ఆగస్టు 15 వీకెండ్‌లో రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. మరీ ముఖ్యంగా దర్శకుడు హరీశ్ శంకర్‍పై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. రిలీజ్‌కి ముందు మాట్లాడిన దానికి.. మూవీలో కంటెంట్‌కి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్ మీట్ పెట్టిన హరీశ్ శంకర్.. తనపై ట్రోల్స్ గురించి స్పందించాడు.
(ఇదీ చదవండి: సూర్య vs రజినీకాంత్.. కలెక్షన్స్ దెబ్బ తీసే పోటీ!)
రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల దర్శకులపై లేని అటాక్ తనపైనే జరుగుతోందని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు. కావాలనే టార్గెట్ చేసి మరీ తనని విమర్శిస్తున్నారని అన్నాడు. 'ఇంతకు ముందొచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ, రావణాసుర, ఖిలాడి, ఈగల్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కానీ ఆ డైరెక్టర్స్ మీద లేని అటాక్ నా ఒక్కడి మీదే ఉంది. ఎందుకంటే వ్యక్తిగత అజెండాతో నన్ను టార్గెట్ చేశారని నాకు అనిపిస్తోంది' అని హరీశ్ శంకర్ అన్నాడు.
అయితే హరీశ్ శంకర్ తాజా కామెంట్స్‌పై కూడా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మిగతా దర్శకులు ఇలా రిలీజ్‌కి ఇంటర్వ్యూల్లో మాట్లాడలేదని, వాళ్లెవరు రీమేక్స్ చేయలేదని తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా హరీశ్ శంకర్.. తాను తీసిన సినిమా కంటే చేస్తున్న వ‍్యాఖ్యల వల్లే వైరల్ అవుతుండటం ఇక్కడ విచిత్రమైన విషయం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment