
మిస్టర్ బచ్చన్.. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ అందుకుంది. పాత రవితేజను చూస్తారంటూ ఊదరగొట్టిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు కేవలం రూ.12.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.

దీంతో హరీశ్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడట! తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యాన్నాడంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. మిస్టర్ బచ్చన్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తనకు ఇచ్చిన రూ.15 కోట్లను నిర్మాతకు తిరిగిచ్చేస్తాడట! మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.
సినిమా విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment