Sumanth Aswin
-
హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ విడుదల
-
షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్
డిఫరెంట్ టేకింగ్‌తో ఆకట్టుకునే సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఫ్యాషన్ డిజైనర్. 80లలో తన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ లేడీస్ టైలర్‌కు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సన్నాఫ్ లేడీస్ టైలర్ అనే ట్యాగ్ లైన్‌ను జోడించారు. కొంత కాలంగా తన రేంజ్ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న వంశీ, ఫ్యాషన్ డిజైనర్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అంతకు ముందు ఆతరువాత, కేరింత లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాను మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన్ అనీషా ఆంబ్రోస్‌తో పాటు మరికొంత మంది ముద్దుగుమ్మలు ఆడిపాడనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఫ్యాషన్ డిజైనర్ కోసం ముగ్గురు భామలు
సీనియర్ దర్శకుడు వంశీ రూపొందించిన సూపర్ హిట్ సినిమాల్లో లేడీస్ టైలర్ ఒకటి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అడల్ట్ కామెడీకి దగ్గరగా ఉన్నా.. అప్పట్లో ఘనవిజయం సాధించింది. దీంతో చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వల్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు వంశీ. గతంలో ఈ రీమేక్ లో హీరోలుగా అల్లరి నరేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలు నటిస్తారన్న టాక్ వినిపించినా.. అవేవి సెట్స్ మీదకు రాలేదు. తాజాగా ఈ సినిమాను సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ముగ్గురు ముద్దుగుమ్మలు ఫైనల్ చేశారు. మనమంతా ఫేం అనీషా ఆంబ్రోస్ తో పాటు, మాసన హివవర్ష, మనాలీ రాథోడ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
'రైట్ రైట్' అన్నా స్పీడందుకునేలా లేదు..
స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్. మంచి సినిమాలతో మెప్పిస్తున్నా హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయినా తన ప్రయత్నాల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. లవర్స్, కేరింత లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరైన సుమంత్, ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా 'రైట్ రైట్'. పూర్తి పల్లె వాతావరణంలో తెరకెక్కిన రైట్ రైట్ సుమంత్ అశ్విన్ కెరీర్‌కు స్పీడు పెంచిందో లేదో చూద్దాం. తండ్రి మరణంతో పోలీస్ ఆఫీసర్ కావాలన్న తన కలను పక్కన పెట్టి కండక్టర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ఇ.రవి (సుమంత్ అశ్విన్). కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు రోజుకు ఒక్క ట్రిప్ మాత్రమే ఉండే గవిటి రూట్ అయితే బెటర్ అని రవికి అదే రూట్ డ్యూటీ వేస్తారు. వెళ్లే సమయమే కాని తిగిరి ఎప్పుడొస్తుందో చెప్పలేని గవిటి రూట్ బస్ డ్రైవర్ శేషు( కాలకేయ ప్రభాకర్). ఆ ఊరికి వెళ్లేది ఒక్క బస్సే కావటంతో బస్ డ్రైవర్, కండక్టర్లు ఊరి జనాలకు దగ్గరవుతారు. అదే బస్‌లో రెగ్యులర్‌గా వచ్చే కళ్యాణి(పూజ జవేరి)తో రవి ప్రేమలో పడతాడు. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా రవి, శేషుల బస్ కింద పడి ఓ వ్యక్తి గాయపడతాడు. కేసు అవుతుందన్న భయంతో ఆ వ్యక్తిని ఆ రూట్లో వస్తున్న జీపు డ్రైవర్‌కి అప్పగించి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తరువాత ఆ బస్ కింద పడిపోయిన వ్యక్తి గవిటి సర్పంచ్ విశ్వానాథ్ గారి అబ్బాయి దేవా అని తెలుస్తుంది. రవి జీపులో ఎక్కించి పంపించిన దేవా ఊరి బయట లోయలో శవమై కనిపిస్తాడు. ఆ నేరం రవి మీద పడుతుంది. అసలు దేవా ఎలా చనిపోయాడు..? ఆ కేసు నుంచి రవి ఎలా బయటపడ్డాడు..? అన్నదే మిగతా కథ. ఇప్పటి వరకు అల్లరి పాత్రల్లో కనిపించిన సుమంత్ అశ్విన్ తొలిసారిగా ఓ బరువైన పాత్రను ఎంచుకొని విజయం సాధించాడు. డ్రైవర్ శేషుగా ప్రభాకర్ బాగా సెట్ అయ్యాడు. క్యారెక్టర్ పరంగా పెద్దగా స్కోప్ లేకపోయినా హీరోయిన్ పాత్రలో పూజ ఆకట్టుకుంది. పల్లె వాతావరణంలో సాగే లవ్ స్టోరికి చిన్న క్రైం ఎలిమెంట్ యాడ్ చేసి దర్శకుడు మను చేసిన ప్రయత్నం బాగానే ఉన్నా.. కథనం లో మరింత వేగం చూపించాల్సింది. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్ కలిగించే పాయింట్లు పెద్దగా లేకపోవటం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరితో కథ నడిపిన దర్శకుడు స్లో నారేషన్తో ఇబ్బంది పెట్టాడు. ఇక సెకండ్ హాఫ్‌లో క్రైం థ్రిల్లర్‌గా టర్న్ అయినా కథలో వేగం మాత్రం కనిపించలేదు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద ఆవిష్కరించాడు. జెబి సంగీతం పర్వాలేదు. ఓవరాల్‌గా ప్రభాకర్‌తో కలిసి సుమంత్ అశ్విన్ రైట్ రైట్ అన్నా కెరీర్ మాత్రం స్పీడందుకునేలా లేదు. -
వినసొంపుగానే కాదు... కనువిందుగా కూడా...!
‘‘ఈ చిత్రం పాటలు నాకు ప్రత్యేకం. ఎందుకంటే దాదాపు ఎనభై శాతం సినిమా పాటలతోనే సాగుతుంది. పాటలన్నీ బాగున్నాయి. ఆ ఘనత సంగీతదర్శకుడు మిక్కీ జె.మేయర్‌కి దక్కుతుంది. వినసొంపుగా ఉన్న ఈ పాటలు కనువిందు చేస్తాయి’’ అని హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మించిన చిత్రం ‘చక్కిలిగింత’. సుమంత్ అశ్విన్, రెహానా జంటగా నటించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని పాత్రికేయుల సమావేశంలో వేమారెడ్డి చెబుతూ - ‘‘ఈ చిత్రానికి పాటలు స్వరపరచాలని మిక్కీని కోరిప్పుడు కథ నచ్చితేనే అన్నారు. కథ విన్న తర్వాత ఒప్పుకున్నారు. మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. వేమారెడ్డితో సినిమా చేయడం ఆనందంగా ఉందనీ, సుమంత్, రెహానా కెమిస్ట్రీ అందరికీ నచ్చుతుందని మిక్కీ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రానికి కాగితం, కలమే నిజమైన నిర్మాతలు. ఆ రెండూ ఎవరో కాదు.. మా వేమారెడ్డి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. -
ఎంజాయ్ చేస్తారు
‘‘నేను ‘కొత్త జంట’ సినిమా చేస్తున్నప్పుడు హరి ఈ చిత్రకథ చెప్పారు. అప్పుడు కొన్ని సలహాలిచ్చాను. హరి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ‘మనసంతా నువ్వే’ ఎలాంటి అనుభూతికి గురి చేసిందో, ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు అలాంటి మంచి అనుభూతినే మిగులుస్తుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆయన సమర్పణలో మహేంద్రబాబు .బి, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లవర్స్’. సుమంత్ అశ్విన్, నందిత, షామిలి ముఖ్య తారలుగా హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేబీ పాటలు స్వరపరిచారు. ఆడియో విజయం సాధించిన నేపథ్యంలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో జరిపారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీవీ వినాయక్, బోయపాటి శ్రీనివాస్, దశరథ్, బెల్లంకొండ సురేష్ తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ఈ మధ్యకాలంలో వారం గ్యాప్‌లో అల్లుడు శీను, రన్ రాజా రన్, గీతాంజలి చిత్రాలు విడుదల చేశాను. అవి విజయం సాధించాయి. ఇప్పుడు నైజాంలో విడుదల చేయనున్న ఈ ‘లవర్స్’ కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రంలో నటించాననీ, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని సుమంత్ అశ్విన్ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు. -
సరికొత్త లవర్స్
‘‘టైటిల్ చాలా బావుంది. క్లీన్ ఎంటర్టైనర్లా అనిపిస్తోంది. ఈ సినిమాతో మారుతిపై ఉన్న బూతు బ్రాండ్ పోతుందనుకుంటున్నాను’’ అని నితిన్ చెప్పారు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరి దర్శకత్వంలో మారుతి సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు నిర్మిస్తోన్న ‘లవర్స్’ టీజర్ ఆవిష్కరణ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను నితిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ -‘‘రషెస్ చూశాను. చాలా సరదాగా వచ్చింది. ‘ప్రేమకథా చిత్రమ్’ కంటే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు. కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, షూటింగ్ టైమ్‌లోనూ అంతే ఎంజాయ్ చేశానని సుమంత్ అశ్విన్ తెలిపారు. ఇందులో తనది చాలా మంచి పాత్ర అని నందిత చెప్పారు. సంగీత దర్శకుడు జె.బి., దర్శక నిర్మాతలు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హార్భట్ జోషి.