ప్రస్తుతం మాస్ మహారాజ ఫోకస్ అంతా మిస్టర్ బచ్చన్ మీదే ఉంది. ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ ఎంతగా కష్టపడుతున్నాడనేది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెప్తూనే ఉన్నాడు హరీష్. హీరోకు మెడనొప్పి ఉన్నా సరే షూటింగ్‌కు డుమ్మా కొట్టకుండా సెట్‌కు వచ్చాడంటూ ఓ ఫోటో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఇటీవల సినిమా నుంచి టీజర్, ట్రైలర్‌కు బదులుగా షో రీల్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా హరీష్.. ఎక్స్(ట్విటర్)లో రవితేజ ఫోటో షేర్ చేశాడు. 'ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకు తప్ప! కశ్మీర్ లోయలో షూటింగ్ బాగా జరిగింది. త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన రవితేజ.. 'ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా' ఉంది అని ఫన్నీగా స్పందించాడు.
ఈ సినిమాలో హీరో.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు పెద్ద అభిమాని. అందుకు సంకేతంగానే టైటిల్ మిస్టర్ బచ్చన్ అని పెట్టారు. 2019లో హిందీలో వచ్చిన అజయ్ దేవ్‌గణ్ 'రైడ్' సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Over cheyaku roiiiii ..
Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP— Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024
చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment