వినసొంపుగానే కాదు... కనువిందుగా కూడా...! | Telugu New Movie Chakkiligintha Team Press Meet | Sakshi
Sakshi News home page

వినసొంపుగానే కాదు... కనువిందుగా కూడా...!

Published Sun, Nov 23 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

వినసొంపుగానే కాదు... కనువిందుగా కూడా...!

వినసొంపుగానే కాదు... కనువిందుగా కూడా...!

‘‘ఈ చిత్రం పాటలు నాకు ప్రత్యేకం. ఎందుకంటే దాదాపు ఎనభై శాతం సినిమా పాటలతోనే సాగుతుంది. పాటలన్నీ బాగున్నాయి. ఆ ఘనత సంగీతదర్శకుడు మిక్కీ జె.మేయర్‌కి దక్కుతుంది. వినసొంపుగా ఉన్న ఈ పాటలు కనువిందు చేస్తాయి’’ అని హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మించిన చిత్రం ‘చక్కిలిగింత’. సుమంత్ అశ్విన్, రెహానా జంటగా నటించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలయ్యాయి.
 
 ఈ పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని పాత్రికేయుల సమావేశంలో వేమారెడ్డి చెబుతూ - ‘‘ఈ చిత్రానికి పాటలు స్వరపరచాలని మిక్కీని కోరిప్పుడు కథ నచ్చితేనే అన్నారు. కథ విన్న తర్వాత ఒప్పుకున్నారు. మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. వేమారెడ్డితో సినిమా చేయడం ఆనందంగా ఉందనీ, సుమంత్, రెహానా కెమిస్ట్రీ అందరికీ నచ్చుతుందని మిక్కీ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రానికి కాగితం, కలమే నిజమైన నిర్మాతలు. ఆ రెండూ ఎవరో కాదు.. మా వేమారెడ్డి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement