మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాను ప్రకటించారు. గతేడాదిలో వరుణ్ తేజ్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన ఆమె సుమారు ఏడాదిపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. లావణ్య సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందంటూ కూడా నెట్టింట ప్రచారం జరిగింది. కానీ, నేడు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే, ఈ సినిమాతో కొణిదెల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ఉపయోగించడం విశేషం.
'సతీ లీలావతి' అనే టైటిల్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్నట్లు లావణ్య త్రిపాఠి ప్రకటించారు. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా ఒక వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంది. భీమిలీ కబడ్డీ జట్టు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్యనే ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు తన వివాహం అయిన తర్వాత గ్లామర్ రోల్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసి నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపే మొగ్గుచూపుతుంది. ఈ క్రమంలోనే సతీ లీలావతి చిత్రంలో డిఫరెంట్ రోల్‌లో కనిపించనుంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్న ఇతర నటీనటులు ఎవరనేది ఇంకా రివీల్ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment