ranjitha
-
‘పూజారమ్మా... అర్చన చెయ్యి’.. ఇక అక్కడ ఇదే మాట వినపడుతుంది
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు. ‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు. గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు. అందరూ యోగ్యులే డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది. దేవుడు కూడా బిడ్డడే ‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్‌లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య. తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు. -
కైలాస దేశ ప్రధానిగా నిత్యానంద ప్రియ శిష్యురాలు, నటి!
భారత్‌లోని ప్రజలకు నమ్మకాలు ఎక్కువ. ఈ నమ్మకాలనే పెట్టుబడి పెట్టుకుని కొందరు స్వామిజీలు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ భారీగా సంపాదించారు. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు, దారుణాలకు ఒడిగట్టారు. అందులో ఒకరే స్వామి నిత్యానంద. ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురుకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఒకప్పటి హీరోయిన్ రంజితతో ఆయన ఏకాంతంగా కలిసున్న దృశ్యాలు టీవీ, సోషల్ మీడియాల్లో మార్మోగిపోయాయి. 2019లో దేశం విడిచి పరార్ అడ్డంగా దొరికిపోయినప్పటికీ అదంతా అబద్ధమని బుకాయించారు. అప్పటి నుంచి నిత్యానందను వివాదాలు చుట్టుముడుతూనే వచ్చాయి. ఆ తర్వాత అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించాడు. కానీ ఇంతవరకు ఈ కైలాస దేశం ఎక్కడుందనే స్పష్టత లేదు. తాజాగా ఈ దేశానికి తన ప్రియ శిష్యురాలు, మాజీ నటి రంజితను ప్రధానిని చేసినట్లు కోలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రియ శిష్యురాలు ప్రధానిగా ఈ విషయాన్ని నిత్యానంద వెబ్సైట్లో పేర్కొన్నారని ఓ తమిళ పత్రిక రాసుకొచ్చింది. కానీ సదరు వెబ్సైట్లో మాత్రం అటువంటి వివరాలేమీ కనిపించలేదు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరపున మహిళా రాయబారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరీ రంజిత? కన్నడ సినిమాల్లో నటించిన రంజిత అప్పటితరానికి సుపరిచితమే! తమిళనాడుకు చెందిన ఆమె 1975, జూన్ 4న జన్మించింది. సీనియర్ నటుడు అశోక్ కుమార్ కూతురే రంజిత. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి. భారతిరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో ‘నాదోడి థెండ్రల్’ తమిళ సినిమాతో రంగప్రవేశం చేసింది. కొంతకాలానికే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. అక్కాచెల్లెళ్లు విడాకులిచ్చి నిత్యానంద చెంతకు సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్ రాకేశ్ మీనన్‌తో ఆమె వివాహమైంది. మొదట్లో వీరిద్దరూ బాగానే ఉన్నారు. కానీ తర్వాత నిత్యానంద మాయలో పడటంతో 2017లో భర్తకు విడాకులిచ్చింది. నిత్యానంద ఆశ్రమానికి తన నివాసాన్ని షిఫ్ట్ చేసిన ఆమె 2013 చివర్లో ఆనందమయిగా పేరు మార్చుకుంది. రంజితతో పాటు ఆమె సోదరి కూడా భర్తకు విడాకులిచ్చి నిత్యానందతోపాటు దేశం వదిలి వెళ్లిపోయింది. చదవండి: లవ్ టుడే హీరోయిన్ ఇంత తీవ్ర విషాదం.. -
రంజిత బాధితురాలు కాదు కాబట్టి..
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానందస్వామిజీపై కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను రామనగర కోర్టు రద్దు చేసింది. నిత్యానంద అనేకసార్లు కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 6న అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో నిత్యానంద కోర్టుకు అర్జీ సమర్పించగా విచారణ జరిపిన జిల్లా సింగిల్ బెంచ్ కోర్టు జడ్జీ దినేశ్‌కుమార్ సదరు అరెస్టు వారెంట్‌ను రద్దు చేస్తూ తీర్పు నిచ్చారు. ఇదే కేసులో మరో నిందితుడు శివ వల్లభనేని అనే వ్యక్తిపై జారీ చేయబడిన అరెస్టు వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. ఇదే సందర్భంగా సినీనటి రంజిత నిత్యానందపై ఉన్న అత్యాచారం కేసులో ప్రాసిక్యూషన్‌కు సహాయంగా ఉండడానికి అవకాశం కల్పించాలని పెట్టుకున్న అర్జిని కొట్టేసిన తీర్పును ప్రశ్నిస్తూ మరోసారి పెట్టుకున్న అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. రంజిత బాధితురాలు కాదు కాబట్టి ఆమె పెట్టుకున్న అర్జీని తిరస్కరించడం సబబుగానే ఉందని కోర్టు మరోసారి అభిప్రాయపడింది. -
ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు!
శబరిమలకు వెళ్లే ముందు కొందరు ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని నటి రంజిత ఆవేదనను వ్యక్తం చేశారు. ఈమె శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలను అనుమతించడాన్ని ఆమె వ్యతిరేకించారు. తమిళంలో ముదల్ మర్యాదై చిత్రాల్లో నటించిన రంజిత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటోంది. ఇటీవల శబరిమలకు వెళ్లడానికి మహిళలు అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో శబరిమల అయ్యప్ప దేవాలయం వద్ద పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా మంది మహిళలు తాము అయ్యప్ప దర్శనం చేసుకునే తీరరతామని బయలుదేరడంతో అక్కడ వాతావరణం రణరంగంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొందరు మహిళలు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ శబరిమలకు వెళ్లడానికి వేచి చూస్తాం.. అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో నటి రంజిత కూడా సభ్యురాలిగా ఉన్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో శబరిమల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటికి నిప్పంటించుకోవడం వల్ల అక్కడ పరిస్థితులు మళ్లీ సమస్యగా మారాయని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయం వద్ద అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో నిజమైన భక్తులకు స్వామి దర్శనం చేసుకోలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఆ మధ్య రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆమె సమర్థించారు. దీంతో కొందరు మహిళలు.. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరి కొందరు శబరిమలకు వెళ్లే ముందు తన ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని, ఈ చర్యలు క్రిమినల్ కేసు కిందకు రావా? అంటూ నటి రంజిత శనివారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ వాపోయారు. -
రంజితగా మారిన శ్రీవల్లి!
వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో కలకలం రేగింది. ఒకప్పటి హీరోయిన్ రంజిత, ఆయన ఏకాంతంగా కలిసి ఉన్న దృశ్యాలు దక్షిణాదిలోని టీవీ చానెళ్లు పదేపదే ప్రచారం చేశాయి. అయితే ఈ వీడియోలో ఉన్నది తాము కాదని, మార్ఫింగ్ జరిగిందని వీరిద్దరూ వాదించారు. ఈ టేపుల్లో ఉన్నది ఎవరో తేల్చాలని కోర్టు కెక్కారు కూడా. వీడియో టేపులు ట్యాంపరింగ్ జరగలేదని బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ గతంలో స్పష్టం చేసింది. ఈ నివేదికను నిత్యానంద సవాల్ చేశారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా వీడియో ఉన్నది వీరిద్దరేనని తాజాగా నిర్ధారించడంతో నిత్యానంద, రంజిత వాదన అబ్ధమని తేలిపోయింది. ఎవరీ రంజిత..? తమిళనాడుకు చెందిన రంజిత 1975, జూన్ 4న జన్మించింది. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి. భారతిరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో ‘నాదోడి థెండ్రల్’ తమిళ సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత ఆమె అగ్ర కథానాయకిగా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర కథానాయకులతో నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. ఆమె వాలీబాల్ క్రీడాకారిణి కూడా. పెళ్లి-విడాకులు సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్ రాకేశ్ మీనన్‌తో ఆమె వివాహమైంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. పెళ్లైన తర్వాత ఏడాది పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న రంజిత 2001లో మళ్లీ పునఃప్రవేశం చేసింది. సహాయ పాత్రల్లో నటిస్తూ, టీవీ షోలు కూడా చేసింది. 2007లో భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. చివరిసారిగా 2010లో మణిరత్నం ‘రావణన్’ సినిమాలో కనిపించింది. వీడియోతో వెలుగులోకి.. స్వామి నిత్యానందతో ఏకాంతంగా గడిపిన వీడియో బహిర్గతం కావడంతో రంజిత పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది. సన్ టీవీ ఈ వీడియోను పదేపదే ప్రసారం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ వీడియోలో ఉన్నది తాను కాదని రంజిత వాదించింది. తర్వాత కూడా ఆమె నిత్యానంద ఆశ్రమంలోనే ఉండిపోయింది. 2013, డిసెంబర్ 27న సన్యాసం స్వీకరించి ఆనందమయిగా పేరు మార్చుకుంది. బెంగళూరు శివారులోని నిత్యానంద ఆశ్రమంలో సన్యాసినిగా జీవితం గడుపుతోంది. -
నటి రంజిత పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, తమిళ సినిమా(చెన్నై): స్వామి నిత్యానంద కేసును పునః విచారణ జరిపించాలని నటి రంజిత ఇదివరకే మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరో వారానికి వాయిదా పడింది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద, నటి రంజిత సన్నిహితంగా ఉన్న వీడియో 2010లో ఒక టీవీ చానల్ ప్రసారం చేసి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అది నకిలీ వీడియో అంటూ నిత్యానంద ఆశ్రమానికి చెందిన ఒక నిర్వాహకుడు స్థానిక పాండిబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో కొందరు ఆ వీడియోను చూపి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అందులో శ్రీధర్, లెనిన్, అయ్యప్పన్, ఆర్తిరావ్ తదితరులను నేరస్తులుగా పేర్కొని దర్యాప్తు చేశారు. అనంతరం ఈ కేసును సీబీసీఐడీ చేపట్టింది. ఈ కేసు విచారణ స్థానిక సైదాపేట కోర్టులో తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నటి రంజిత మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సీబీసీఐడీ కోర్టుకు దాఖలు చేసిన చార్జ్ షీటులో నేరస్తురాలిగా పేర్కొన్న ఆర్తిరావ్ ఈమెయిల్‌ను సరిగా పరిశీలించలేదని, ఆమె వినయ్ భరద్వాజ్ కలిసి కట్ర పన్నారని తన పిటిషన్లో రంజిత ఆరోపించారు. వారి ఈమెయిల్‌లను క్షుణంగా పరిశీలించాలని కోరారు. అదేవిధంగా నిత్యానంద కేసు విచారణ కర్ణాటక కోర్టులో జరుగుతోందని, అక్కడి పోలీసులు అసలు వీడియోను పరిశీలించకుండా నకిలీ వీడియోతో దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల ఈ కేసుపై పునఃవిచారణ జరిపించాలని ఆమె కోరారు. కాగా ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్.రమేష్ సమక్షంలో విచారణకు వచ్చింది. రంజిత తరపున న్యాయవాది ఇళయరాజా హాజరై వాదించారు. ఈ పిటిషన్‌పై తగిన బదులివ్వాల్సిందిగా న్యాయమూర్తి సీబీసీఐడీ పోలీసులకు ఉత్తర్వులు జారీచేసి విచారణను మరో వారానికి వాయిదా వేశారు. -
శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద గురువారం శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. తన అనుంగు శిష్యురాలు రజితతో కలిసి శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిత్యానంద అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యానంద, రజితలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని అడ్డుకున్నారు. ఫొటోగ్రాఫర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నిత్యానంద, రజిత మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. భక్తులు మాత్రం వీరిద్దరినీ ఆసక్తిగా గమనించారు. -
నిత్యానందా... ఏమిటిదంతా?
నిత్యా'ఆనందం'లో మునిగితేలే స్వాములోరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శిష్యురాళ్ల 'అంతరంగిక సేవ'తో తరించే ఈ స్వయంప్రకటిత దేవుడికి పట్టరాని కోపం వచ్చింది. తన ప్రవచనాలతో భక్తులకు జ్ఞానబోధ చేసే ధ్యాన పీఠాధిపతి ఒంటికాలిపై లేచారు. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అలగా జనంపై స్వాములోనే చెణుకులు విసిరి చిక్కుల్లో పడ్డారు. అయినా చిక్కుల్లో పడడం చాకచక్యంగా తప్పించుకోవడం నిత్యానందుల వారికి 'వీడియో'తో పెట్టిన విద్య. అనుంగు శిష్యురాలు రంజితతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు రెచ్చకెక్కినప్పడు స్వాములోరు చూపిన సాహసం నిరూపమానం. తన దగ్గర 'విషయం' లేదని... విషయం లేకుండా వ్యవహారం ఎలా సాధ్యమంటూ ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో అంతవరకు స్వామిపై ఉన్న కోపం తగ్గిపోయి జాలి కలిగింది. 'రంజిత'నందాన్ని కొంతకాలం పక్కనపెట్టి పర్వత ప్రాంతాలకు పోతే అక్కడ కూడా స్వామలోరికి సుఖం లేదు. నిత్యానందుడు పర్వత సరస్సుల్లో విహరిస్తున్నారని ఛాయా చిత్రాలతో బయటపెట్టింది పాడులోకం. అన్ని మర్చిపోయి హాయిగా భక్తులతో కాలక్షేపం చేస్తున్న సర్వసంగ పరిత్యాగిని మళ్లీ యాగీ చేయడం న్యాయమా? అందుకో కాబోలు స్వామిలోరికి అంత కోపం వచ్చింది. కన్నడ భాష పేరిట తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారంతా డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 300 రూపాయల కోసం ఆశపడి మూడు గంటల ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి వారికి తనపై కోపం లేదని జాలి చూపారు. ఉద్యమానికి నేతృత్వం వహించే వారే కార్యకర్తల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పరమ సత్యం వెల్లడించారు. నిత్యానందుల వారికి అంతా అలా తెలిసిపోతుటుంది మరి! -
శ్రీవారిని దర్శించుకున్న నిత్యానంద, రంజిత
తిరుమల: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ధ్యాన పీఠాధిపతి నిత్యానంద స్వామి, ఆయన అంతరంగిక శిష్యురాలు, మాజీ నటి రంజిత బుధవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వీరు శిష్యబృందంతో కలసి ఆలయానికి వచ్చారు. అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వద్ద మీడియా ఉండటాన్ని చూసిన రంజిత దూరంగా వెళ్లిపోయారు. చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని నిత్యానంద శిష్యబృందం ‘వద్దు..వద్దు..’ అంటూ అడ్డుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
శ్రీవారి ఆలయంలో నిత్యానంద దర్శనం
-
తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం
తిరుమల : గత కొద్ది కాలంగా అజ్ఞాతంలో ఉంటున్న వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు స్వామి నిత్యానంద, ఆయన సహాయకరాలు రంజిత బుధవారం తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో నిత్యానంద తన శిష్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాషాయ వేషధారణలో ఉన్న రంజిత...నిత్యానందతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు నిత్యానంద నిరాకరించారు. కాగా రంజిత ఇటీవలే బెంగళూరులోని బిడిది ధ్యానపీఠంలో సన్యాసం స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె తన పేరును మా ఆనందమయి గా మార్చుకుంది.