మాస్ మహారాజా హీరో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో వీరిద్దరి కాంబోలో షాక్, మిరపకాయ్ లాంటి సినిమాలొచ్చాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఇటీవలే సితార్ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఆడియన్స్ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని రవితేజ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్‌గా రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు.
Get Ready!!#MrBachchan is Arriving..
MASSive entertainment begins from this August 15th 🤙
Premieres on AUG 14th.. pic.twitter.com/xkSEy5EUkW— Ravi Teja (@RaviTeja_offl) July 21, 2024
Comments
Please login to add a commentAdd a comment