⇒ ఉత్తర భారతదేశంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఉంటుంది. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. ఈ సినిమాలో హీరో బచ్చన్ పాత్రలో నిజాయితీ ఉన్న హీరోయిజమ్ ఉంటుంది. 1980లో లక్షల రూపాయలంటే పెద్ద మొత్తం. అంత మొత్తం లంచం రూపంలో వస్తుందన్నా కూడా ఓ అధికారి ఒప్పుకోలేదు.. లొంగలేదు. నాకు ఈ పాయింట్ నచ్చింది. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ జీవితంలో ప్రేమ, ఫ్యామిలీ, రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించి రవితేజగారి క్యారెక్టర్‌ను డిజైన్ చేశాను.
ప్రేక్షకులు బాగా ఎంటర్‌టైన్ అవుతారు. హిందీ ‘రైడ్’కు, ‘మిస్టర్ బచ్చన్’కు...అజయ్ దేవగన్‌కు, రవితేజకు మధ్య ఉన్నంత తేడా ఉంది. ‘రైడ్’లో అజయ్ దేవగన్ రోల్ సెటిల్డ్‌గా ఉంటే... ‘మిస్టర్ బచ్చన్’లో రవితేజగారి రోల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఉంటుంది. ఇక ఈ కథకు ఓ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవడం జరిగింది. జిక్కీ పాత్రలో ఆమె ప్రేక్షకులను మెప్పిస్తారు. జగపతిబాబుగారు ఎంపీ పాత్రలో కనిపిస్తాను.
⇒నేను సినిమా చూడని రోజులు ఉన్నాయేమో కానీ పాటలు వినకుండా ఉన్న రోజులు లేవు. ఓ సినిమా దర్శకుడిగా నేను విఫలం అయ్యానేమో కానీ... సంగీతం విషయంలో కాదు. నా ఫ్లాప్ మూవీ ‘షాక్’లోని ‘మధురం..’ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. ట్యూన్స్ సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల లిరికల్ వీడియోలు లేట్‌గా విడుదల అవుతున్న రోజులివి. అలాంటిది వారం రోజుల్లో నాలుగు ట్యూన్స్ ఇచ్చారు మిక్కీ జే మేయర్. ఆయన చాలా ప్రతిభావంతుడు. మాస్ సాంగ్స్ చేయలేదు అంటే ఆయనకు రాక కాదు... చాన్స్ రాలేదు అంతే.
⇒ చలం, యండమూరిగార్ల నవలలు చదివి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సాహిత్యంలో మంచి పట్టు ఉంది నాకు. అలాంటి నేను ‘షాక్’ సినిమా తీస్తే మూడేళ్లు ఆడియన్స్ నన్ను షాక్‌లో ఉంచారు. ఆ వెంటనే ‘మిరపకాయ్’ సినిమా తీశాను. ఇక ‘ఇడియట్, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి సినిమాలు చేసిన రవితేజగారు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని అప్పట్లో ‘నా ఆటోగ్రాఫ్..’, ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు, ఈగల్’ సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కలేదు.
కానీ ‘ధమాకా’ అంటే హిట్ ఇచ్చారు. అందుకే ‘మిస్టర్ బచ్చన్’లో పాత రవితేజనే కొత్తగా చూపిస్తున్నాం. నిర్మాత విశ్వప్రసాద్ గారు లేకపోతే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చేది కాదు. ఆగస్టు 15న రిలీజ్ చేసేవాళ్లం కాదు. ఆడియన్స్‌కు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ‘మిస్టర్ బచ్చన్’ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment