స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం ఎప్పటినుంచి ఉన్నదే. సంక్రాంతి టైంలో అయితే ముగ్గురు, నలుగురు హీరోలు కూడా తమ తమ మూవీస్‍ని బరిలో దింపుతుంటారు. కానీ ఇప్పుడు మాత్రం తమిళ ఇండస్ట్రీలో అలాంటి ఓ పోటీకే సూర్య, రజినీకాంత్ సిద్ధమయ్యారు కానీ ఇది సదరు చిత్ర పరిశ్రమకి ప్లస్ కావడం కంటే మైనస్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి.
రీజనల్ సినిమాల మధ్య పోటీ ఉన్న పెద్ద పోయేదేం లేదు. కానీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేద్దామని అనుకున్నప్పుడు సోలో రిలీజ్ డేట్స్ చూసుకోవడం ఉత్తమం. ఇప్పుడు సూర్య 'కంగువ', రజినీకాంత్ 'వేట్టాయాన్' సినిమాల రిలీజ్ డేట్స్ చూస్తుంటే అయోమయంగా ఉంది. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ 'కంగువ'. రూ.1000 కోట్ల వసూళ్లు దాటేస్తాం అని నిర్మాత ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలోనే దసరా కానుకగా అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తున్నట్లు చెప్పారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
అదే తేదీకి రజినీకాంత్ 'వేట్టాయాన్' కూడా రిలీజ్ అవుతుందని తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. సూర్య నుంచి మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. కాబట్టి అంచనాలు గట్టిగానే ఉంటాయి. మరోవైపు రజినీకాంత్ మూవీ అంటే నేషనల్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు కాబట్టి హిందీ రిలీజ్ కూడా పక్కా. కాబట్టి ఒకేరోజున ఇద్దరికీ వసూళ్ల పరంగా దెబ్బపడే అవకాశముంది.
తెలుగులో పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కానీ దాదాపుగా సోలో గానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంలో వేరే సినిమాలు ఏమైనా ఉన్నా సరే పోటీ నుంచి తప్పుకొంటున్నారు. ఇదే పద్ధతి తమిళ దర్శకనిర్మాతలు కాస్త ఆలోచిస్తే మంచిది. లేదంటే ఇండస్ట్రీకి మైనస్ అయ్యే ఛాన్సులే ఎక్కువ!
(ఇదీ చదవండి: ప్రభాస్ లేకుండా 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment