
నాని(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ నుంచి లవ్ ట్రాక్ సాంగ్ విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. యునానిమస్ ప్రోడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్నారు.
హిట్ సినిమా నుంచి తాజాగా విడుదలైన సాంగ్‌ను సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించారు. లవ్ ట్రాక్ సాంగ్స్ పాడటంలో సిద్ శ్రీరామ్‌కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని అభిమానులు చెబుతుంటారు. ఇప్పుడు హిట్ మూవీలో 'ప్రేమ వెల్లువ' అనే సాంగ్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. మిక్కీ జె. మేయర్( Mickey J Meyer) ఇచ్చిన మ్యూజిక్ కూడా బాగుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సాంగ్స్ భారీ హిట్ అయ్యాయి.