హీరోయిన్‌కు లేని ఇబ్బంది మీకెందుకు: హరీశ్‌ శంకర్‌ | Harish Shankar React On Age Gap Comments | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు లేని ఇబ్బంది మీకెందుకు: హరీశ్‌ శంకర్‌

Published Wed, Aug 7 2024 6:34 PM | Last Updated on Wed, Aug 7 2024 7:33 PM

Harish Shankar React On Age Gap Comments

సినిమా పరిశ్రమలో మనం ఎక్కువగా వినే మాట ఏజ్‌ గ్యాప్‌.. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం కనిపిస్తే చాలు ఒక్కోసారి ట్రోల్స్‌ కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో  ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఇందులో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. అయితే, వీరిద్దరితో తెరకెక్కిన ఒక సాంగ్‌ను కొద్దిరోజుల క్రితం మేకర్స్‌ విడుదల చేశారు. అందులో వారిద్దరి మధ్య  ఏజ్‌ గ్యాప్‌ క్లియర్‌గా కనిపిస్తుందని నెటిజన్లు ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే, తాజాగా చిత్ర డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాలో రవితేజ-  భాగ్య శ్రీ బోర్సే కేవలం నటిస్తున్నారని  ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఏజ్‌ గ్యాప్‌ అనేది ఈ సినిమాలో మాత్రమే జరగడంలేదు. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఒక యాక్టర్‌ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించరు. సినిమా కోసం ఒక్కోసారి 25 ఏళ్ల వయసు ఉన్న యువతి కూడా 50 ఏళ్లు ఉన్నట్లుగా కనిపించాల్సి ఉంటుంది. దీనినే స్క్రీన్‌ ఏజ్‌ అంటారని హరీశ్‌ శంకర్‌ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్‌, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించి సూపర్‌ హిట్స్‌ అందుకున్నారని ఆయన గుర్తు చేశారు. రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా చిత్రాన్ని కూడా ఓ ఉదాహరణగా హరీశ్‌ చెప్పారు.

‘మిస్టర్‌ బచ్చన్‌’లో రవితేజ సరసన నటించేందుకు హీరోయిన్‍కు ఎలాంటి సమస్య లేదు. ఆమెకు అడ్డురాని ఏజ్‌ గ్యాప్‌ మీకెందుకు అంటూ నెటిజన్ల తీరును తప్పుపట్టారు. ఈ విషయంలో హీరోయిన్‌కు సమస్య లేదు. కానీ ట్రోలర్స్‌కు వచ్చిన  బాధ ఏంటో తనకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు. ఏజ్ గ్యాప్ గురించి ఆమెకు (భాగ్యశ్రీ) ఎలాంటి సమస్య లేదు. ఇంతటితో ఇలాంటి కామెంట్లు ఆపేస్తే మంచిదని హరీశ్‌ తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమా  ఆగస్టు 15న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement