Harish Sankar
-
'మొక్కల్నే అంత జాగ్రత్తగా చూసుకుంటే.. మొగున్ని అయితే'.. ఆసక్తిగా టీజర్
సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. ఈ మూవీకి ఆనంద్ గుర్రం దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.హరీష్ శంకర్ మాట్లాడుతూ..' టీజర్ చూస్తుంటే సినిమాని చాలా సహజంగా చిత్రీకరించారని తెలుస్తోంది. టీజర్ చాలా చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. మంచి డైలాగ్స్ ఉన్నాయి . మొక్కల్నే అంత మంచిగా చూసుకుంటే మొగున్ని ఇంకెంత మంచిగా చూసుకుంటుంది అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది' అంటూ ఆయన అభినందించారు . ఈ చిత్రంలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ ఆ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ సెప్టెంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. -
హరీశ్ శంకర్.. ఇటువైపు రాకండి అంటూ వార్నింగ్ ఇచ్చిన అభిమాని
డైరెక్టర్ హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' విడుదలకు ముందే ఇచ్చిన హైప్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, తాజాగా సినిమా చూసిన ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. సినిమా బాగాలేదంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అయినప్పటికీ రవితేజ్ ఇమేజ్‌తో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి. కానీ, సినిమా చూసిన ప్రేక్షకులు, రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఘూటుగానే విమర్శలు చేస్తున్నారు. కొంతమంది సినిమా పర్వాలేదు అంటున్నప్పటికీ మరికొంతమంది మాత్రం మిస్టర్ బచ్చన్ పెద్ద రాడ్ సినిమా అంటూ ఫైర్ అవుతున్నారు.తమ అభిమాన హీరో నటించిన సినిమాను విడుదలరోజే చూడాలంటే ఎవరైనా సరే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫస్ట్ చాయిస్‌గా పెట్టుకుంటారు. అయితే, తాజాగా అక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన రవితేజ అభిమాని ఒకరు దర్శకుడు హరీశ్ శంకర్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మిస్టర్ బచ్చన్ సినిమా బాగాలేదంటూ మీడియా వారితో తెలిపాడు. దర్శకుడు హరీశ్ శంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి వస్తే అభిమానులు చితక్కొడుతారని కామెంట్ చేశాడు. సినిమాలో విషయం ఉన్నా.. డైరెక్షన్ విభాగంలో లోపాలు ఉన్నాయని రవితేజ అభిమాని చెప్పుకొచ్చాడు. కేవలం హీరోయిన్‌తో పాటల కోసమే సినిమా తీశారేమో అనిపించేలా మిస్టర్ బచ్చన్ ఉందని కామెంట్ చేశాడు. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న దర్శకుడు ఇంత చెత్త సినిమా తీయడమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. హరీశ్ శంకర్ గారు.. దయచేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు రాకండి అంటూ వారు కామెంట్ చేశారు.అందమైన హీరోయిన్ పెట్టి రవితేజ సినిమాను నడిపించేద్దామని డైరెక్టర్ అనుకున్నారేమో అనే అభిప్రాయం నెటిజన్లలో వస్తుంది. ఇలాంటి సినిమాలు తీసి అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారనే కామెంట్లు వస్తున్నాయి. తమ డబ్బు రీఫండ్ చేస్తారా సార్ అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. -
మాస్ మహారాజా వచ్చేస్తున్నాడు.. మిస్టర్ బచ్చన్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా హీరో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో వీరిద్దరి కాంబోలో షాక్, మిరపకాయ్ లాంటి సినిమాలొచ్చాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఇటీవలే సితార్ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఆడియన్స్ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని రవితేజ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్‌గా రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. Get Ready!!#MrBachchan is Arriving..MASSive entertainment begins from this August 15th 🤙Premieres on AUG 14th.. pic.twitter.com/xkSEy5EUkW— Ravi Teja (@RaviTeja_offl) July 21, 2024 -
'కంగ్రాట్స్..నోబెల్ ప్రైజ్‌కు దరఖాస్తు చేసుకో'.. నెటిజన్‌కు డైరెక్టర్ కౌంటర్!
మాస్ మహరాజా రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటిస్తోన్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సితార్ అంటూ సాగే సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అయితే ఈ సాంగ్‌పై నెటిజన్స్ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్లను కేవలం ఓ వస్తువులాగే చూపిస్తారని మండిపడుతున్నారు. 56 ఏళ్ల రవితేజతో కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్యశ్రీతో అలాంటి స్టెప్స్ వేయింటడమేంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యమంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.అయితే దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందించారు. నెటిజన్‌కు రిప్లై ఇస్తూ..'కంగ్రాట్స్.. చాలా బాగా కనిపెట్టావ్.. నోబెల్ ప్రెజ్‌కు దరఖాస్తు చేసుకో.. అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు.. దీన్ని నువ్వు ఇలాగే కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్‌ను ప్రశ్నిస్తూ ఉండాలి.. నీలాంటి వారికి ఎప్పుడు వెల్కమ్ చెబూతూనే ఉంటా' అని ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇలాంటివి కేవలం సినిమాలాగే చూడాలంటూ మరికొందరు నెటిజన్స్ మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాటర్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Congratulations for the discovery.. i think you should apply for Nobel Prize… 👍👍 And pls continue objectifying film makers…. We welcome you https://t.co/g6J2pR0NXK— Harish Shankar .S (@harish2you) July 10, 2024 -
రవితేజ మిస్టర్ బచ్చన్.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ కనిపించనుంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'సితార్' అనే లిరికల్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు.మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్లో మరోసారి రవితేజ నటిస్తున్నారు. దీంతో మిస్టర్ బచ్చన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన సాంగ్‌కు సాహితీ లిరిక్స్ అందించారు. సాకేత్ కొముండూరి, సమీర భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
టెన్షన్ పడుతూనే ‘ఏటీఎం’ను ఎంజాయ్ చేస్తారు: దిల్ రాజు
బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్‌కి కథ అందించగా, జీ5 సంస్థతో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సిరీస్‌ని నిర్మించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ నుంచి మా అబ్బాయి హర్షిత్, అమ్మాయి హన్షితలను నిర్మాతలుగా మార్చి ఈ వెబ్ సిరీస్ చేయించాం. ట్రైలర్ చూడగానే సినిమా ట్రైలర్‌గానే అనిపించింది. చంద్ర మోహన్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసిన తీరు నచ్చింది. టెన్షన్ పడుతూనే సిరీస్‌ను ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘కొత్తగా కథలను చెప్పటానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బాగుంటుందని ఆలోచన వచ్చింది. అప్పుడు జీ 5 టీమ్‌తో కలిశాను. ఈ కథను నేనే రాశాను. కానీ.. డైరెక్టర్‌గా నాకంటే చంద్ర మోహన్ బాగా తీశాడనిపించింది’అని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు క్రిష్ జాగర్లమూడి , సి.చంద్ర మోహన్, హీరో వీజే సన్నీ, సుబ్బరాజ్, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత తదితరులు పాల్గొన్నారు. -
'ఘంటసాలకు భారతరత్న వస్తే అవార్డుకే అందం'
స్వాతంత్ర సమరయోధుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్రం అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నీలిమ గడ్డమణగు వ్యాఖ్యాతగా సెప్టెంబర్ 18న వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అంశంపై అమెరికాలోని శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ' మీరందరు విదేశాల్లో ఉండి కూడా ఘంటసాలకి భారతరత్న రావాలన్న మీ ప్రయత్నాలకు మా అందరి తరఫున అభినందనలు. ముఖ్యంగా ఘంటసాల కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం, అందరినీ కలుపుకొని పోవడం అభినందనీయం. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద.. స్వాతంత్ర సమరయోధుడు. వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడటం ఇలా అన్ని విధాలుగా వారు భారతరత్నకు అర్హులు' అని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం గురించి ఈ మధ్యనే విన్నా. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకే అందం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు అందిస్తే మా నాన్న నాకు ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని అందించారు. అదే మా నాన్న నాకిచ్చిన వారసత్వం. ఆయన పాటలు, సాహిత్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తానని' తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మా ముందు తరాల వారికీ ఆయన ఒక దేవుడు. సంగీతం లో గాన గంధర్వుడు. మంచి గాయకుడే కాకుండా 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాకు ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన రెండు సినిమాలు మాయాబజార్, గుండమ్మ కథ. ఆ సినిమాలో వారు పాడిన పాటలు ఇప్పటికి ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన శతజయంతి ఉత్సవాలు జరపడం గొప్ప విషయం. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఆయనకు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలని కోరారు. విదేశాల్లోని తెలుగు సంస్థలు, ఇతర సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో గతంలో ఘంటసాల కార్యక్రమాలకు సాంకేతిక సహాయం అందించిన ప్రమీలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, ప్రముఖ సింగర్స్ గీత మాధురి, మాళవిక, ఇండియన్ ఐడల్ రన్నరప్ రోహిత్, అనురూప్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యూఎస్ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్, లక్ష్మయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వరుసగా లైన్లో పెడుతున్నాడు
యంగ్ హీరో నాగచైతన్య ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే గౌతం మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. ఇలా మూడు సినిమాలతో బిజీగా ఉన్న చైతూ, ఇప్పుడు నాలుగో సినిమాను కూడా లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. గబ్బర్‌సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన హరీష్ శంకర్, ఇటీవల సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మరోసారి కమర్షియల్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో హరీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చైతు ప్లాన్ చేసుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుబ్రమణ్యం ఫర్ సేల్ తరువాత ఇంత వరకు సినిమా ఎనౌన్స్ చేయని హరీష్ శంకర్, నాగచైతన్య ఇమేజ్ తగ్గ కథ కోసం ట్రై చేస్తున్నాడు. కరెక్ట్ లైన్ దొరికితే త్వరలోనే ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేసి లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు చైతు. -
సుబ్రమణ్యం ఫర్ సేల్
‘‘ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన ‘రామయ్య వస్తావయ్యా’ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు’’ అని ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ నెల 27 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి మార్చి వరకూ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుతాం. ఏప్రిల్ నుంచి అమెరికాలో షూటింగ్ ఉంటుంది. వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘‘మిరపకాయ్’ టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను. అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. ‘గబ్బర్‌సింగ్’ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది’’ అని హరీశ్‌శంకర్ తెలిపారు. మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సాయిధరమ్‌తేజ్ అన్నారు. ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళ్తామా అని ఎదురు చూస్తున్నానని రెజీనా చెప్పారు. చిత్రబృందం కూడా సమావేశంలో పాల్గొన్నారు.