కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన దారుణం గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఆమెకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొందరు ఆకతాయిలు.. సదరు బాధితురాలిని ఉద్దేశించి చెప్పుకోలేని విధంగా అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు వీటిపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
(ఇదీ చదవండి: పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్)
'జన్మనిచ్చిన మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవ్వడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. స్క్రీన్ వెనకాల ఉండి దారుణమైన పోస్టులు చేస్తున్న వారిని గుర్తించి శిక్షించడంలో విఫలమయ్యాం. కోల్‌కతా ఘటనలో బాధితురాలిని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంస్కృతిని నార్మలైజ్ చేయకుండా జవాబుదారీగా నిలబడాలని కోరుతున్నా' అని మనోజ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఏం జరిగిందంటే? కోల్‌కతాలోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో రాత్రి పూట విధుల్లో ఉన్న 31 ఏళ్లట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హతమార్చారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. తొలుత ఈ ఘటనని ఆత్మహత్య అనుకున్నారు. కానీ యువతి శరీరంపై దాడి చేసిన గుర్తులు ఉండగా పోస్టు మార్టం చేయగా రిపోర్టులో ఆమెపై సాముహిక అత్యాచారం జరిగిందని విషయం బయటపడింది.
(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)
Comments
Please login to add a commentAdd a comment