
తిరువనంతపురం : అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను అరెస్టు చేయడంలో ఆలస్యం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముందస్తు బెయిల్ కోసం ఫాతిమా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ రెహనాను అరెస్టు చేయడంలో అధికారి విఫలమయ్యారని తిరువల్లాకు చెందిన న్యాయవాది ఏవీ అరుణ్ బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా రెహనా ఫాతిమా మంచం మీద అర్థనగ్నంగా చిన్నపిల్లలతో తన శరీరంపై పెయింటింగ్ వేయించుకోవడమే కాకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. చిన్నపిల్లలతో అర్థనగ్నంగా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. (అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం)
పిటిషనర్ మాట్లాడుతూ.. జూన్ 25న రెహానాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడంలో విఫలమయ్యారన్నారు. నిందితురాలిని అరెస్టు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న దర్యాప్తు అధికారిని మార్చాలని దర్యాప్తును అసిస్టెంట్ కమిషనర్‌కు అప్పగించాలని కోర్టును షిటిషనర్ కోరారు. తన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన 10 నిమిషాల్లోనే న్యాయవ్యవస్థను విమర్శిస్తూ ఫాతిమా ఓ వీడియోను అప్‌లోడ్ చేసిందని పిటిషనర్ ఆరోపించారు. ఆమె తన వీడియోలో మొత్తం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నట్లు కనిపింస్తోందని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉంది. (ఇల్లు ఖాళీ చెయ్)
Comments
Please login to add a commentAdd a comment