షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్
డిఫరెంట్ టేకింగ్తో ఆకట్టుకునే సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఫ్యాషన్ డిజైనర్. 80లలో తన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ లేడీస్ టైలర్కు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సన్నాఫ్ లేడీస్ టైలర్ అనే ట్యాగ్ లైన్ను జోడించారు. కొంత కాలంగా తన రేంజ్ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న వంశీ, ఫ్యాషన్ డిజైనర్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.
అంతకు ముందు ఆతరువాత, కేరింత లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాను మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన్ అనీషా ఆంబ్రోస్తో పాటు మరికొంత మంది ముద్దుగుమ్మలు ఆడిపాడనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.