
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' పాటతో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది ముమైత్ ఖాన్ (Mumaith Khan).. ఐటం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యూటీ తర్వాత సడన్‌గా వెండితెరకు దూరమైంది. బిగ్‌బాస్ షోలో పాల్గొని మళ్లీ మాయమైపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విలైక్ అనే అకాడమీని స్థాపించింది. దీని ద్వారా మేకప్‌కు సంబంధించిన కోర్సులను నేర్పిస్తోంది. తాజాగా ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు గేమ్ షోలో పాల్గొంది.
బ్యాంకాక్‌లో స్టంట్ షో..
ఈ సందర్భంగా హోస్ట్ తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. ముమైత్ ఎంత బాధ అనుభవించిందో నాకు తెలుసు. తన మెదడులో ఏడెనిమిది వైర్లున్నాయి అని పేర్కొంది. అందుకు ముమైత్ మాట్లాడుతూ.. షూ లేస్ కట్టుకోవడం కూడా ప్రమాదకరం అని డాక్టర్ చెప్పారు. అయినా నేను బ్యాంకాక్‌కు స్టంట్ షో చేయడానికి వచ్చాను. అప్పుడే నేను స్వప్నదత్‌కు చెప్పాను.. రేపు ఉదయం నేను లేవకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమన్నాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. నా హెల్త్ కండీషన్‌ను అర్థం చేసుకోవడానికి రెండేళ్లు పట్టింది అని ముమైత్ చెప్పుకొచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
ముమైత్ ఖాన్.. ఓ రోజు తన ఇంట్లోనే కాలు జారి కింద పడింది. ఆ సమయంలో తన తల.. మంచం అంచులకు బలంగా తగిలింది. పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేదు. కానీ తల నొప్పి తీవ్రమవడంతో ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమెకు మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజులపాటు ముమైత్ కోమాలో ఉంది. ఆ తర్వాత ఆమె ఆ గాయం నుంచి కోలుకుంది.
చదవండి: పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?