ఎంజాయ్ చేస్తారు | every one will enjoy | Sakshi
Sakshi News home page

ఎంజాయ్ చేస్తారు

Published Tue, Aug 12 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

ఎంజాయ్ చేస్తారు

ఎంజాయ్ చేస్తారు

‘‘నేను ‘కొత్త జంట’ సినిమా చేస్తున్నప్పుడు హరి ఈ చిత్రకథ చెప్పారు. అప్పుడు కొన్ని సలహాలిచ్చాను. హరి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ‘మనసంతా నువ్వే’ ఎలాంటి అనుభూతికి గురి చేసిందో, ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు అలాంటి మంచి అనుభూతినే మిగులుస్తుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆయన సమర్పణలో మహేంద్రబాబు .బి, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లవర్స్’. సుమంత్ అశ్విన్, నందిత, షామిలి ముఖ్య తారలుగా హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేబీ పాటలు స్వరపరిచారు.
 
ఆడియో విజయం సాధించిన నేపథ్యంలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో జరిపారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీవీ వినాయక్, బోయపాటి శ్రీనివాస్, దశరథ్, బెల్లంకొండ సురేష్ తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ఈ మధ్యకాలంలో వారం గ్యాప్‌లో అల్లుడు శీను, రన్ రాజా రన్, గీతాంజలి చిత్రాలు విడుదల చేశాను. అవి విజయం సాధించాయి. ఇప్పుడు నైజాంలో విడుదల చేయనున్న ఈ ‘లవర్స్’ కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రంలో నటించాననీ, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని సుమంత్ అశ్విన్ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement