మాస్‌... క్లాస్‌ అని ఆలోచించను: సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ | Music director Mickey J Mayor About Mr Bachchan | Sakshi
Sakshi News home page

మాస్‌... క్లాస్‌ అని ఆలోచించను: సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌

Aug 18 2024 12:33 AM | Updated on Aug 18 2024 12:33 AM

Music director Mickey J Mayor About Mr Bachchan

‘‘ఏ సినిమాలో అయినా కథని బట్టే పాటలు ఉంటాయి. ప్రత్యేకించి మాస్, క్లాస్‌ అని నేను ఆలోచించను. ‘మిస్టర్‌ బచ్చన్‌’లో మాస్‌ సాంగ్స్‌ చేసే చాన్స్‌ దక్కింది. ఈ పాటలివ్వడం నాకేం షాకింగ్‌గా లేదు. ఎందుకంటే నేను మాస్‌ సాంగ్స్‌ చేయగలనని నాకు తెలుసు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ సంగీతానికి మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది’’ అని సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ అన్నారు. రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ ఈ నెల 15న విడుదలైంది.

ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ మాట్లాడుతూ– ‘‘నా భార్య, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటాను. డైరెక్టర్స్‌ కథని ఫోన్‌లో లేదా జూమ్‌ కాల్స్‌లో వినిపిస్తారు. కథ విని ట్యూన్స్‌ ఇస్తాను. అయితే నేపథ్య సంగీతం మాత్రం ఇండియాకి వచ్చి చేస్తాను. నేనెప్పుడూ డైరెక్టర్‌తో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కూర్చోలేదు. కానీ, ‘మిస్టర్‌ బచ్చన్‌’ కోసం హరీష్‌గారు సియాటిల్‌ వచ్చారు. కేవలం నాలుగు రోజుల్లో ఈ సినిమా ట్యూన్స్‌ పూర్తి చేశాం. నేను అమెరికాలో కాకుండా ఇండియాలో ఉంటే మరిన్ని సినిమాలు చేసే చాన్స్‌ ఉండేది. కానీ, ఫ్యామిలీకి కూడాప్రాధాన్యత ఇస్తాను.. అందుకే అమెరికాలో ఉంటున్నాను. ప్రస్తుతం మూడుప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement