శబరిమలకు వెళ్లే ముందు కొందరు ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని నటి రంజిత ఆవేదనను వ్యక్తం చేశారు. ఈమె శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలను అనుమతించడాన్ని ఆమె వ్యతిరేకించారు. తమిళంలో ముదల్ మర్యాదై చిత్రాల్లో నటించిన రంజిత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటోంది.
ఇటీవల శబరిమలకు వెళ్లడానికి మహిళలు అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో శబరిమల అయ్యప్ప దేవాలయం వద్ద పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా మంది మహిళలు తాము అయ్యప్ప దర్శనం చేసుకునే తీరరతామని బయలుదేరడంతో అక్కడ వాతావరణం రణరంగంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొందరు మహిళలు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ శబరిమలకు వెళ్లడానికి వేచి చూస్తాం.. అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
అందులో నటి రంజిత కూడా సభ్యురాలిగా ఉన్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో శబరిమల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటికి నిప్పంటించుకోవడం వల్ల అక్కడ పరిస్థితులు మళ్లీ సమస్యగా మారాయని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయం వద్ద అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో నిజమైన భక్తులకు స్వామి దర్శనం చేసుకోలేని పరిస్థితి అని పేర్కొన్నారు.
ఆ మధ్య రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆమె సమర్థించారు. దీంతో కొందరు మహిళలు.. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరి కొందరు శబరిమలకు వెళ్లే ముందు తన ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని, ఈ చర్యలు క్రిమినల్ కేసు కిందకు రావా? అంటూ నటి రంజిత శనివారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment