Bigg Boss Non-Stop Buzz: బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుకి సాగుతుంది. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్‌బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ఓటీటీలో తొలి ఎలిమినేషన్ చోటుచేసుకుంది.
చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వారం వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి బిగ్‌బాస్ హౌజ్‌ను వీడింది. 24/7 డిస్నీ హాట్ స్టార్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న బిగ్‌బాస్ అన్ని సీజన్ల మాదిరిగానే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ బజ్‌ను షోను కూడా నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా ఎలిమినేట్ అయిన సభ్యులు మిగతా కంటెస్టెంట్స్‌పై ఉన్న తమ అభిప్రాయాన్ని చెప్పుకొవచ్చు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో యాంకర్ రవి ఈ షోకు హోస్ట్‌గా కనిపించాడు. ఈ సందర్భంగా రవితో కలిసి బిగ్‌బాస్ హౌజ్ ముచ్చట్లు చెప్పిన ముమైత్ మిగతా కంటెస్టెంట్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చదవండి: ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం ఏకంగా థియేటర్‌నే కొనేశారు!
బిందు మాధవిని నాగినితో పోల్చింది. ఇక తన తర్వాత హౌజ్‌ను వీడేది ఎవరని అడగ్గా.. ఆర్జే చైతూ అంటూ ధీమాగా సమాధానం ఇచ్చింది. ఇలా రవి.. ముమైత్ మనసులోని మాటలను ఎలా బయట పెట్టించాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో యాంకర్ రవి సందడి చేయనున్నాడంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలయ్యాక రవి కనిపించకపోవడంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందారు. చివరికి కంటెస్టెంట్‌గా కాకుండా హోస్ట్‌గా రవికి బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చిందని తెలిసి అతడి ఫాలోవర్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment