మాస్‌ బచ్చన్‌ | Raviteja Mister Bachchan ShowReel Out | Sakshi
Sakshi News home page

మాస్‌ బచ్చన్‌

Published Tue, Jun 18 2024 1:41 AM | Last Updated on Tue, Jun 18 2024 1:41 AM

Raviteja Mister Bachchan ShowReel Out

శత్రువులు చుట్టుముట్టారు... అయినా బచ్చన్‌ కంగారుపడలేదు. కంగారు అంటే ఏంటో అతనికి తెలియదు. ధైర్యానికి చిరునామా లాంటివాడు. వచ్చినవాళ్లను వచ్చినట్లు ఇరగదీశాడు బచ్చన్‌. ఏ రేంజ్‌లో రఫ్ఫాడించాడో తెలియాలంటే ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం చూడాల్సిందే. రవితేజ టైటిల్‌ రోల్‌లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షో రీల్‌ వీడియోను సోమవారం విడుదల చేశారు.

ఈ వీడియోలో రవితేజ చేసిన మాస్‌ ఫైట్, ఆగ్రహంతో జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌ని రవితేజ అనుకరించడం తదితర విజువల్స్‌ కనిపించాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: అయాంకా బోస్, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement