వినూత్న ప్రేమకథతో.. | IBM Production House First Film to Launch with a Unique Love Story | Sakshi
Sakshi News home page

వినూత్న ప్రేమకథతో..

Published Wed, Apr 30 2025 5:02 PM | Last Updated on Wed, Apr 30 2025 5:11 PM

IBM Production House First Film to Launch with a Unique Love Story

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తమ తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరలక్ష్మీ పప్పుల సమక్షంలో, కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో, దర్శకుడు భాను రూపొందించిన ఈ చిత్రం ఒక సరికొత్త ప్రేమకథతో యువతను ఆకట్టుకోనుంది. సామాజిక స్పృహ, సందేశాత్మక చిత్రాలకు పేరుగాంచిన భాను, మొదటిసారి స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 
49 రోజుల నాన్‌స్టాప్ షూటింగ్‌తో పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

జూన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువతను విపరీతంగా ఆకట్టుకునే ఐదు అద్భుతమైన సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక పెద్ద సంగీత కుటుంభం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు, అలాగే ఒక కొత్త టాలెంటెడ్ రైటర్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. డెబ్భై ఐదు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ గా చేసిన ఒక అబ్బాయి, పదహారణాల తెలుగు అమ్మాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి నిర్వాహణ మర్రి రవికుమార్. ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ సంస్థ లో నిర్మాత కనకదుర్గారావు పప్పుల ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను యూనిట్ సభ్యులు విడుదల చేయబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement