ఫ్యాషన్ డిజైనర్ కోసం ముగ్గురు భామలు
సీనియర్ దర్శకుడు వంశీ రూపొందించిన సూపర్ హిట్ సినిమాల్లో లేడీస్ టైలర్ ఒకటి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అడల్ట్ కామెడీకి దగ్గరగా ఉన్నా.. అప్పట్లో ఘనవిజయం సాధించింది. దీంతో చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వల్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు వంశీ. గతంలో ఈ రీమేక్ లో హీరోలుగా అల్లరి నరేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలు నటిస్తారన్న టాక్ వినిపించినా.. అవేవి సెట్స్ మీదకు రాలేదు.
తాజాగా ఈ సినిమాను సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ముగ్గురు ముద్దుగుమ్మలు ఫైనల్ చేశారు. మనమంతా ఫేం అనీషా ఆంబ్రోస్ తో పాటు, మాసన హివవర్ష, మనాలీ రాథోడ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.