డైరెక్టర్ హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' విడుదలకు ముందే ఇచ్చిన హైప్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, తాజాగా సినిమా చూసిన ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. సినిమా బాగాలేదంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అయినప్పటికీ రవితేజ్ ఇమేజ్‌తో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి. కానీ, సినిమా చూసిన ప్రేక్షకులు, రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఘూటుగానే విమర్శలు చేస్తున్నారు. కొంతమంది సినిమా పర్వాలేదు అంటున్నప్పటికీ మరికొంతమంది మాత్రం మిస్టర్ బచ్చన్ పెద్ద రాడ్ సినిమా అంటూ ఫైర్ అవుతున్నారు.
తమ అభిమాన హీరో నటించిన సినిమాను విడుదలరోజే చూడాలంటే ఎవరైనా సరే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫస్ట్ చాయిస్‌గా పెట్టుకుంటారు. అయితే, తాజాగా అక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన రవితేజ అభిమాని ఒకరు దర్శకుడు హరీశ్ శంకర్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మిస్టర్ బచ్చన్ సినిమా బాగాలేదంటూ మీడియా వారితో తెలిపాడు. దర్శకుడు హరీశ్ శంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి వస్తే అభిమానులు చితక్కొడుతారని కామెంట్ చేశాడు. సినిమాలో విషయం ఉన్నా.. డైరెక్షన్ విభాగంలో లోపాలు ఉన్నాయని రవితేజ అభిమాని చెప్పుకొచ్చాడు. కేవలం హీరోయిన్‌తో పాటల కోసమే సినిమా తీశారేమో అనిపించేలా మిస్టర్ బచ్చన్ ఉందని కామెంట్ చేశాడు. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న దర్శకుడు ఇంత చెత్త సినిమా తీయడమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. హరీశ్ శంకర్ గారు.. దయచేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు రాకండి అంటూ వారు కామెంట్ చేశారు.
అందమైన హీరోయిన్ పెట్టి రవితేజ సినిమాను నడిపించేద్దామని డైరెక్టర్ అనుకున్నారేమో అనే అభిప్రాయం నెటిజన్లలో వస్తుంది. ఇలాంటి సినిమాలు తీసి అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారనే కామెంట్లు వస్తున్నాయి. తమ డబ్బు రీఫండ్ చేస్తారా సార్ అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment