డార్లింగ్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ ఎక్కడికో వెళ్లిపోతోంది. రీసెంట్‌గా 'కల్కి'తో ఇంటర్నేషనల్ రేంజుకి చేరుకున్న ఈ హీరోని ఇప్పటికే చాలామంది ప్రశంసించారు. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సభలో మాట్లాడుతూ ప్రభాస్‌ని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్ లేకపోతే 'బాహుబలి' సినిమా లేదనే కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: కోల్‌కతా బాధితురాలిపై అసభ్యకర పోస్టులు.. మంచు మనోజ్ ఆగ్రహం)
క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇందులోనే పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్టం రాజు అని చెప్పారు. అలానే హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన 'బాహుబలి' సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేమని పొగడ్తలు కురిపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కానీ ప్రభాస్ రేంజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే వెళ్లింది. 'సలార్', 'కల్కి' హిట్టవడంతో అది మరింత పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలానే రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ లైన్లో ఉన్నాయి.
(ఇదీ చదవండి: పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్)
Telangana Chief Minister about Telangana king👑#Prabhas pic.twitter.com/0U1Gsz071F
— Prabhas Trends (@TrendsPrabhas) August 18, 2024
Comments
Please login to add a commentAdd a comment