
మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ కనిపించనుంది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'సితార్' అనే లిరికల్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు.
మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరోసారి రవితేజ నటిస్తున్నారు. దీంతో మిస్టర్ బచ్చన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన సాంగ్‌కు సాహితీ లిరిక్స్ అందించారు. సాకేత్ కొముండూరి, సమీర భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment