించుకోలేదు సరికదా అనిల్‌కే మద్దతుగా నిలిచారు. అత్త పచ్చి బూతులు తిట్టేది అత్త మాధవి ఈసడింపు మాటలు, బూతులు, చిన్నదానికీ పెద్ద దానికీ వంకలు పెడుతూ తిట్టేది. చీటికీమాటికీ ‘నా మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నావు. బయటకు పంపేస్తాను. గేట్ బయట నించోని మాట్లాడు. పచ్చి బూతులు తిట్టేది. మా మామయ్య, నా భర్త ఏనాడూ ఆవిడను అడ్డుకునేవారు కాదు. ఒకసారి మా అమ్మ నాకు చీర పెట్టింది. ఆ చీర చూసి, నానా రభస చేసి ‘ఎవడేమీ ఇచ్చినా ఇలాగే తీసుకో’ అంటూ ద్వంద్వార్థాలతో మాట్లాడింది. ‘ఇప్పటికిప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అంటూ నాపైకి వచ్చేసి, వస్తువులు మీదకు విసిరేసి, చేయి చేసుకుని ఇంట్లోంచి గెంటేసింది. నాలుగు జతల బట్టలు తీసుకుని వెక్కివెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. అనిల్ కూడా వాళ్లమ్మకే వంత పాడేవాడు. త్యాగం చేయాలన్న మామ కుటుంబ పెద్దగా మామయ్య సిరిసిల్ల రాజయ్య ఏనాడూ నాకు అండగా నిలవలేదు. ‘‘ఎంతో మంది మహిళలు భర్త కోసం, భర్త కుటుంబం కోసం త్యాగాలు చేస్తున్నారు. నువ్వు కూడా త్యాగం చేయాలి’’ అని అనేవాడు. పనివాళ్లు, పార్టీ కార్యకర్తల ముందే ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా తిట్టేవాడు. దీంతో పైప్రాణం పైనే పోయేది. ఆ మాటలకు ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది. మామయ్య నా పేరు మీద నా అకౌంట్లో రూ.8 లక్షలతో కార్ లోను తీసుకున్నాడు. చేతిఖర్చులకు నా డబ్బులు వాడుకునేవాడు. -
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
-
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక... తన తరఫు న్యాయవాది రెహానాకు 22 పేజీల ఈ మెయిల్ పంపింది. తనను మానసికంగా, శారీరకంగా హింసలను భరిస్తున్నానంటూ ఆమె ఈ మెయిల్లో పేర్కొంది. భర్త అనిల్ వ్యవహారాన్ని సారిక పూసగుచ్చినట్లు మెయిల్లో వివరించింది. ఈ మెయిల్ సారాంశం..ఇదే... 'ఇల్లు విడిచి వెళ్లాలంటూ పదే పదే అత్త, భర్త వేధించేవారు. తిట్లు అరుపులు, కేకలతో రోజు అత్త విరుచుకుపడేది. నా తల్లి ఇచ్చిన చీరను కూడా తీసుకోనివ్వలేదు. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. ఇంట్లో పనివాళ్లు, పరిచయస్తుల ముందే తిట్టేవారు. అనిల్‌కు వివాహేతర సంబంధాలున్నాయి. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వెళ్లిపోతాడో తెలియదు. కుటుంబం పట్ల కనీస బాధ్యత లేదు. ఎక్కడకు వెళ్లావని అడిగితే చాలు..భౌతిక దాడులకు దిగేవాడు. ఇంత జరుగుతున్నా...అత్తమామలు పట్టించుకునే వాళ్లు కాదు. వండుకోవడానికి కనీసం సరుకులు కూడా అనిల్ తెచ్చేవాడు కాదు. నేను, పిల్లలు చాలాసార్లు ఆకలితో అలమటించాం. పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి బిల్లులు కట్టేవాడు కాదు. నా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లలతో మాట్లాడేందుకు అనిల్ ఒప్పుకునేవాడు కాదు. నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపిద్దామా? అన్నదే అత్త, మామల ఆలోచన. పిల్లలు నేను హాల్లోనే ఉండేవాళ్లం. నిరంతరం వేధింపులకు గురి చేసేవారు. ఏమైనా అడిగితే ఇంటి నుంచి వెళ్లిపో అనేవారు. జీవితాన్ని త్యాగం చేయాలంటూ రాజయ్య కూడా అనేవారు. చాలామంది మహిళలు... భర్తలు, అత్తమామల కోసం జీవితాలను త్యాగం చేశారని రాజయ్య చెప్పేవారు. రాజయ్య మాటలకు చాలాసార్లు బాధపడ్డా. జీవితాన్ని ఇప్పటితో ముగించాలన్న ఆలోచన అనేకసార్లు వచ్చేది. ఈ షాక్, ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టేది.' అని సారిక పేర్కొంది. -
ఆత్మహత్య కాదు...కచ్చితంగా హత్యే: రెహానా
హైదరాబాద్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆమె తరఫు న్యాయవాది రెహానా అన్నారు. భర్త అనిల్, అత్తమామలపై ఆమె 2014లో గృహహింస చట్టం కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే. సారిక తరఫున న్యాయవాది రెహానా వాదిస్తున్నారు. సారిక అనుమానాస్పద మృతిపై రెహానా గురువారమిక్కడ మాట్లాడుతూ 'పనిమనిషిగా చూస్తున్నారని సారిక నాకు చాలాసార్లు చెప్పింది. కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని నా దగ్గర చాలాసార్లు ఏడ్చింది. అనిల్-సనా అక్రమ సంబంధం గురించి చెప్తూ బాధపడింది. నెల రోజుల క్రితం సారిక నాతో ఫోన్లో మాట్లాడింది. 15 రోజుల క్రితం వచ్చి వ్యక్తిగతంగా కలిసింది. చివరిసారి కలిసినప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎలాగైనా న్యాయం చేయాలని విలపించింది. కోడలి సంపాదనను కూడా రాజయ్య ఇన్‌కంట్యాక్స్‌లో చూపించారు' అని తెలిపారు. -
'ఆత్మహత్య కాదు..కచ్చితంగా హత్యే'
-
వినసొంపుగానే కాదు... కనువిందుగా కూడా...!
‘‘ఈ చిత్రం పాటలు నాకు ప్రత్యేకం. ఎందుకంటే దాదాపు ఎనభై శాతం సినిమా పాటలతోనే సాగుతుంది. పాటలన్నీ బాగున్నాయి. ఆ ఘనత సంగీతదర్శకుడు మిక్కీ జె.మేయర్‌కి దక్కుతుంది. వినసొంపుగా ఉన్న ఈ పాటలు కనువిందు చేస్తాయి’’ అని హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మించిన చిత్రం ‘చక్కిలిగింత’. సుమంత్ అశ్విన్, రెహానా జంటగా నటించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని పాత్రికేయుల సమావేశంలో వేమారెడ్డి చెబుతూ - ‘‘ఈ చిత్రానికి పాటలు స్వరపరచాలని మిక్కీని కోరిప్పుడు కథ నచ్చితేనే అన్నారు. కథ విన్న తర్వాత ఒప్పుకున్నారు. మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. వేమారెడ్డితో సినిమా చేయడం ఆనందంగా ఉందనీ, సుమంత్, రెహానా కెమిస్ట్రీ అందరికీ నచ్చుతుందని మిక్కీ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రానికి కాగితం, కలమే నిజమైన నిర్మాతలు. ఆ రెండూ ఎవరో కాదు.. మా వేమారెడ్డి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. -
బీఎస్పీ ఎమ్మెల్యే భార్య హత్య
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ బీఎస్పీ ఎమ్మెల్యే హాజీ అలీం భార్య రెహానా(40) దారుణ హత్యకు గురయ్యారు. ఈశాన్య ఢిల్లీ న్యూ జఫ్రాబాద్‌లోని సొంతింట్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఆమె ఛాతీలో ఐదు కత్తిపోట్లు, తూటా గాయం కనిపించాయి. పనిమనిషి ఉదయం రెహానా ఇంటికెళ్లగా నెత్తుటి మడుగులో ఆమె మృతదేహం కనిపించింది. ఆ వెంటనే ఆమె పోలీసులకు సమాచారమందించడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలీమ్ ప్రస్తుతం హజ్ యాత్రలో ఉన్నారు. రెహానా ఆయన రెండో భార్య అని, ఇంట్లో ఒంటరిగా నివసిస్తోందని పోలీసులు చెప్పారు. ఇంట్లో దోపిడీ జరిగినట్లు తప్పుదారి పట్టించడానికి దుండగులు వస్తువులను చిందరవందర చేశారని తెలిపారు. తెలిసిన వ్యక్తులెవరో ఇంట్లోకి వచ్చినట్లు ఆధారాలు లభించాయన్నారు. వ్యక్తిగత, రాజకీయ కక్ష్యలతోనే రెహానాను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, అలీమ్, ఆయన సోదరుడిపై ఓ అత్యాచార కేసులో నాన్ బెయిలబుల్ వారంటు ఉంది. సర్కస్ కంపెనీ నడుపుతున్న వీరు సర్కస్‌లో బాలకార్మికులను పెట్టుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.